- Home
- Entertainment
- హాట్ యాంగిల్లోనే కాదు క్యూట్ లుక్‌లోనూ కట్టిపడేస్తున్న శివాత్మిక.. క్లోజప్ షాట్‌లో మైండ్ బ్లోయింగ్
హాట్ యాంగిల్లోనే కాదు క్యూట్ లుక్‌లోనూ కట్టిపడేస్తున్న శివాత్మిక.. క్లోజప్ షాట్‌లో మైండ్ బ్లోయింగ్
స్టార్ కిడ్ శివాత్మిక రాజశేఖర్ హాట్ హాట్ అందాలతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అయితే ఇప్పుడు కాస్త రూట్ మార్చింది. కట్టిపడేస్తుంది.

హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajashekar) `దొరసాని` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ కి పరిచయమైంది. ఆ సినిమా తర్వాత వెండితెరపై మళ్లీ కనిపించలేదు. కానీ ఇంటర్నెట్‌లో మాత్రం రెగ్యూలర్‌గా కనిపిస్తుంది. ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే బతికేస్తుందా? అనేట్టుగా ఉంటుందీ ఆమె పెట్టే పోస్ట్ లు.
తాజాగా శివాత్మిక తన నయా పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. క్లోజప్ షాట్స్ లో అందాలను దగ్గరగా చూపిస్తూ ఆకట్టుకుంటుంది. అయితే జనరల్‌గా శివాత్మిక చాలా హాట్‌గా ఉంటుంది. వాటిని చూస్తే కుర్రాళ్ల చిత్తైపోవాల్సిందే అనేట్టుగా ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆమె సరికొత్తగా కనిపిస్తుంది. Shivathmika Rajashekar Cute Photos.
హాట్ లుక్‌లో ఎంతగా ఆకట్టుకుంటుందో, క్యూట్ నెస్‌లోనూ ఆమె అందం రెట్టింపు కావడం విశేషం. ఈ లేటెస్ట్ క్యూట్ లుక్‌లో శివాత్మికలోని అందం మరింత పెరిగిందని చెప్పొచ్చడంలో అతిశయోక్తి లేదు. చీర కట్టులో శివాత్మిక పంచుకున్న ఈ లేటెస్ట్ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అభిమానులను తెగ ఆకర్షిస్తున్నాయి. చిలిపిగా చూస్తూ శివాత్మిక ఎంతగానో మెస్మరైజ్ చేస్తుంది.
శివాత్మిక తండ్రి, హీరో రాజశేఖర్ నటించిన `శేఖర్` సినిమా ఈ నెల 20న విడుదల కాబోతుంది. దీంతో చిత్ర ప్రమోషన్‌లో పాల్గొంటూ తండ్రికి వెన్నంటి ఉంటోంది. ఈ చిత్రానికి తల్లి జీవిత రాజశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం. అక్క శివానీ కీలక పాత్ర పోషించింది. చిత్ర ప్రమోషన్‌లో తనవంతు భాగమవుతూ ఏదో రూపంలో ఆమె ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తుంది.
నిజానికి `శేఖర్` మూవీ రాజశేఖర్ ఫ్యామిలీకి చాలా ప్రతిష్టాత్మకమైంది. హిట్ అయితే వారంతా హ్యాపీ అవుతారు. లేదంటే కెరీర్ పరంగా, ఆర్థికంగానూ అందరి పరిస్థితి కాస్త ఇబ్బందుల్లో పడుతుందనే టాక్ వినిపిస్తుంది. అందుకే ఎంతో ఆశతో ఉన్నారు.
మరోవైపు శివాత్మిక వరుసగా సినిమాలతో ఆడియెన్స్ ముందుకొచ్చేందుకు రెడీ అవుతుంది. `దొరసాని` చిత్రం తర్వాత ఆమె నుంచి మరో చిత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో `పంచతంత్రం`, `రంగమార్తాండ` సినిమాలు చేస్తుంది. ఇందులో `పంచతంత్రం` విడుదలకు రెడీ అవుతుంది. తమిళంలోనూ రెండు సినిమాలు చేస్తుంది శివాత్మిక. అందులో ఓ సినిమా తెలుగులో `ఆకాశం` పేరుతో రిలీజ్ కాబోతుంది. మరో సినిమా చిత్రీకరణ దశలో ఉంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న `రంగమార్తాండ` సైతం రిలీజ్‌కి రెడీ అవుతుందట. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడం గమనార్హం.
కెరీర్ పరంగా చాలా సెలక్టీవ్‌గా వెళ్తుంది శివాత్మిక. హీరోయిన్‌గానే చేయడం కాకుండా కీ రోల్స్ కూడా చేస్తుంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో ఆమె ఎక్కువగా బలమైన పాత్రలు కలిగినవే కావడం విశేషం. మరోవైపు సామాజిక మాధ్యమాల్లోనే ఏదో హాట్ ఫోటోలను పంచుకోవడం కాదు, అందులో ఏంతో పోయెటిక్ అంశాలుంటాయి. కొన్నిసార్లు మేకప్ లేకుండా కూడా ఫోటోలను షేర్ చేస్తూ సహజమైన అందాలను ఆవిష్కరిస్తూ తన నిజాయితీని చాటుకుంటుంది. అభిమానుల్ని పెంచుకుంటుంది శివాత్మిక. ఆమె ధైర్యాన్ని చూసే అభిమానులుగా మారే నెటిజన్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
శివాత్మిక ఎప్పటికప్పుడు తన సినిమాలకు సంబంధించి, తన వ్యక్తిగత విషయాలకు సంబంధించిన అప్‌డేట్లని ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన చేసే ప్రతి పనిని ఇన్‌స్టాలో పంచుకుంటుంది. తన అక్క శివానీ, ఫ్రెండ్ ఈషారెబ్బాతో కలిసి ఈ అమ్మడు చేసే రచ్చ అంతా ఇంతా కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ ముగ్గురు కలిస్తే రచ్చ రచ్చే అవుతుంది.