MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: షణ్ముఖ్ రెచ్చగొట్టడంతో బాత్‌రూమ్‌లో తల బాదుకున్న సిరి.. హౌజ్‌ మొత్తం షాక్‌..

Bigg Boss Telugu 5: షణ్ముఖ్ రెచ్చగొట్టడంతో బాత్‌రూమ్‌లో తల బాదుకున్న సిరి.. హౌజ్‌ మొత్తం షాక్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 5వ సీజన్‌లో ఎమోషనల్‌ బ్లాక్‌ మెయిల్‌ జరుగుతుందా? టాస్క్ లో, గేమ్‌లో ఎంటర్‌టైన్‌ చేయాల్సిన ఇంటి సభ్యులు ఇతరులు ఎమోషన్స్ తో ఆడుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం సోషల్‌ మీడియా నుంచి వస్తోంది. షణ్ముఖ్ విషయంలో నెటిజన్లు ఇప్పుడిదే కామెంట్‌ చేస్తున్నారు.

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Nov 16 2021, 11:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Bigg Boss Telugu 5 73వ ఎపిసోడ్‌(72వ రోజు) మంగళవారం ఎపిసోడ్‌ కెప్టెన్సీ టాస్క్ పక్కకు పోయి షణ్ముఖ్‌, సిరిల మధ్య జరిగిన కన్వర్జేషనే హైలైట్‌గా మారింది. అదే డామినేట్‌ చేసింది. ఇందులో షణ్ముఖ్‌..సిరిని చాలా రకాలుగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టు అనిపిస్తుంది. గత వారం కెప్టెన్సీ టాస్క్ కి సంబంధించి సన్నీ.. సిరి అమ్మేస్తా అనే పదాన్ని వాడగా, దాన్ని మళ్లీ తీసుకొచ్చాడు షణ్ముఖ్‌. ఆ విషయాన్నిఅంత ఈజీగా మర్చిపోయావా అంటూ ప్రోవోక్‌ చేశాడు. అది చాలా పెద్ద పదం అంటూ మర్చిపోయిన సిరికి గుర్తు చేసి మరీ ఆమెని ప్రోవోక్‌ చేస్తూ వచ్చాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ విషయంపై మళ్లీ సన్నీతో మాట్లాడమని సిరికి చెప్పాడు షణ్ముఖ్‌. ఆయనకు గట్టిగా తన అభిప్రాయాన్ని వెల్లడించమని చెప్పాడు. అయితే అది కాకుండా సిరి.. సన్నీ,రవి, మానస్‌, అనీ మాస్టర్‌, పింకీ, కాజల్‌ అందరు కూర్చొని జోకులు వేసుకున్నారు. ఇమేటేషన్స్ చేసుకుని నవ్వుకున్నారు. ఇందులో సిరి కూడా ఉండి వారితోపాటు సరదాగా ఆ జోకులను ఎంజాయ్‌ చేసింది. అయితే దీనికి దూరంగా ఉన్న షణ్ముఖ్‌ అది గమనించి మరోసారి సిరిపై ఫైర్‌ అయ్యాడు. తాను చెప్పిందేంటి అక్కడ చేసిందేంటి అంటూ మండి పడ్డారు.

36

దీనికి సిరి కూడా చిరాకు పడింది. అయిపోయిన దాన్ని ఇప్పుడు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదంటూ ఆమె తన అభిప్రాయాన్ని చెప్పింది.కానీ షణ్ముఖ్‌ వినలేదు. తన వద్దకు రావద్దని, తనకు చాలా అన్‌ఈజీగా ఉందని, ఏదోలా ఉందంటూ సిరి ఎమోషనల్‌గా బ్లాక్‌ మెయిల్‌ చేసేలా ప్రవర్తించాడని అంటున్నారు నెటిజన్లు. తనకు ఆమె ఫ్రెండ్‌షిప్‌ వద్దంటూ విసుకున్నాడు షణ్ముఖ్‌. దీంతో హౌజ్‌లో వీరి ఎపిసోడ్‌ మరింత హాట్‌ టాపిక్‌గా మారింది. 

46

మరోసారి సిరి షణ్ముఖ్‌ని కూల్‌ చేద్దామని, ఓదార్చే ప్రయత్నం చేసింది. దీంతో అతను ఈ సమయంలో దీప్తి సునైనా(షణ్ముఖ్‌ లవర్‌) ఉంటే బాగుండేదని అంటాడు. ఆమె తనని బాగా అర్థం చేసుకునేదని వెల్లడించారు. దీనికి కరిగిపోయిన సిరి షన్నుని మళ్లీ ఓదార్చేందుకు ప్రయత్నించగా ఇక్కడి నుంచి వెళ్లిపో, తనని ఒంటరిగా వదిలేయ్‌.. నువ్వు సొంతంగా గేమ్‌ ఆడాలని వచ్చావుగా.. ఆడు, నాతో సంబంధం లేదు, నీ గేమ్‌ నువ్వు ఆడుకో, నా గేమ్‌ నేను ఆడుకుంటా అంటూ కామెంట్ చేశాడు షన్ను. అయితే షన్నుపై కూడా కామెంట్‌ చేసింది. ఎప్పుడు ఎలా ఉంటాడో అర్థం కాదు, అప్పుడే బాగుంటాడు, అప్పుడే ఇలా ప్రవర్తిస్తాడు అంటూ తెలిపింది. 

56

దీంతో మరింత రెచ్చిపోయాడు షణ్ముఖ్‌. తనదే తప్పు అని, పెద్ద స్టేట్‌ మెంట్‌ ఇచ్చావుగా, తనని వెదవని చేశావుగా అంటూ మాట్లాడారు. నువ్వు నాకు వద్దు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు షన్ను. ఈ క్రమంలో వీరిమధ్య జరిగిన కన్వర్జేషన్‌ తట్టుకోలేక సిరి బాత్‌రూమ్‌లోకి వెళ్లి తల బాదుకుంది. గట్టిగా శబ్దాలు కూడా వచ్చాయి. దీంతో సంచాలక్‌ రవి, ఇతర సభ్యులు కూడా వచ్చి డోర్‌ కొట్టగా ఎట్టకేలకు సిరి డోర్‌ తీసి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరు హగ్‌ చేసుకుని గట్టిగా ఏడ్చారు. సిరిని కూల్‌ చేసేందుకు ప్రయత్నించాడు షన్ను. అయితే ఈ ఎపిసోడ్‌ మొత్తంలో షన్ను.. సిరిని రెచ్చగొట్టాడంటున్నారు నెటిజన్లు. ఆమెని పదే పదే మాటలతో ప్రోవోక్‌ చేస్తున్నాడని కామెంట్లు చేస్తున్నారు. మొన్నటి వరకు పాజిటివ్‌ ఒపీనియన్‌తో ఉన్న షన్నుకి ఈ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ తో ఆయనపై విమర్శలు రావడం గమనార్హం. 

66

ఇక బిగ్‌బాస్‌ తెలుగు 5 మంగళవారం ఎపిసోడ్‌లో.. కాజల్‌ సైతం కన్నీళ్లు పెట్టుకుంది. షన్ను ఇచ్చిన స్టేట్‌మెంట్ కి ఆమె చాలా బాధపడింది. సన్నీ, మానస్‌ ల వద్ద తన మొర పెట్టుకుంది. సిరి..తనతో మాట్లాడటం ఇష్టం లేదని గట్టిగా చెప్పడంతో ఆమె వద్దకి మళ్లీ ఎలా వెళ్లను అంటూ వాపోయింది. అనంతరం బిగ్‌బాస్‌ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. `మీ ఇళ్లు బంగారం కాను` పేరుతో ఇచ్చిన టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు గోల్డ్ మైనర్స్ గా మారాల్సి ఉంటుంది. ఇందులో ఎల్లో కలర్‌ హెల్మట్‌లు దక్కించుకుని బంగారు గుండులను వెతకాల్సి  ఉంటుంది. ఇందులో ప్రియాంక, మానస్‌, సన్నీ, కాజల్‌, అనీ మాస్టర్‌ చురుకుగా పాల్గొన్నారు. మధ్య మధ్యలో సన్నీ తనదైన స్టయిల్‌లో నవ్వులు పూయించారు. 

also read: ఇష్టం లేకపోతే వెళ్ళిపో, నాకు నా ఫ్యామిలీ ఉంది... వైరల్ గా బిగ్ బాస్ ఫేమ్ మోనాల్ ఎమోషనల్ వీడియో

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved