MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Allu Arjun with NBK: `నందమూరి`తో `అల్లు` బంధం.. బన్నీ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా? షాక్‌లో మెగా ఫ్యాన్స్ ?

Allu Arjun with NBK: `నందమూరి`తో `అల్లు` బంధం.. బన్నీ మాస్టర్‌ ప్లాన్‌ అదేనా? షాక్‌లో మెగా ఫ్యాన్స్ ?

బాలకృష్ణ నటిస్తున్న `అఖండ` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఐకాన్‌ స్లార్‌ అల్లు అర్జున్‌ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. దీంతో ఇప్పుడు నందమూరితో, అల్లువారి బంధం గురించిన చర్చ ఊపందుకుంది. కొత్త చర్చకు తెరలేపుతుంది. నెట్టింట వైరల్‌గా మారుతుంది. 

5 Min read
Aithagoni Raju
Published : Nov 25 2021, 09:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
Akhanda

Akhanda

Akhanda

మాస్‌ కా బాప్‌ అనిపిస్తున్న నందమూరి బాలకృష్ణ(Balakrishna) ప్రస్తుతం `అఖండ`(Akhanda) చిత్రంలో నటిస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్‌ 2న విడుదల కానుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి. పైగా ఇప్పటికే విడుదలైన Akhanda ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మరింతగా పెంచాయి. దీంతో శ్రీకాంత్‌ విలన్‌గా నటించడం మరో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. ప్రగ్యా జైశ్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాని మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. 
 

212
Akhanda

Akhanda

Akhanda

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఈ నెల 27న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో నిర్వహించబోతున్నారు. దీనికి గెస్ట్ గా `ఐకాన్‌ స్టార్‌` అల్లు అర్జున్‌(Allu Arjun) వస్తున్నారనే వార్త ఇరు అభిమానులకు సర్‌ప్రైజింగ్‌గా మారింది. ఈ వార్తతో అటు అల్లువారి ఫ్యాన్స్ ని, ఇటు నందమూరి ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. బాలయ్య, బన్నీ అభిమానులు సంబరపడుతున్నారు. పండగ చేసుకుంటారు. ఎప్పుడూ కలవని ఈ రెండు ఫ్యామిలీలు దగ్గరవుతుండటం ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు తెరలేపుతుంది. హాట్‌ టాపిక్‌ అవుతుంది. మెగా ఫ్యాన్స్ కి షాకింగ్‌గా మారింది. 

312

నందమూరి ఫ్యామిలీ బంధం అల్లువారితో చాలా రోజుల క్రితం నుంచే బలపడుతుంది. అందుకు ఓటీటీ యాప్‌ `ఆహా` వేదికైంది. ఆహాలో కొత్త టాక్‌ షో ప్రారంభించాలనుకున్నప్పుడు బాలకృష్ణతో చేస్తే ఎలా ఉంటుందనే అల్లు అరవింద్‌ ఆలోచన నుంచి `అన్‌స్టాపబుల్‌` టాక్‌ షో ప్రారంభమైంది. ఈ షోకి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఇది సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఈ సందర్భంగా అల్లు రామలింగయ్య, అల్లువారి ఫ్యామిలీతో తమ ఫ్యామిలీకి ఉన్న అనుబంధాన్ని తెలిపారు బాలకృష్ణ. ఎన్టీఆర్‌, అల్లు రామలింగయ్య మధ్య ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. అక్కడే బాలయ్యకి ఫిదా అయ్యారు అల్లువారి ఫ్యాన్స్. 

412

ఇప్పుడు బాలకృష్ణ సినిమా `అఖండ` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ఏకంగా అల్లు అర్జునే రంగంలోకి దిగడం విశేషం. వీరిమధ్య అనుబంధం మరింత బలపడుతుందనే సంకేతాలనిస్తుంది. ఇరు హీరోల ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుంది. నెట్టింట ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. నందమూరి ఫ్యాన్స్, అల్లు అర్జున్‌ ఫ్యాన్స్ తోపాటు నెటిజన్లు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దీంతో సరికొత్త వేడి తెరపైకి వస్తుంది. 
 

512
Allu Arjun, chiranjeevi

Allu Arjun, chiranjeevi

Allu Arjun, chiranjeevi

ఇండస్ట్రీలో చిరంజీవి సారథ్యంలోని మెగా ఫ్యామిలీ ఓ పెద్దన్న పాత్రని పోషిస్తుంది. అల్లు వారి హీరో(అల్లు అర్జున్‌, శిరీష్‌)లు కూడా మెగా ఫ్యామిలీలోకే వస్తుంటారు. చిరంజీవి వేసిన బీజాల ఫలితాలు వీరంతా అంటుంటారు. ఆయా హీరోలు కూడా చాలా సందర్భంలోనే చిరంజీవి లాంటి మహావృక్షం కింద పెరిగే పరాన్న జీవులంగా పలు ఈవెంట్లలో వెల్లడించారు. అయితే ఇప్పుడు నెటిజన్ల మధ్య నడుస్తున్న చర్చని చూస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి మరో వృక్షం పెరుగుతుందంటున్నారు. ఆ వృక్షమే అల్లు అర్జున్‌ అని, అల్లు వారి ఫ్యామిలీ అంటూ సరికొత్త చర్చకి తెరలేపారు. 

612

అల్లు వారి ఫ్యామిలీలో ఇద్దరు హీరోలున్నారు. అల్లు అర్జున్‌ ఇప్పుడు టాలీవుడ్‌లో టాప్‌ స్టార్ గా ఎదిగారు‌. ప్యాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. మరోవైపు గీతా ఆర్ట్స్ చాలా రోజులుగా అల్లు అరవింద్‌ సమక్షంలోనే రన్‌ అవుతుంది. చిరంజీవి, మెగా హీరోలతోనూ అనేక సినిమాలు చేస్తూ వస్తున్నారు. గీతా ఆర్ట్స్ అంటే మెగా ఫ్యామిలీ బ్యానర్‌ అనే అంతా అనుకుంటారు. ఇప్పటికీ అదే టాక్‌ నడుస్తుంది. అదే సమయంలో అల్లురామలింగయ్య పేరుతో ఓ స్టూడియో కూడా నిర్మిస్తున్నారు అల్లు అర్జున్‌. హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో ఈ స్టూడియో నిర్మాణం జరుగుతుంది. 

 

712

మరోవైపు థియేటర్లు కూడా నిర్మిస్తున్నారు. ఏషియన్‌ సినిమాతో కలిసి `ఏషియన్‌ అల్లు అర్జున్‌`(ఏఏఏ) పేరుతో హైదరాబాద్‌లో ఓ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారు.  `జీఏ2` పేరుతో చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. మరోవైపు అల్లు అరవింద్‌ బాలీవుడ్‌లోనూ భారీ సినిమాల నిర్మాణంలో భాగమవుతూ ప్రొడక్షన్‌ని విస్తరిస్తున్నారు. చాలా థియేటర్లు లీజ్‌లో నిర్వహిస్తున్నారు. ఇలా అల్లు అర్జున్‌, అల్లు వారి ఫ్యామిలీ ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ సపరేట్‌ సంస్థగా ఏర్పడుతుంది. ఒక వ్యవస్థగా పురుడు పోసుకుంటుందని అంటున్నారు నెటిజన్లు. అల్లు అర్జున్‌, అల్లు అరవింద్‌ అసలైన ప్లాన్‌ ఇదేనని లేటెస్ట్ టాక్‌. 

812

ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీలో ఒకరిగా ఉన్న బన్నీ.. ఇప్పుడు సొంతంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారనే చర్చ నడుస్తుంది. చాలా రోజులుగా మెగా ఫ్యామిలీకి, అల్లు వారి ఫ్యామిలీ మధ్య విభేదాలు తలెత్తాయని అంటున్నారు. అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్లలో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ చేసే గొడవలే వీరి మధ్య గ్యాప్‌ పెంచడానికి కారణమని నెటిజన్లు టాక్‌. బన్నీ ఇప్పుడు సొంతంగా ఎదుగుతున్నారు. సొంతంగా ఫ్యాన్‌ బేస్‌ ఏర్పడింది. ఒకరిపై ఆధారపడే స్థితి దాటిపోయాడు‌. స్టయిలీష్‌ స్టార్‌ నుంచి `ఐకాన్‌ స్టార్‌`గానూ మారిపోయింది. అంతేకాదు `అల వైకుంఠపురములో` సమయంలో ఏకంగా కాబోయే `మెగాస్టార్‌` అంటూ ఆయన అభిమానులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టడం విశేషం. 

912
Allu arjun

Allu arjun

Allu arjun

అయితే వీటికి మూలం అల్లు అర్జున్‌ సినిమా ఈవెంట్లలో పవన్‌ ఫ్యాన్స్ చేసే ఓవరాక్షనే అంటున్నారు నెటిజన్లు. `డీజే`, `సరైనోడు`, `అల వైకుంఠపురములో` వంటి సినిమాల ఈవెంట్లలో పవన్‌ ఫ్యాన్స్.. బన్నీ చేత.. పవర్‌స్టార్‌ అనిపించేందుకు గోల చేశారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు అరుస్తూ ఉండటంతో `డీజే`, `సరైనోడు` ఫంక్షన్‌లో `చెప్పను బ్రదర్‌` అంటూ కామెంట్‌ చేశారు బన్నీ. ఇది పవన్‌ ఫ్యాన్స్ ని బాగా హర్ట్ చేసిందట. దీంతో `డీజే` టైమ్‌లో ఆ సినిమాపై నెగటివ్‌ కామెంట్లు చేస్తూ వచ్చారు పవన్‌ ఫ్యాన్స్. మరోవైపు `అల వైకుంఠపురములో` సమయంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురుకావడంతో చిరంజీవికి నేను పెద్ద అభిమానిని, జీవితకాలం ఆయన అభిమానినే అని తెలిపారు బన్నీ. ఆ తర్వాత రజనీకాంత్‌ని ఇష్టపడతానని చెప్పాడు. పవన్‌ ఫ్యాన్స్ గోల చేయడంతో వారి ఒత్తిడి మేరకు పవర్‌స్టార్‌ అంటూ అసహనం వ్యక్తం చేశారు బన్నీ. 

1012
Allu arjun

Allu arjun

Allu arjun

ఇవన్నీ బన్నీని సొంతంగా ఎదిగేందుకు దోహపడ్డ అంశాలని కామన్‌ నెటిజన్ల నుంచి వినిపిస్తున్న మాట. బన్నీ(అల్లు వారి)ఫ్యామిలీ ఇప్పుడు అన్ని విషయాల్లో ఎదుగుతుంది. సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. థియేటర్‌ బిజినెస్‌ కూడా స్టార్ట్ చేశారు. అనేక సినిమాలను డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. థియేటర్లున్నాయి. ఏకంగా స్టూడియో కూడా నిర్మిస్తున్నారు. ఒక సినిమా వ్యవస్థనే క్రియేట్‌ చేస్తున్న నేపథ్యంలో ఇంకా ఎవరి పేరునో మోయాల్సిన అవసరం లేదని బన్నీ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తున్న వాదన. అందుకే మెగా ఫ్యామిలీని పక్కన పెట్టారని ఇంటర్నెట్‌ టాక్‌. అందులో భాగంగా నందమూరి ఫ్యామిలీతో దగ్గరయ్యే ప్రయత్నమని, తాము ఇప్పుడు స్వతంత్రం అని చెప్పే ప్రయత్నమని చర్చ నడుస్తుంది. 

1112

చిరంజీవి రీఎంట్రీ తర్వాత తనే సొంతంగా `కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ` పేరుతో కొత్త బ్యానర్‌ స్థాపించారు. `ఖైదీ నంబర్‌ 150`, `సైరా`, ఇప్పుడు `ఆచార్య`, `గాడ్‌ఫాదర్‌` ఇలా చిరంజీవి సినిమాలన్నీ ఆయన బ్యానర్‌లోనే ఇతర ప్రొడక్షన్ కంపెనీలతో కలిసి నిర్మిస్తున్నారు. గీతా ఆర్ట్స్ లో సినిమాలు చేసి చాలా రోజులవుతుంది. నెక్ట్స్ జనరేషన్‌లో పవన్‌ కళ్యాణ్‌ని పక్కన పెడితే రామ్‌చరణ్‌ టాప్‌ స్టార్‌గా ఎదిగారు. ఆయన కూడా `ఆర్‌ఆర్‌ఆర్‌`తో పాన్‌ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఇప్పుడు శంకర్‌తో సినిమా చేస్తున్నారు. బన్నీకి దీటుగా ఎదుగుతున్నారు. 

1212

అయితే ప్రస్తుతం  బాలయ్య `అఖండ` చిత్రానికి అల్లు అర్జున్‌ గెస్ట్ గా వెళ్లడంపై ఓ వైపు బన్నీ ఫ్యాన్స్, బాలయ్య ఫ్యాన్స్ పండగ చేసుకుంటుంటే, మెగా ఫ్యాన్స్ మాత్రం షాక్‌ అవుతున్నారట. మెగా, అల్లు వారి మధ్య విభేధాలు నడుస్తున్నాయనే వార్త నెట్టింట వైరల్‌ అవుతున్న క్రమంలో తాజా పరిణామాల నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ కొత్త బంధంపై వాళ్లు ఆరా తీస్తున్నారని టాక్‌. అయితే ఇటీవల సాయిధరమ్‌ తేజ్‌ విషయంలోనూ, దీపావళి సందర్భంగా మెగా హీరోలంతా కలిశారు. పదేపదే తాము కలిసే ఉన్నామనే సంకేతాలనిస్తున్నారు. పైకి మాత్రం బాగానే ఉన్నామని, ఫ్యాన్స్ ది అనవసరమైన ఆందోళనే గానీ, వారంతా ఎప్పుడూ ఒక్కటే అని క్రిటిక్స్ అభిప్రాపడుతున్నారు. మరోవైపు పైకి బాగానే ఉన్నా, లోలోపల మాత్రం ఈగోలు క్యారీ అవుతున్నాయని మరో వాదన. మరి ఇందులో ఏది నిజమనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. 

also read: 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
అల్లు అర్జున్
వినోదం
పవన్ కళ్యాణ్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved