MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • కమల్ హాసన్ ని హగ్ చేసుకొని, 3 రోజులు స్నానం చేయలేదన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

కమల్ హాసన్ ని హగ్ చేసుకొని, 3 రోజులు స్నానం చేయలేదన్న స్టార్ హీరో ఎవరో తెలుసా?

కమల్ హాసన్ కు తాను వీరాభిమానిని అన్నారు ఓ స్టార్ హీరో. ఆయనను హగ్ చేసుకుని తాను మూడు రోజులు స్నానం కూడా చేయలేదు అన్నారు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో? ఎందుకు స్నానంచేయలేదు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 28 2025, 06:22 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : ANI

ఇండియన్ సినిమాలో కోట్లాది ఫ్యాన్స్ ను సంపాదించుకుని, లోకనాయకుడు అనిపించుకున్నాడు కమల్ హాసన్‌. ఆయనకు సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎందరో అభిమానులు ఉన్నారు. స్టార్ హీరోలు కూడా కమల్ హాసన్ నటనకు ఫిదా అవుతుంటారు. ఈ క్రమంలో ఓ స్టార్ హీరో అయితే కమల్ హాసన్ కు హగ్ ఇచ్చి 3 రోజులు స్నానం చేయలేదట. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : our own

కమల్ హాసన్ అంటే స్టార్ నటులు కూడా ఆదర్శంగా తీసుకుంటుంటారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ఎందరో ఫ్యాన్స్ ఉన్నారు లోకనాయకుడికి. రీసెంట్ గా కమల్ పై తనకున్న ఆత్మీయతను అందరి ముందు షేర్ చేసుకున్నారు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఇటీవల ఓ కార్యక్రమంలో భావోద్వేగంగా పంచుకున్నారు. చెన్నైలో జరిగిన కమల్ హాసన్ థగ్ లైఫ్ ఆడియో ఈవెంట్‌ ఈ కామెంట్స్ చేశారు శివరాజ్ కుమార్.

35
Image Credit : Instagram

ఈ కార్యక్రమానికి గెస్ట్‌గా హాజరైన శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, కమల్ హాసన్‌తో తన తొలి సన్నిహిత అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. "ఒకసారి కమల్ సర్‌ మా ఇంటికి వచ్చారు. నాన్నగారు డాక్టర్ రాజ్‌కుమార్‌గారితో మాట్లాడుతుండగా నేను పక్కన నిలబడి వారిని గమనిస్తూ ఉన్నాను. 

ఆ సమయంలో ఆయన నా వైపు తిరిగి చేతులు కలిపారు. నేను ఆయన్ని కౌగిలించుకోవచ్చా అని అడిగితే, ఆయన నవ్వుతూ ఒప్పుకున్నారు. ఆ కౌగిలింత తర్వాత మూడు రోజుల పాటు నేను స్నానం చేయలేదు. ఆయన వాసన నాపై అలాగే ఉండాలని కోరుకున్నాను. ఆయనంటే నాకు అలాంటి అభిమానం," అని చెప్పారు. ఈ మాటలతో ప్రేక్షకులు సైతం ఎమోషనల్ గా ఫీల్ అయ్యి చప్పట్లు కొట్టారు.

45
Image Credit : X

ఇక తాను క్యాన్సర్‌తో పోరాడుతున్న సమయంలో కమల్ హాసన్ చేసిన ఓ ఫోన్ కాల్ గురించి చెప్పిన శివరాజ్ కుమార్, "ఆ కాల్ మాట్లాడుతున్నంత సేపు మా నాన్నగారు రాజ్‌కుమార్‌గారి స్వరం విన్నట్లు అనిపించింది. ఆ మాటలు నాకు బలాన్నిచ్చాయి," అని తెలిపారు.

55
Image Credit : Google

శివరాజ్ కుమార్ చేసిన ఈ ఎమోషనల్ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కమల్ హాసన్‌కి ఉన్న అభిమానం, గౌరవం స్టార్ హీరో మాటల ద్వారా ఇలా మరోసారి వెల్లడైంది. థగ్ లైఫ్ ఆడియో ఈవెంట్‌ సందర్భంగా శివరాజ్ కుమార్ చెప్పిన ఈ సందర్భం అభిమానులకు ఎంతో ఇన్‌స్పిరేషనల్‌ అయ్యింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nidhhi Agerwal: తెలుగు అబ్బాయిలంటేనే ఇష్టం, పెళ్లి కూడా చేసుకుంటా, నిధి అగర్వాల్ కామెంట్స్ వైరల్
Recommended image2
Ranabaali Sensor Review: ఒక్క కట్ కూడా లేదు.. విజయ్ దేవరకొండ సినిమాపై షాకింగ్ కామెంట్స్, రణబాలి సెన్సార్ రివ్యూ
Recommended image3
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పాడిన 10 పాటలు.. సింగర్‌గా అదరగొట్టిన పవర్ స్టార్!
Related Stories
Recommended image1
థగ్ లైఫ్ సినిమా సూపర్ హిట్, ఇది నా ప్రామిస్, కమల్ హాసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image2
16 కోట్ల ఖర్చు పెడితే, 400 కోట్లు వసూలు చేసిన సినిమా ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved