- Home
- Entertainment
- బిగువైన బ్లౌజ్‌లో హాట్ ట్రీట్ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్.. ర్యాంప్ పై వాక్ చేస్తూ పిచ్చెక్కించే పోజులు..
బిగువైన బ్లౌజ్‌లో హాట్ ట్రీట్ ఇచ్చిన శివాత్మిక రాజశేఖర్.. ర్యాంప్ పై వాక్ చేస్తూ పిచ్చెక్కించే పోజులు..
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ ర్యాంప్‌పై మెరిసింది. సహజమైన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు ర్యాంప్ పై వాక్ చేస్తూ చూపురుల మతిపోగొట్టింది.

శివాత్మిక రాజశేఖర్ అందాల విందుతో అదరగొట్టింది. బిగువైనబ్లౌజ్ ధరించి హోయలు పోయింది. లేత పింక్ కలర్ లెహంగాలో అదిరిపోయే పోజులిచ్చింది. ర్యాంప్ పై వాక్ చేస్తూ కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలు ఇంటర్నెట్‌ని బ్రేక్ చేస్తుండటం విశేషం.
శివాత్మిక తాజాగా `టీచ్ ఫర్ ఛేంజ్` అనే ఎన్జీవో ఫండ్ రైజింగ్ ఈవెంట్‌లో పాల్గొంది. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య, ఇతర వసతులు కల్పించే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంస్థ ఈ ఏడాదికిగానూ ఫండ్ రైజింగ్ ఈవెంట్‌ని నిర్వహించింది. హైదరాబాద్‌లోని వెస్టిన్ హోటల్‌లో `మారియట్ బోన్వాయ్ షాదీ` కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో టాలీవుడ్ సెలబ్రిటీలు, మోడల్స్ పాల్గొన్నారు. టీచ్ ఫర్ చేంజ్ ట్రస్ట్ సీఈఓ బ్రహ్మచారి చైతన్య మాట్లాడుతూ నాణ్యమైన విద్యను పేద, మధ్యతరగతికి చెందిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు అందించేందుకు మా సంస్థ ఎప్పుడూ కృషి చేస్తుందన్నారు.248 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 42,080 మంది విద్యార్థులపై ప్రభావం చూపుతోంది అన్నారు.
అందులో భాగంగా శివాత్మిక పాల్గొంది. సాంప్రదాయం, ట్రెండ్ మేళవించిన దుస్తుల్లో మెరిసింది. చిలిపి నవ్వులు, హాట్ పోజులు, కొంటె లుక్స్ తో హోయలు పోయింది. చూపరుల మతిపోగొట్టింది. తన హాట్ అందాలతో ఫిదా చేసింది. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు ఇప్పుడు అటు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుండటం విశేషం.
శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా స్లో అయ్యింది. `దొరసాని` చిత్రంతో తెలుగు తెరకి పరిచయం అయిన ఈ రాజశేఖర్ తనయ ఆ తర్వాత హీరోయిన్‌గా అవకాశాలు దక్కించుకోవడంలో శ్రమించాల్సి వస్తుంది. అరుదుగా ఆమెకి అవకాశాలు వస్తుండటం విశేషం.
`దొరసాని`తో మంచి పేరుని, గుర్తింపుని,ప్రశంసలను అందుకుంది. ఆమె సెటిల్డ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. అయితే హీరోయిన్‌గా జోరు పెరుగుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. అడపాదడపా అవకాశాలు వరించాయి. ఆమె కూడా చాలా సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తూ వస్తుంది.
శివాత్మిక తమిళంలో రెండు సినిమాలు చేసింది. అందులో `ఆకాశం` అనే మూవీ తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. గతేడాది విడుదలైన ఈ సినిమా ప్రశంసలందుకుంది గానీ, కలెక్షన్లని రాబట్టలేకపోయింది.మరోవైపు తెలుగులోనూ ఈ బ్యూటీ `పంచతంత్రం` అనే చిత్రంలో నటించింది. ఐదు కథలున్న ఈ సినిమాలో ఓ కథలో మెచ్యూర్డ్ జంటగా మెరిసింది. ఉన్న కాసేపే అయినా మెప్పించింది. మెచ్యూర్డ్ యాక్టింగ్‌తో అదరగొట్టింది. నటిగా మంచి మార్కులేసుకుంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ `రంగమార్తాండ` చిత్రంలో రాహుల్ సిప్లిగంజ్ కి జోడీగా నటించింది. ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఇందులోనూ శివాత్మిక ఓ కీలక పాత్రలోనే మెరిసింది.
ఇదిలా ఉంటే సినిమాలు పక్కన పెడితే గ్లామర్ షోతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది శివాత్మిక. తన సహజమైన అందాలతో నెటిజన్లని ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో క్రేజ్‌తోపాటు తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ హాట్ బ్యూటీ.