Shivathmika: దగ్గరగా చూస్తే కానీ తెలియలేదు శివాత్మిక అసలైన అందాలు... జూమ్ చేసి చూపించి గుండె జామ్ చేసింది!
జూమ్ షాట్ లో శివాత్మిక అసలైన అందాలు పరిచయం చేసింది. కట్టిపడేసే సౌందర్యం తనలో ఉన్న ఆత్మవిశ్వాసం ప్రదర్శించింది.
shivathmika Rajashekar
నటిగా సక్సెస్ కావాలంటే ముఖ తేజస్సు చాలా అవసరం. ఆ ఆకర్షణే చాలా మంది ఆర్డినరీ అమ్మాయిలను స్టార్స్ చేసింది. ఆ ప్రత్యేకత శివాత్మికలో కూడా ఉందనిపిస్తుంది. ముఖాన్ని జూమ్ చేసి స్మైలీ ఫేస్ రివీల్ చేసిన శివాత్మిక ఆకట్టుకున్నారు. శివాత్మిక ఫేస్ కట్ చూసి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
shivathmika Rajashekar
శివాత్మిక సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు . ఈ క్రమంలో అందాలతో మేకర్స్ దృష్టి తనవైపు మరలేలా చేసుకుంటుంది. శివాత్మిక సోషల్ మీడియా వేదికగా సూపర్ హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు.
Shivathmika Rajashekar
శివాత్మిక(Shivathmika Rajashekar) లేటెస్ట్ మూవీ పంచతంత్రం డిసెంబర్ 9న విడుదలైంది. హృదయాన్ని కదిలించే సామాజిక కోణాలు కథలుగా తీసుకొని ఎమోషనల్ డ్రామాగా పంచతంత్రం తెరకెక్కింది. పంచతంత్రం క్రిటిక్స్ ప్రశంసలు అందుకుంది. కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ఈ క్లాస్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులు పట్టించుకోలేదు.
కాగా హీరో రాజశేఖర్-జీవిత వారసురాలిగా శివాత్మిక వెండితెరకు పరిచయమయ్యారు. 2019లో విడుదలైన దొరసాని ఆమె మొదటి చిత్రం. ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ఈ పీరియాడిక్ లవ్ ఎంటర్టైనర్ పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే కమర్షియల్ గా ఆడలేదు. అయినప్పటికీ మొదటి చిత్రంతోనే శివాత్మిక తన మార్క్ చూపించింది. నటిగా నిరూపించుకుంది.
రంగమార్తాండ మూవీలో శివాత్మిక నటిస్తున్నారు. దర్శకుడు కృష్ణవంశీ చాలా కాలంగా రంగమార్తాండ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. వారి కూతురుగా శివాత్మిక నటిస్తున్నట్లు సమాచారం. ఇది మరాఠీ చిత్రం రీమేక్. ఈ మూవీ విడుదలకు సిద్ధం అవుతుంది.
తమిళంలో కూడా శివాత్మికకు ఆఫర్స్ వస్తున్నాయి. అయితే చెప్పుకోదగ్గ పాత్ర ఇంకా ఆమె తలుపు తట్టలేదు. కనీసం టైర్ టు హీరోలు కూడా పట్టించుకోవడం లేదు. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిల పట్ల చిన్న చూపు ఉంటుంది. ఇప్పుడిప్పుడే నటిగా ఎదిగే ప్రయత్నం చేస్తున్న శివాత్మిక కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి. మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఆమె ఫాలోయింగ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది.