- Home
- Entertainment
- Ibomma: శృంగారం లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు.. దసరా విలన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్
Ibomma: శృంగారం లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేడు.. దసరా విలన్ రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్
Vivekanandan Viral: దసరా చిత్రంలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోకి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. దేవర, డాకు మహారాజ్ ఇలా భారీ చిత్రాల్లో షైన్ టామ్ కి అవకాశాలు వస్తున్నాయి.

Vivekanandan Viral Movie
Vivekanandan Viral: దసరా చిత్రంలో విలన్ గా నటించిన షైన్ టామ్ చాకోకి తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. దేవర, డాకు మహారాజ్ ఇలా భారీ చిత్రాల్లో షైన్ టామ్ కి అవకాశాలు వస్తున్నాయి. అతడి విలక్షణ నటన ప్రతి ఒక్కరికి నచ్చేస్తోంది. దసరా చిత్రంలో మహిళలపై వ్యామోహం ఉండే సైకో పాత్రలో నటించాడు.
Vivekanandan Viral
గత ఏడాది షైన్ టామ్ మలయాళంలో 'వివేకానందన్ వైరల్' అనే చిత్రంలో నటించాడు. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ కమల్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. గత ఏడాది థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ తాజాగా ఓటిటిలో రిలీజ్ అయింది. ఆహా ఓటిటిలో ఈ చిత్రం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. రొమాంటిక్ థ్రిల్లర్ కావడంతో ఈ చిత్రంలో ఐదుగురు హీరోయిన్లు నటించారు. శ్వాసిక, గ్రేస్ ఆంటోని, మెరీనా మైఖేల్, రమ్య సురేష్, మంజు పిళ్ళై హీరోయిన్లుగా నటించారు.
Shine Tom Chacko
వివేకానందన్ (షైన్ టామ్) ప్రభుత్వ ఉద్యోగి. ఒక మహిళని పెళ్లి చేసుకుని మరో మహిళతో సీక్రెట్ గా లివిన్ రిలేషన్ కొనసాగిస్తుంటారు. జల్సాలు చేసే వివేకానందన్ ఒక్క రోజు కూడా శృంగారం లేకుండా ఉండలేడు. అంతలా అతడికి వ్యామోహం ఉంటుంది.
Shine Tom Chacko
అతడి నిజస్వరూపం తెలిసి అతడి భార్య ఏం చేసింది.. ఆ ఐదుగురు మహిళల స్టోరీ ఏంటి లాంటి అంశాలు సినిమా చూసి తెలుసుకోవాలి. ఆహాలో తెలుగు వర్షన్ రిలీజ్ కాగా టొరెంట్ వెబ్ సైట్ ఐబొమ్మలో కూడా ఈ చిత్రం లీక్ అయింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ చిత్రాన్ని చూసేందుకు యువత ఎగబడుతున్నారు.