- Home
- Entertainment
- Prema Entha Madhuram: కోడలు చెంప పగలగొట్టిన శారదమ్మ.. రోజురోజుకి దిగజారిపోతున్న మాన్సీ?
Prema Entha Madhuram: కోడలు చెంప పగలగొట్టిన శారదమ్మ.. రోజురోజుకి దిగజారిపోతున్న మాన్సీ?
Prema Entha Madhuram: జీ తెలుగులో ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ మంచి కంటెంట్ తో ప్రేక్షకుల హృదయాలని గెలుచుకుంటుంది. నెగ్గడం కోసం తగ్గడంలో తప్పు లేదంటున్న ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కధ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో ఆర్య వచ్చి ఒక నిమిషం ఆగు.. లేదంటే నేను చెప్పిన మాటలు మిస్ అవుతావ్ అంటాడు. ఏం చెప్తాడో అంటూ క్యూరియాసిటిగా వింటుంది మాన్సీ. నీరజ్ నీకు విడాకులు ఇవ్వడు అలాగే వేలంపాట కూడా ఆగదు. తాళిని తెంచి నీరజ్ ని మానసికంగా చంపేసావు. ఆస్తి నీకు ఇష్టమని దానిని నీకే వదిలేసి వెళ్ళిపోయాము. ఇప్పుడు చావు కూడా నీకు ఇష్టం అంటే దానిని కూడా వదిలేసి వెళ్ళిపోతాము. నీకు నచ్చినట్లు చేసుకో అంటూ జెండేని మాన్సీ గది బయట తాళం వేయమంటాడు.
మాన్సీ వినేటట్టుగా అమ్మ.. పదండి అందరం బయలుదేరదాము అంటాడు ఆర్య. వద్దు.. నేను కూడా వస్తాను వేలంపాట జరగకూడదు అంటూ స్టూల్ మీద నుంచి కిందికి దిగి గది నుంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తుంది మాన్సీ. తాళం వేసి ఉండటం వల్ల డోర్ ఓపెన్ అవ్వదు. తనని వదిలేసి అందరూ వేలంపాట దగ్గరికి వెళ్ళిపోతారు. మరోవైపు నందిని టెక్స్టైల్స్ అమ్ముతున్నందుకు తల్లికి సారీ చెప్తాడు ఆర్య. పదిమంది మంచి కోసం ఈ పని చేస్తున్నావు నాకు ఆ తృప్తి చాలు అంటుంది శారదమ్మ. అసలు ఇదంతా నా వల్లే.. నేనే రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అంటాడు నీరజ్.
మాటిమాటికి అలా అనకు డెస్టినీ అంతే అంటాడు ఆర్య. నీరజ్ వాళ్లని లోపలికి వెళ్లి కూర్చోమంటాడు. పరిస్థితి అంతా బాగానే ఉంది కదా అని జెండే ని అడుగుతాడు ఆర్య. లేదు ఆర్య ఏదో అబ్నార్మల్ గా ఉంది ఎవరో వెనక నుండి ఇదంతా నడిపిస్తున్నారు అంటాడు జెండే. అంతలోనే మదన్ అక్కడికి వచ్చి బాస్ గెలుపుకి కేరాఫ్ అడ్రస్ అన్నావు ఇప్పుడేంటి ఓటమికి ఫ్రమ్ అడ్రసా అంటూ చులకనగా మాట్లాడుతాడు. నేను ఓడిపోయాను అని ఎవరన్నారు. లాస్ అయిపోయిన కంపెనీని అమ్మడం లేదు ఈ కంపెనీ వ్యాల్యూ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది అంటాడు ఆర్య. మా బాస్ ని ఓడించేవాడు ఇంకా పుట్టలేదు అంటాడు జెండే.
ఎక్కడ పుట్టలేదేమో అమెరికాలో పుట్టాడు అది నేనే అంటాడు మదన్. నీలాంటి పుట్టగొడుగులు చాలా వచ్చాయి కానీ పుట్టగతులు లేకుండా పోయాయి అంటాడు జెండే. నేను పుట్ట గొడుగుని కాను వామనుడు లాంటి వాడిని మొదటి అడుగు నందిని టెక్స్టైల్స్ మీద వేస్తున్నాను రెండో అడుగు మిగతా ప్రాపర్టీస్ మీద వేస్తాను మూడో అడుగు ఆర్య మీద వేస్తాను నువ్వు వెంచర్ని కూడా మార్చినవ్వలేదు కానీ నేను నీ ఫ్యూచర్ ని మారుస్తాను వెయిట్ అండ్ సీ అంటాడు మదన్.
మరోవైపు నేను వాళ్ళని బెదిరిద్దామనుకుంటే వాళ్లు నన్ను ఇక్కడ బంధించేసి వెళ్లిపోయారు అంటూ టెన్షన్ పడుతుంది మాన్సీ. మరోవైపు వేలం పదకొండు గంటలకి ప్రారంభం అవుతుంది అంటూ ఎనౌన్స్ చేస్తారు నిర్వాహకులు. మరోవైపు పని వాడిని బెదిరించి తన గదికి తాళం తీయించుకొని బయటికి వస్తుంది మాన్సీ. గబగబా వేలం పాట జరుగుతున్న స్థలానికి వెళ్తుంది. ఫోన్ మాట్లాడడం కోసం అప్పుడే బయటకు వచ్చిన నీరజ్ కి కనిపిస్తుంది. నువ్వెలా వచ్చావు అంటూ ఆశ్చర్యపోతాడు నీరజ్. అవన్నీ తర్వాత ముందు ఈ పేపర్స్ మీద సైన్ పెట్టు.. అర్జెంటుగా ఈ వేలంపాట ఆగిపోవాలి అంటుంది మాన్సీ.
ఏంటి ఇవి డైవర్స్ పేపర్స్ ఆ అని అడుగుతాడు నీరజ్. కాదు ల్యాండ్ పేపర్స్ అంటుంది మాన్సీ. అవి వర్కర్స్ కోసం కేటాయించినవని చెప్తే వినిపించుకోవా? అయినా నేను ఒక్కడినే సంతకం పెడితే చెల్లదు దాదా కూడా సంతకం పెట్టాలి. నేను సంతకం పెట్టను ఏం చేసుకుంటావో చేసుకో అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నీరజ్. మీరు పెట్టేది ఏంటి నేనే పెడతాను అంటూ వాళ్ళిద్దరూ సంతకాలని ఫోర్జరీ చేసేస్తుంది మాన్సీ. వీలైతే ఇదే నందిని టెక్స్టైల్స్ ని నేనే కొంటాను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని వెనక్కి తిరిగేసరికి నీరజ్ వాళ్ళందరూ అక్కడ ఉంటారు.
ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మాన్సీ. ఏం చేసావ్ అని అడుగుతాడు ఆర్య. ఏం లేదు బ్రో ఇన్ లా అంటుంది మాన్సీ. ఆమె చేతిలో పేపర్స్ ఏంటో చూడమని జెండే కి చెప్తాడు ఆర్య. ఆమె చేతిలోంచి ఆ పేపర్స్ తీసుకొని వర్కర్స్ కి సంబంధించిన ల్యాండ్ సేల్ డాక్యుమెంట్ అంటాడు జెండే. దీని మీద సంతకాలు కూడా ఉన్నాయి అని చెప్పటంతో అందరూ నిర్ధాంత పోతారు.
ఎంత పని చేసావ్ అంటూ శారదమ్మ మాన్సీ చెంప పగలగొడుతుంది. ఈ సంతకాలు నువ్వు చేసావు అంటే ఆ డొల్ల కంపెనీల సంతకాలు కూడా నువ్వే చేసావన్నమాట అంటాడు నీరజ్. ఇన్నాళ్లు నువ్వు మారతావని.. మాతో కలిసి ఉంటావని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ఇప్పుడు నువ్వు ఫోర్జరీ చేసి క్రైమ్ చేసావు అంటాడు ఆర్య. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.