MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెమ్యునరేషన్ వివాదంపై శర్వానంద్ క్లారిటీ.. తిక్క రేగితే ఎంతవరకైనా వెళతా..

రెమ్యునరేషన్ వివాదంపై శర్వానంద్ క్లారిటీ.. తిక్క రేగితే ఎంతవరకైనా వెళతా..

సైలెంట్ గా, కూల్ గా తన పని తాను చేసుకుని వెళ్లే నటుడు శర్వానంద్. హీరోగా శర్వానంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కి మంచి గుర్తింపు ఉంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 28 2022, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

సైలెంట్ గా, కూల్ గా తన పని తాను చేసుకుని వెళ్లే నటుడు శర్వానంద్. హీరోగా శర్వానంద్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో శర్వానంద్ కి మంచి గుర్తింపు ఉంది. శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ 'ఒకేఒక జీవితం'. టైం ట్రావెల్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు శ్రీ కార్తీక్ తెరకెక్కించారు. సెప్టెంబర్ 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో శర్వానంద్ ప్రమోషన్స్ కోసం రంగంలోకి దిగారు. ఎప్పుడూ వివాదాల జోలికి వెళ్లని శర్వానంద్ గత ఏడాది ఒక వివాదంలో వార్తల్లో నిలిచారు. శర్వానంద్ నటించిన శ్రీకారం చిత్రం గత ఏడాది విడుదలై పర్వాలేదనిపించింది. సినిమా విడుదలై మంచి బిజినెస్ జరిగినప్పటికీ తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ పూర్తిగా ఇవ్వకపోవడంతో శర్వానంద్ 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మాతలకి లీగల్ నోటీసులు పంపారు. ఈ న్యూస్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచింది. 

 

36

దానిపై తాజాగా శర్వానంద్ క్లారిటీ ఇచ్చారు. తనకి కూడానా టాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉందని శర్వానంద్ తెలిపారు. అందుకే పెద్ద నిర్మాణ సంస్థలే నాతో రిపీట్ గా సినిమాలు చేస్తున్నాయి. నేను కూడా నా వాల్యూ ఎంతో అంత రెమ్యునరేషన్ తీసుకుంటాను. నాకు మార్కెట్ లేకుంటే అంత పెద్ద నిర్మాతలు రెమ్యునరేషన్ ఎందుకు ఇస్తారు. 

 

46

నిర్మాతలు నాతో నిజాయతీగా ఉంటే నేను కూడా అంతే మంచిగా ఉంటా. నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం సహించను.చాలామంది పేమెంట్ పూర్తయ్యే వరకు డబ్బింగ్ చెప్పరు. కానీ నేను ఆ చిత్రానికి డబ్బింగ్ కంప్లీట్ చేశా అని శర్వానంద్ అన్నారు. నాకు తిక్క రేగితే నేను ఏ స్టేజికి అయినా వెళతా అని శర్వానంద్ తెలిపారు. 

 

56

ఆ వివాదం గురించి మాట్లాడితే చాలా ఉంటాయి. సినిమాని ఇంతకు అమ్మారు ? అంత లాభం పొందారు ? ఎన్ని కార్లు కొన్నారు ? ఇవన్నీ వస్తాయి. వాటి జోలికి నేను వెళ్ళను అని వివాదానికి శర్వానంద్ ఫుల్ స్టాప్ పెట్టారు. 

 

66

తనకి తల్లి దండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నపటికీ ఇండిపెండెంట్ గా బతకడమే ఇష్టం అని శర్వానంద్ తెలిపారు. పేరెంట్స్ కూడా తనని అలాగే పెంచారు అని శర్వానంద్ వివరించారు. ఇక ఒకే ఒక జీవితం చిత్ర విషయానికి వస్తే ఈ మూవీలో శర్వానంద్ కి జోడిగా రీతూ వర్మ నటిస్తోంది. వెన్నెల కిషోర్, ప్రియదర్శి , నాజర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Recommended image1
Alia Bhatt: ఫోన్‌లో రణ్‌బీర్ పేరును ఆలియా భట్ ఎలా సేవ్ చేసుకుందో తెలుసా? టాప్ సీక్రెట్
Recommended image2
Lenin OTT: ఓటీటీలోకి అఖిల్ 100 కోట్ల బ్లాక్‌బస్టర్, లెనిన్ స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎందులోనో తెలుసా?
Recommended image3
Mahesh Babu: అన్న కొడుకును పట్టించుకోరా? చిరంజీవితో పోల్చుతూ.. మహేష్ బాబుపై ట్రోలింగ్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved