- Home
- Entertainment
- సెల్ఫీ పోజులతోనే వేడి పుట్టిస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఆ కొంటె పోజులు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
సెల్ఫీ పోజులతోనే వేడి పుట్టిస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఆ కొంటె పోజులు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. నటనతో మెస్మరైజ్ చేస్తుంది. అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ కుర్రాళ్లని తన వెంట పడేలా చేసుకుంటుందీ స్టార్ తనయ.

శివాత్మిక సహజమైన నటి అని ఇటీవల నిరూపించుకుంది. ఆమె నటించిన `పంచతంత్రం`, `రంగమార్తాండ` చిత్రాలతో రచ్చ చేసింది. తనలో సహజమైన నటి ఉన్నాడనే విషయాన్ని దర్శకులు, క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. దానికి తగ్గట్టే ఆమె అద్భుతమైన నటనతో మెప్పించింది. ఒక అప్‌కమింగ్ హీరోయిన్ ఈ రేంజ్‌లో నటన ప్రదర్శించడం విశేషమనే చెప్పాలి.
శివాత్మిక రాజశేఖర్ నటించింది ఐదు సినిమాలే అయినా చాలా ఇంపాక్ట్ చూపించింది. తమిళంలో ఆమె రెండు సినిమాలు చేసింది. తెలుగులో మూడు సినిమాల్లో మెరిసింది. `పంచతంత్రం`లో ఆమెది జస్ట్ కీలకపాత్ర అనే చెప్పాలి. అయినా హైలైట్‌గా నిలిచింది.
ఇక `రంగమార్తాండ` చిత్రంలో మాత్రం ఆమె తనలోని నెక్ట్స్ లెవల్ చూపించింది. ఓ వైపు ప్రకాష్ రాజ్, మరోవైపు బ్రహ్మానందం వంటి దిగ్గజాలతో కలిసి నటించింది. వారితో పోటీపడిందని చెప్పాలి. చాలా సహజంగా ఆమె హవాభావాలు పలికించడం విశేషం. దీంతో ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, తేజ వంటి వారు ఆమె నటనని ప్రత్యేకంగా అభినందించారు.
ఇలా కెరీర్ ప్రారంభంలోనే మంచి నటిగా పేరుతెచ్చుకోవడం అరుదైన విషయమనే చెప్పాలి. హీరోయిన్లు అంటే గ్లామర్ ట్రీట్‌కే ప్రయారిటీ ఇస్తారు. అలా వచ్చి ఇలా పోయే పాత్రలే చేస్తారు. కేవలం హీరోలకు రొమాంటిక్ పెయిర్‌గానే కనిపిస్తారు. కానీ అందుకు భిన్నంగా వెళ్తుంది శివాత్మిక. బలమైన కంటెంట్ ఉన్న చిత్రాలకే ప్రయారిటీ ఇస్తుందీ రాజశేఖర్ తనయ.
అదే ఆమెని ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలిపింది. తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేస్తుంది. అందుకే కొత్త ప్రాజెక్ట్ ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. చర్చల దశలో ఉన్నట్టు సమాచారం. అయితే ఎలాంటి సినిమాలు చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరోవైపు గ్లామర్ షో విషయంలోనూ తగ్గేదెలే అంటోంది శివాత్మిక రాజశేఖర్. నేచురల్ అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఆమె డేరింగ్‌గా తన ఒరిజినల్ లుక్ ని చూపించి ఆశ్చర్యపరుస్తుంది. ఆమెలోని ఈ డేర్ నెస్సే నెటిజన్లని ఆకట్టుకుంటుంది. ఆమెకి ఫాలోవర్స్ గా మార్చుతుంది.
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్.. నటనతో మెస్మరైజ్ చేస్తుంది. అందంతో మంత్రముగ్దుల్ని చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ కుర్రాళ్లని తన వెంట పడేలా చేసుకుంటుందీ స్టార్ తనయ.