- Home
- Entertainment
- శివాత్మిక రాజశేఖర్ హాఫ్ శారీలో టెంప్టింగ్ లుక్.. విరహంతో పడుచు అందాలు చూపిస్తూ రచ్చ
శివాత్మిక రాజశేఖర్ హాఫ్ శారీలో టెంప్టింగ్ లుక్.. విరహంతో పడుచు అందాలు చూపిస్తూ రచ్చ
నేచురల్ బ్యూటీ శివాత్మిక రాజశేఖర్ అద్బుతమైన నటనతో ఆకట్టుకోవడంతోపాటు అంతే హాట్‌గా ముస్తాబై కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేయడం వెన్నతో పెట్టిన విద్యే. ఇప్పుడు మరోసారి మైండ్ బ్లాక్ చేస్తుందీ అందాల భామ.

శివాత్మిక రాజశేఖర్..ఇటీవల వరుసగా తన గ్లామర్ ఫోటోల సిరీస్‌తో ఆకట్టుకుంది. అందులో భాగంగా శివాత్మిక తాజాగా మరింత హాట్‌గా, మరింత కవ్వించే ఫోటోలను పంచుకుంది. బాపు బొమ్మలా మారిపోయింది. హాఫ్ శారీలో అదరగొడుతుంది. బ్లాక్ అండ్ వైట్‌లో మెస్మరైజ్ చేస్తుంది.
తాజాగా శివాత్మిక బ్లాక్ అండ్ వైట్ ఫోటోని షేర్ చేసింది. ఇందులో ఆమె వ్యామోహంలో మునిగిపోయింది. విరహాన్ని దాచుకుని ఆమె ఇచ్చిన పోజు మైండ్ బ్లోయింగ్ అనేలా ఉంది. దీంతోపాటు బాపు బొమ్మలా పోజులిచ్చిందీ నేచురల్ బ్యూటీ. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో ఎర్రని కొంగు, గోల్డ్ కలర్ బ్లౌజ్, ఎల్లో లెహంగా ధరించింది. బుట్టబొమ్మలా, బాపు గీసిన బొమ్మలా మారిపోతూ హోయలు పోయింది. పడుచు పోరీలో ఆకట్టుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇన్‌స్టా స్టోరీస్‌లో అభిమానులతో షేర్ చేసింది. దీంతో ఈ బ్యూటీ పిక్స్ కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ఇంటర్నెట్‌లో రచ్చ చేస్తున్నాయి.
నేచురల్ అందంతో కట్టిపడేస్తుంది శివాత్మిక. స్వతహాగా హాట్ నెస్ కలిగిన ఈ బ్యూటీ డస్కీ అందాలతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. జెన్యూన్‌గా తన గ్లామర్‌ని పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. విశేష నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటుంది. అందుకే ఈ బ్యూటీ ఇంటర్నెట్‌లో మంచి క్రేజ్ ఉంటుంది.
ఇక నటిగా మరింత ఆకట్టుకుంటుంది శివాత్మిక. ఆమె ఇప్పటికే నటిగా తానేంటో నిరూపించుకుంది. ఇటీవల వచ్చిన `రంగమార్తాండ`లో తన నటన లోతులను ఆవిష్కరించింది. సహజమైన నటనతో మెప్పించింది. పాత్రలో జీవించింది. అందుకే అందరికంటే శివాత్మికకే ఎక్కువ ప్రశంసలు దక్కడం విశేషం.
అంతకు ముందు మొదటి సినిమా `దొరసాని`తోనే ఆకట్టుకుంది. ఇన్నోసెంట్‌గా, సెటిల్డ్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఆ తర్వాత `పంచతంత్రం` చిత్రంలోనూ కాసేపు ఉన్న హుందాగా కనిపించి ఆకట్టుకుంది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని, మార్క్ ని వేసుకుంది. ఇప్పుడు సరైన స్క్రిప్ట్ ల కోసం వెయిట్ చేస్తుందీ అందాల ముద్దుగుమ్మ.