ఆ తర్వాత నాగచైతన్యతో `దోచెయ్` చిత్రంలో నటించింది. ఈ మూవీ కూడా ఆడలేదు. తెలుగులో చేసిన రెండు సినిమాలు ఆడలేదు. దీంతో హిందీకే ఫిక్స్ అయ్యింది.
Image credits: instagram/@kritisanon
Telugu
నిరాశ పరిచిన ప్రభాస్
చాలా ఏళ్ల తర్వాత ఇటీవల `ఆదిపురుష్`లో సీతగా నటించింది. ప్రభాస్ హీరోగా ఓం రౌత్ రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా కృతికి టాలీవుడ్ కలిసి రాలేదు.
Image credits: instagram/@kritisanon
Telugu
అల్లు అర్జున్‌పై కామెంట్
సక్సెస్ తో సంబంధం లేకుండా హీరోయిన్‌గా రాణిస్తోన్న కృతి సనన్ తాజాగా ఆసక్తికర కామెంట్ చేసింది. అల్లు అర్జున్ పై మనసు పడింది. ఆయనతో కలిసి నటించాలని ఉందని తెలిపింది.
Image credits: instagram/@kritisanon
Telugu
బన్నీపై ప్రశంసలు
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కృతి సనన్ మాట్లాడుతూ, ఐకాన్ స్టార్‌పై ప్రశంసలు కురిపించింది. ఆయన అద్భుతమైన నటుడు అని పేర్కొంది.
Image credits: facebook.com/AlluArjun
Telugu
అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తా
నటుడిగా అల్లు అర్జున్ అంటే ఇష్టం. ఆయన అద్భుతమై నటుడు. సరైన ప్రాజెక్ట్ వస్తే, ఆయనతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను అని పేర్కొంది.
Image credits: instagram/@kritisanon
Telugu
`కాక్‌టెయిల్ 2`తో కృతి బిజీ
ప్రస్తుతం కృతి సనన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆమె హిందీలో `కాక్‌టెయిల్ 2`లో నటిస్తోంది. ఇటీవల `అమరకావ్యం`లో మెరిసింది.