MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Prabhas: ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరు? రాజమౌళి చెప్పిన రహస్యం..

Prabhas: ప్రభాస్‌కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరు? రాజమౌళి చెప్పిన రహస్యం..

Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల్లో యాక్షన్ సీన్స్ అదరగొడతారు.. కాని రియల్ లైఫ్ లో మాత్రం చాలా కూల్ గా కనిపిస్తాడు. అసలు కోపం రాదా అన్నట్టు ఉంటాడు. ప్రభాస్ కు విపరీతంగా కోపం తెప్పించే ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? రాజమౌళి చెప్పిన అతి పెద్ద రహస్యం.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 06 2026, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ప్రభాస్   రాజమౌళి అనుబంధం..
Image Credit : Asianet News

ప్రభాస్ - రాజమౌళి అనుబంధం..

టాలీవుడ్ లో మాత్రమే కాదు.. పాన్ ఇండియా వైడ్ గా చూసుకుంటే... దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి - రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్‌కు ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'ఛత్రపతి', 'బాహుబలి' వంటి అద్భుతమైన సినిమాలతో.. ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన వీరిద్దరి మధ్య షూటింగ్ సెట్స్‌లోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఎంతో అనుబంధం ఉంది. ప్రభాస్ గురించి అంతా తెలిసిన వ్యక్తి రాజమౌళి. ఆయన గురించి చాలా సందర్భాల్లో చాలా విషయాలను జక్కన్న పంచుకున్నారు. ఇక ఒక టాక్ షోలో రాజమౌళి.. ప్రభాస్‌కు సెట్స్‌లో ఎవరి మీద ఎక్కువ కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఎలా వ్యక్తం చేస్తారో సరదాగా ఇమిటేట్ చేస్తూ చెప్పారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కెమెరామెన్ సెంథిల్ కుమార్ ‘పెర్ఫెక్ట్’ వర్క్
Image Credit : Asianet News

కెమెరామెన్ సెంథిల్ కుమార్ ‘పెర్ఫెక్ట్’ వర్క్

రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభాస్‌కు షూటింగ్ సమయంలో అత్యంత ఎక్కువగా కోపం తెప్పించే వ్యక్తి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె. కె. సెంథిల్ కుమార్. రాజమౌళి కంటే కూడా సెంథిల్ కుమార్ పనుల్లో తీవ్రమైన పెర్ఫెక్షనిస్ట్ అని, తను అనుకున్నది పక్కాగా వచ్చేవరకు వదిలిపెట్టడని రాజమౌళి అన్నారు.

సాధారణంగా అవుట్‌డోర్ షూటింగ్‌లలో ఎండ, మేఘాల వల్ల కాంతి మారినప్పుడు లైటింగ్ మీటర్ ద్వారా లైట్ ఇంటెన్సిటీ చెక్ చేయడం సహజం. కానీ, సెంథిల్ కుమార్ ఇండోర్ కానీ స్టూడియో సెటప్‌లలో లైట్ల ఇంటెన్సిటీ అస్సలు మారదని తెలిసినప్పటికీ... లైట్ సెటప్ పదిసార్లు పక్కాగా చెక్ చేయిస్తాడు. అసిస్టెంట్లతో పదే పదే చెకింగ్ చేయించిన తర్వాత కూడా సంతృప్తి చెందక, స్వయంగా వెళ్లి మళ్ళీ చెక్ చేస్తాడని రాజమౌళి పేర్కొన్నారు.

34
ప్రభాస్ కు ఎవరిమీద కోపం వస్తుందంటే?
Image Credit : Asianet News

ప్రభాస్ కు ఎవరిమీద కోపం వస్తుందంటే?

యాక్టర్స్ పూర్తి మేకప్, కాస్ట్యూమ్స్‌తో లైటింగ్ సెటప్ మధ్యకు వచ్చి షాట్ కోసం సిద్ధంగా ఉన్నప్పటికీ, సెంథిల్ కుమార్ మళ్లీ వారి ముఖం దగ్గరకు లైట్ మీటర్ తీసుకొచ్చి రీడింగ్స్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇలా పదే పదే లైటింగ్ చెకింగ్స్ చేస్తూ ఆలస్యం చేయడం వల్ల సెట్స్‌లో ప్రభాస్‌కు విపరీతమైన కోపం వచ్చేదని రాజమౌళి నవ్వుతూ గుర్తు చేసుకున్నారు.

44
ప్రభాస్ కోపం.. రాజమౌళి ఇమిటేషన్!
Image Credit : Asianet News

ప్రభాస్ కోపం.. రాజమౌళి ఇమిటేషన్!

ఎంత కోపం వచ్చినా ప్రభాస్ ఎవరినీ గట్టిగా తిట్టడం గానీ, అరిచి గొడవ పడడం గానీ చేయరు. తనమార్క్ డైలాగ్ ఒకటి ఉంటుంది.... అలసట, కోపం కలగలిపిన స్వరంతో "ఏయ్ సెంథిల్.. ఎంతసేపయ్యా.. ఎన్నాళ్లయ్యా ఇలా?" అంటూ అసహనం వ్యక్తం చేస్తారని రాజమౌళి ప్రభాస్ ను ఇమిటేట్ చేసి చూపించారు.

రాజమౌళి ఈ విషయాన్ని ఇమిటేట్ చేస్తూ చెబుతున్నంత సేపూ పక్కనే ఉన్న ప్రభాస్ నవ్వు ఆపుకోలేక నవ్వడం విశేషం.సినిమా నిర్మాణంలో ఎంతటి సీరియస్ పని ఉన్నప్పటికీ, తెర వెనుక ప్రభాస్-రాజమౌళి-సెంథిల్ కుమార్ మధ్య ఉన్న ఈ సరదా అనుబంధమే వారి కలయికలో వచ్చని చిత్రాలను అద్భుతాలు చేయించిందని చెప్పవచ్చు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
ఎస్.ఎస్. రాజమౌళి
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva: 'దాన్ని మైంటైన్ చేస్తున్నావా అన్నాడు'.. ముకేశ్, అపూర్వ మధ్య పర్సనల్ కామెంట్స్ తో దద్దరిల్లిన హౌస్
Recommended image2
Rukmini Vasanth: కన్నడ నాట సంచలనం సృష్టిస్తున్న మూవీ.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న రుక్మిణీ వసంత్
Recommended image3
Jailer 2 Trailer: జైలర్ 2 ట్రైలర్ రివ్యూ, అది మీ డాడీ కాలం స్థాయి.. ముత్తువేల్ పాండియన్ గా రజనీ అరాచకం
Related Stories
Recommended image1
Mohan Babu: రోడ్డున పడతాడని తెలిసినా.. మోహన్ బాబు చేసిన సాహసం, 7 ప్లాప్ ల తర్వాత బయటపడ్డ డైలాగ్ కింగ్..
Recommended image2
Vijay Deverakonda: రష్మికను పెళ్లి చేసుకోవడానికి ఒక్కటే కారణం.. అసలు గుట్టు విప్పిన విజయ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved