మిస్ ఇండియా ట్రోఫీకి అతి చేరువలో శివానీ రాజశేఖర్, ప్రస్తుతం ఏ ప్లేస్ లో ఉందంటే..?
తెలుగు నుంచి మిస్ ఇండియా పోటీలో దూసుకుపోతోంది శివాని రాజశేఖర్. సడెన్ గా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అనౌన్స్ చేసి సర్ ప్రైజ్ చేసింది బ్యూటీ. మరి ఇంతకీ శివాని మిస్ ఇండియా పోటీలో ఏ ప్లేస్ లో ఉందో తెలుసా..?

హీరోయిన్ గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది సీనియర్ మీరో రాజశేఖర్ గారాల కూతురు శివాని రాజశేఖర్. అయితే ముందుగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వాలని చాలా ప్రయత్నం చేసింది శివాని. కాని కుదరకపోడంతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ.
శివాని నటించిన రెండు సినిమాలు కూడా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. మొత్తానికి సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కాస్తా.. ఓటీటీ ఎంట్రీ అయింది. అద్భుతం, WWW సినిమాలతో శివానీ రాజశేఖర్ ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. ఆమెకు నటిగా ఈసినిమాలు మంచి గుర్తింపునిచ్చాయి.
అయితే ఆమె నటించిన చిత్రాల్లో కొన్ని క్యాన్సిల్ అయ్యాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. అలా అడివి శేష్‌తో తీసిన ఓ సినిమా మధ్యలోనే అటకెక్కేసింది. అలా శివానీ రాజశేఖర్ ఎంట్రీ చివరకు ఓటీటీ ద్వారా అయింది. ఇక ఇప్పుడు తెలుగుతో పటు తమిళంలో కూడా హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తుంది శివాని.
ఇక శివానీకి మోడలింగ్ అంటే చాలా ఇష్టమున్నట్టుంది. మోడలింగ్ లో ముందు వెళ్లాలనిగట్టిగా ప్రయత్నం చేస్తోంది.తాజాగా ఆమె ఫెమినా మిస్ ఇండియా 2022 పోటీలో పాల్గొననున్నట్లు తెలుపుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకుంది.
నేను కొత్త సాహసం చేస్తున్నాను. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మిస్ ఇండియా ఆర్గనైజేషన్‌కు ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించండి అంటూ కోరింది శివాని రాజశేఖర్. అంతే కాదు తన తోటి కాంపిటేటర్ కు కూడా ఆమె ఆల్ ది బెస్ట్ టు ది లవ్‌లీ లేడీస్ అంటూ రాసుకొచ్చింది.
ఇక శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి టాప్ 8 ఫైనలిస్టులో ఉంది. తాను ఎనిమిదో స్థానంలో నిలిచినట్లు ఇన్‌స్టాలో వెల్లడించింది. శివాని రాజశేఖర్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించగా.. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించిన వారు కూడా ఈ ఫైనలిస్టులో ఉన్నారు.
ఎలాగైనా మిస్ ఇండియా టైటిల్ కొట్టాలని పట్టుదలతో ఉంది శివాని. అటు ఆ ప్రయత్నాలు చేస్తూనే.. ఇటు హీరోయిన్ గా కూడా తనపని తాను చేసుకుపోతోంది. శివాని సోదరి శివాత్మిక కూడా హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణిస్తుంది. అటు కోలీవుడ్ లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తుంది బ్యూటీ.