MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 5: షణ్ముఖ్ పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్.. వాళ్లిద్దరూ అలా ఉండడం నచ్చలేదు

Bigg Boss Telugu 5: షణ్ముఖ్ పై సిరి తల్లి షాకింగ్ కామెంట్స్.. వాళ్లిద్దరూ అలా ఉండడం నచ్చలేదు

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5 షో నేటి 82వ ఎపిసోడ్ జోష్ ఫుల్ గా జరిగింది. హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారింది.

2 Min read
Author : pratap reddy
Published : Nov 25 2021, 11:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ తెలుగు 5(Bigg Boss Telugu 5) షో నేటి 82వ ఎపిసోడ్ జోష్ ఫుల్ గా జరిగింది. హౌస్ మేట్స్ కి సంబంధించిన కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ సందడిగా మారింది. నేటి ఎపిసోడ్ లో మొదటగా శ్రీరామ్ సోదరి హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. ఆమె ఎక్కువగా హంగామా లేకుండా సింపుల్ గా వచ్చి సింపుల్ గా వెళ్లిపోయారు. తన సోదరుడు శ్రీరామ్ కి ఆమె కొన్ని సలహాలు ఇచ్చి వెళ్లారు. ఎదుటివాళ్ళు చెప్పేది కూడా వినాలని శ్రీరామ్ కు చెప్పారు. మిగిలినవన్నీ ఒకే అని అన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా హ్యాపీగా ఉన్నారు అని చెప్పి శ్రీరామ్ సోదరి హౌస్ నుంచి వెళ్లిపోయారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఆ తర్వాత బిగ్ బాస్ కాసేపు హౌస్ మేట్స్ తో ఫ్రీజ్ అండ్ రిలాక్స్ గేమ్ అందించారు. ఈ గేమ్ లో సన్నీ రవి ఫ్రీజ్ లో ఉన్నపుడు ఐస్ గడ్డ పెడుతూ ఆడుకున్నాడు. ఈ గేమ్ ముగిశాక Manas తల్లి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆమె హౌస్ లోకి రావడంతోనే రచ్చ షూరూ చేశారు. ఫుల్ ఎనర్జీతో గెంతులేస్తూ ఇంట్లో ఉన్న సభ్యులందరిపై సెటైర్లు పేల్చారు. తన కొడుకు మానస్ ని చూసుకుంటూ మురిసిపోతూనే ఇతర సభ్యులపై జోకులు వేశారు. కాజల్ మీకు టీ ఇవ్వనా ఆంటీ అని అడిగితే.. నీకు వంట రాదు కూడా అని మానస్ తల్లి అనడంతో హౌస్ లో నవ్వులు విరిశాయి. ఆ తర్వాత కూడా ఆమె కాజల్ ని వదల్లేదు. 

36

అమ్మా kajal నీ వాయిస్ అది వాయిస్ కాదమ్మా.. ఎక్కడున్నా వినిపించేస్తుంది. మిమ్మల్ని దేవుడే రక్షించాలి అని ఆమె అనడంతో ఇంటి సభ్యులంతా నవ్వేస్తారు. కాసేపు మానస్ తో ఆమె ముచ్చటించి హౌస్ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత షణ్ముఖ్ వాష్ రూమ్ కి వెళుతుండగా బిగ్ బాస్ ఫ్రీజ్ చెబుతారు. దీనితో సిరి, కాజల్, రవి అక్కడికి చేరుకొని షణ్ముఖ్ ని ఆటపట్టిస్తారు. షణ్ముఖ్ ఫ్రీజ్ లో ఉండగా చీర కట్టి, గర్భవతి మహిళగా మేకప్ వేస్తారు. ఆ సన్నివేశం సరదాగా ఉంటుంది. బిగ్ బాస్ షణ్ముఖ్ ని రిలాక్స్ చేసే వరకు ఇతర సభ్యులు షణ్ముఖ్ ని ఆడుకుంటారు. 

46

ఆ తర్వాత హౌస్ లోకి సిరి తల్లి శ్రీదేవి ఎంటర్ అవుతారు. తన తల్లిని చూడగానే సిరి ఎమోషనల్ అవుతుంది. సిరి తల్లి సరదాగా మాట్లాడుతూనే చేసిన కొన్ని కామెంట్స్ ఆసక్తిగా మారాయి. సిరి, షణ్ముఖ్ ఒకరికి ఒకరు తోడుగా ఉండడం బాగానే ఉంది.. కానీ వారిద్దరూ హగ్ చేసుకోవడం నచ్చలేదు అని అంటుంది. దీనితో సిరి తన తల్లితో ఒంటరిగా కూర్చుని.. షణ్ముఖ్ గురించి అలా మాట్లాడవద్దు.. బాగోదు అని చెబుతుంది. సిరి తల్లి మాటలకు షణ్ముఖ్ ఫీల్ అవుతాడు. ఏ తల్లి అయినా అంతే కదా అని తనకు తాను సర్ది చెప్పుకుంటాడు. 

56

ఆ తర్వాత మానస్, ప్రియాంక మధ్య ఆసక్తికర సంభాషణ జరుగుతుంది. నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అని ప్రియాంక ప్రశ్నించగా లేదు నేను మామూలుగానే ఉన్నాను అని అంటాడు. లేదు నాతో నువ్వు సరిగ్గా మాట్లాడట్లేదు అని పింకీ అంటుంది. దీనితో మానస్ విసిగిపోయి.. నీకు అనవసరంగా చనువు ఇచ్చాను. నువ్వు నా నుంచి ఇంకేదో ఆశిస్తునావు అని తిడతాడు. దీనితో ప్రియాంక హార్ట్ బ్రేక్ అవుతుంది. 

66

ఆ తర్వాత హౌస్ లోకి సన్నీ వాళ్ళ మదర్ ఎంటర్ అవుతారు. బిగ్ బాస్ హౌస్ ని చూసి ఆమె సంతోషం, ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు. ఇంటి సభ్యులతో ఆమె సరదాగా ముచ్చటిస్తుండగా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది. Also Read: Allu Arjun with NBK: `నందమూరి`తో `అల్లు` బంధం.. బన్నీ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా? షాక్‌లో మెగా ఫ్యాన్స్ ?

About the Author

PR
pratap reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Agnipariksha: ఏంటి నీకు సుఖాలు కావాలా ? కంటెండర్ ని గెంటేసిన శ్రీముఖి.. ఏం జరిగిందో తెలుసా
Recommended image2
Ameer Log Movie Review: అమీర్‌ లోగ్‌ మూవీ రివ్యూ.. పాతబస్తీ పోరగాళ్ల బిర్యానీ కథ ఎలా ఉందంటే?
Recommended image3
Chandra Mohan: ఆ స్టార్ కొడుకు పచ్చి తాగుబోతు, తండ్రి మిగిల్చిన మందు తాగుతూ..అందుకే నా కూతుళ్ళని దూరంగా ఉంచా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved