MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Oke Oka Jeevitham Review: ఒకే ఒక జీవితం రివ్యూ ... ఈసారైనా శర్వానంద్ కు విజయం దక్కిందా...?

Oke Oka Jeevitham Review: ఒకే ఒక జీవితం రివ్యూ ... ఈసారైనా శర్వానంద్ కు విజయం దక్కిందా...?

శర్వానంద్, అమలా అక్కినేని తల్లి కొడుకులుగా.. వెన్నెల కిషోర్, ప్రియదర్శి ముఖ్య పాత్రల్లో నటించిన సినిమా ఒకే ఒక జీవితం. శ్రీ కార్తిక్ డైరెక్ట్ చేసిన ఈసినిమాకు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు.ఈరోజు(9 సెప్టెంబర్ ) ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  మరి వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతన్న శర్వానంద్ కు ఈ సినిమా ఊరటనిచ్చిందా..? ఈ సినిమాతో శర్వా హిట్ కొట్టినట్టేనా..? అసలు సినిమా ఎలా ఉంది చూద్దాం.  

4 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 09 2022, 06:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మ్యూజిక్ లో  టాప్ పొజీషన్ కు రావాలని కష్టపడుతుంటాడు ఆది(శర్వానంద్) తనతో పాటు తన స్నేహితులు చైతూ( ప్రిదర్శి) శ్రీను (వెన్నెల కిశోర్) లు కూడా కలిసి ఉంటారు.  సంగీత ప్రపంచాన్ని ఏలలి అన్న లక్ష్యంతో సాగిపోతున్న ఆది  జీవితంలో చాలా ఫెయిల్యూర్స్ ఎదురవుతుంటాయి. చిన్నతనంలో తనను బాగా ప్రోత్సహించిన అమ్మను సడెన్ గా కోల్పోతాడు ఆది. దాంతో తన జీవితం అంతా అయోమయం అవుతుంది. ఏళ్లు గడుస్తున్నా తనలో ఏదో తెలియని నిరుత్సాహం అలా ఉండిపోతుంది. ఇలా జీవితం సాగుతున్న టైమ్ లో వీరికి సైంటిస్ట్ రంగి కుట్టపాల్(నాజర్) పరిచయం అవుతుంది. అతను వీరిని బాల్యం లోకి తీసుకెళ్తాడు.. ఇక వారు  బాల్యంలోకి వెళ్లి ఏం సాధించారు. తిరికి వచ్చారా లేదా..? ముగ్గురి కష్టాలు తీరాయా లేదా..? అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే.
 

27

టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో చాలా సినిమాలు వచ్చాయి. రీసెంట్ గా బింబిసార కూడా ఇదే కాన్సెప్ట్ తో వచ్చిందే. కాని ఎవరికి వారు డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడానికి చూశారు. ఈసినిమా కూడా అంతే.  సినిమాన చాలా ఇంట్రెస్ట్ కలిగేలా డ్రైవ్ చేశారు దర్శకుడు. అమ్మ కోసం పరితపించే ఆది, ప్రేమించిన అమ్మాయి కోసం చైతూ.. మంచిగా చదువుకుని ఉంటే జీవితం ఇలా అయ్యేది కాదు అని బాధపడే శ్రీను.. ఇలా  ముగ్గురు తాము అనుకున్న బాల్యంలోకి వెళ్లి ఏం చేశారు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్.  సినిమా ఇంట్రవెల్ ట్విస్ట్  ను ఆడియన్స్ ఎక్స్ పెక్ట్ చేయన విధంగా మలిచాడు దర్శకుడు. ఇక సెకండ్ హాఫ్ అంతా అమ్మ సెంటిమెంట్ తో పాటు.. బాల్యంలో ఎన్నో ఆటలు మనకు గుర్తుకు వచ్చేశా చేశారు  సినిమాతో. ముఖ్యంగా అమ్మ సెంటిమెంట్ అందరికి కంటతడి పెట్టిస్తుంది.  కాకపోతే సెకండ్ హాఫ్ లో కాస్త సాగతీద కనిపించింది.  ఫస్ట్ హాఫ్ చూసిన ఆడియన్స్ ఊహించకున్నదానికంటు సెకండ్ హాఫ్ అంత గొప్పగా లేదు అనే భావన తీసుకు వచ్చారు. 

37

ఇక నటీనటుల విషయానికి వస్తే.. శర్వానంద్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవల్సింది ఏముంది.. అందరికి తెలిసిందే.. చాలా నేచురల్ గా పెర్ఫామ్ చేసే హీరోలలో నానీ తరువాత శర్వానందే గుర్తుకు వస్తాడు అందరికి. ఈ సినిమాలో కూడా మరోసారి  నటుడిగా మెరిశారు. అమ్మ సెంటిమెంట్ ను అద్భుతమైన హావాభావాలతో పలికించి .. కళ్లతోనే మెస్మరైజ్ చేశాడు శర్వానంద్. ఇక పదేళ్ల తరువాత కనిపించినా..అమలా అక్కినేని నటనలో మాత్రం ఏమాత్రం పదును తగ్గలేదు. అమ్మగా ఆమె నటన అద్భుతం అని చెప్పాలి.  అమ్మగా.. రెగ్యులర్, సీజనల్ ఆర్టిస్టులు, సీనియర్ హీరోయిన్లను కాకుండా ఆమెను తీసుకోవడం వల్ల ఫ్రెష్‌నెస్‌ వచ్చింది. 

47

ఇక  శర్వానంద్ స్నేహితులుగా వెన్నెల కిశోర్ ,ప్రియదర్శీలు అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్ నటన గురించి అందరికి తెలిసందే. సెటిల్డ్ గా ఉంటూనే.. డైలాగ్స్ తో కడుపుబ్బా నవ్విస్తాడు.. కాని ఈసినిమాలో కామెడీతో పాటు.. కిషోర్ లోని  నటనా కోణాన్నీ మార్చి అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ప్రియదర్శి కూడా నవ్విచే చోట నవ్విస్తూ.. నటన విషయంలో కిషోర్ కు ఏమాత్రం తగ్గకుండా మెయింటేన్ చేశాడు. ఇక  సైంటిస్ట్‌గా నాజర్... హీరో ప్రేయసి పాత్రలో రీతూ వర్మ  తమ పాత్రల పరిదిమేర చక్కగా నటించారు.  ముఖ్యంగా రీతూ వర్మ ఎమోషన్స్ హైలైట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిన్నారుల యాక్టింగ్ గుర్తుండి పోతుంది. 
 

57

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే... సినిమాకు కెప్టెన్ దర్శకుడు. ఈసినిమా దర్శకుడు శ్రీకార్తీక్  మంచి కాన్సెప్ట్ ను తయారు చేసుకున్నాడు. కాని తాను తీసుకున్న కథకు తగ్గట్టుగా అంచనాలు అందుకోలేక పోయాడు అనిపిస్తుంది. సినిమా అంతా బాగా ఉంది కాని..  స్క్రీన్ ప్లేలో స్పీడ్ తగ్గింది.  సెకండ్ హాఫ్ లో సాగదీత ఎక్కువైంది. శ్రీకార్తీక్ చాలా  ఆసక్తిగా కథను ముందుకు నడిపారు. అయితే, నిదానంగా వెళ్ళడం వల్ల నిడివి ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఈ సినిమాకు మెయిన్ గా ప్లాస్ ఏంటీ అంటే.. తరుణ్ భాస్కర్ డైలాగులు. ఆయన డైలాగ్స్ సినిమాలో  సహజంగా ఉన్నాయి.  అంతే కాదు జేక్స్ బిజాయ్ అందించిన  సంగీతం కూడా అద్బుతంగా పనిచేసింది. ముఖ్యంగా సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు.. అమ్మ పాట బావుంది. సినిమాటోగ్రఫీ  చాలా బాగుంది.. మంచి విజ్యూవల్స్ కు మంచి మార్కులు పడ్డాయి. ఇక  టైమ్ మెషిన్ సీన్స్‌లో గ్రాఫిక్స్ బాగా  డిజౌన్ చేశారు.. ఫైనల్ గా ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి.

67

ఇక ఫైనల్ గా ఒకే ఒక జీవితం సినిమా గురించి చెప్పాలంటే.. తల్లి, కొడుకు సెంటిమెంట్ పాయింట్ తో ఆడియనస్ ను కట్టిపడేయాలని చూసినా.. టైమ్ ట్రావెల్ కథతో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి అని చూసినా..  సినిమా సక్సెస్ అవ్వాలి అంటే బి,సి సెంటర్స్ లో ఆడియన్స్ పల్స్ ఎలా ఉందో చూడాలి.  ఎంత అద్భుతంగా తెరకెక్కించినా.. ఈమూవీలో టైమ్ ట్రావెల్ పాయింట్ సరిగా ఎగ్జిక్యూట్ చేయలేకపోవడం, ఎమోషనల్‌గా కథకు ఆడియెన్‌ను కనెక్ట్ చేయలేకపోవడం కాస్త మైనస్. శర్వానంద్ ఫెర్ఫార్మెన్స్ ,ఫ్యామిలీ ఆడియెన్స్ చూసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించడం  సినిమాకు ప్లస్ అని చెప్పుకోవాలి. ఇక మల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కు ఈ సినిమా ఎలాగు నచ్చుతుంది.. బి,సి ఆడియన్స్ కూడా మెచ్చితే.. సినిమా కలెక్షన్స్ పెరిగి హిట్ కొట్టినట్టే. కాని ఎవరైనా సరే.. ఒక సారి చూడటానికి ఆస్కారం ఉన్న సినిమా ఒకే ఒక జీవితం. 

77

సినిమా : ఒకే ఒక జీవితం
నటీనటులు : శర్వానంద్, అమల అక్కినేని, రీతూ వర్మ, వెన్నెల కిశోర్, ప్రియదర్శి, నాజర్,  
మాటలు : తరుణ్ భాస్కర్ 
సినిమాటోగ్రఫీ : సుజిత్ సారంగ్ 
సంగీతం: జేక్స్ బిజాయ్ 
నిర్మాతలు : ఎస్.ఆర్. ప్రభు, ఎస్.ఆర్. శేఖర్ 
రచన, దర్శకత్వం : శ్రీ కార్తీక్ 
విడుదల తేదీ: సెప్టెంబర్ 9, 2022
రేటింగ్ : 3

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు
Recommended image2
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?
Recommended image3
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved