కింగ్ సైజ్ లవ్.. షారుఖ్ ఖాన్ తో క్రేజీ మూమెంట్స్ పంచుకున్న అనిరుధ్ రవిచంద్రన్
బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ తో క్రేజీ మూమెంట్స్ ను శేర్ చేసుకున్నాడు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravinchader).సౌత్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న యంగ్ మ్యుజిషియన్.. ప్రస్తుతం బాలీవుడ్ పైన కన్నేశాడు.

Anirudh Ravichander
తమిళ డబ్బింగ్ సినిమాలతోనే టాలీవుడ్ తో పాటు.. సౌత్ లో ఫుల్ క్రేజ్ సాధించాడు అనిరుధ్ రవిచంద్రన్(Anirudh Ravinchader).టాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ సాధించాడు. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో స్టార్ హీరోల సినిమాలన్నీ అనిరుధ్ చేతిలోనే ఉన్నాయి. ఇప్పటికిప్పుడు సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మ్యూజిక్ లవర్స్ ఠక్కున చెప్పే పేరు అనిరుధ్ రవిచందర్ .
రీసెంట్ గా అనిరుధ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో.. జైలర్ సినిమా రజినీ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించింది. ఇక సౌత్ లో ఎలాగా స్టార్ గా మారిపోయిన అనిరుధ్.. తాజాగా బాలీవుడ్ పై కన్నేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా .. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకు ఈ యంగ్ స్టార్ మ్యూజిక్ చేస్తున్నాడు. అట్లీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ప్రస్తుతం అనిరుధ్ కంపోజ్ చేసిన లేటెస్ట్ చిత్రం జవాన్. ఈసినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ప్రమోషన్లు కూడా జోరుగా సాగిస్తున్నారు టీమ్. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా కోలీవుడ్‌లో జవాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్‌లో అనిరుధ్‌తో కలిసి షారుఖ్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది.
ఈవెంట్ లో షారుఖ్ తో మెమరబుల్ మూమెంట్స్ ను పదిలంగా దాచుకున్నాడు అనిరుధ్. ముఖ్యంగా తనతో షారుక్ స్టెప్ వేయడం.. తనను ముద్దు పెట్టుకోవడం.. ఇలాంటి షాకింగ్ ఫోటోలను తాజాగా ఆయన తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు ఈపోస్ట్ కు కింగ్ సైజ్‌డ్ లవ్ (King Sized Love) అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కాగా ప్రస్తుతం ఈ పోస్టు వైరల్‌గా మారింది.
ఈసినిమాతో బాలీవుడ్ లో కూడా బిజీ కావాలని చూస్తున్నాడు అనిరుధ్. ఇప్పటికే జైలర్ లాంటి సినిమాల ద్వారా అన్ని భాషల్లో అనిరుధ్ కు మంచి పేరు వచ్చింది. ఇక జవాన్ సినిమా కాని హిట్ అయితే.. బాలీవుడ్ లో అనిరుధ్ధ్ ను పట్టుకోవడం చాలా కష్టం అవుతందనే చెప్పాలి.
బాలీవుడ్ బాద్‌షా నటిస్తున్న జవాన్(Jawan) సినిమాను తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వం వహిస్తున్నాడు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ (Red Chillies Entertainments) సమర్పణలో గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకునన సినిమా సెప్టెంబరు 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు రెడీగా ఉంది.