MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భారతీయుడు 2తో టాలీవుడ్ హీరోలకు మొదలైన వణుకు..రాబోతున్న సీక్వెల్స్ ఇవే, ఆ మూడు చిత్రాలు ఫ్లాప్ అయితే..

భారతీయుడు 2తో టాలీవుడ్ హీరోలకు మొదలైన వణుకు..రాబోతున్న సీక్వెల్స్ ఇవే, ఆ మూడు చిత్రాలు ఫ్లాప్ అయితే..

సౌత్ లో సీక్వెల్స్ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ అంటేనే వణుకు మొదలయింది. మన్మథుడు 2, కిక్ 2 లాంటి సీక్వెల్స్ డిజాస్టర్ అయ్యాయి. బాహుబలి చిత్రం పార్ట్ 1 పార్ట్ 2 గా వచ్చి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే విధంగా కెజిఎఫ్ చరిత్ర సృష్టించింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 21 2024, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

చిత్ర పరిశ్రమలో సీక్వెల్ చిత్రాల ట్రెండ్ బాగా పెరిగిపోయింది. కొంతమంది దర్శకులు నిర్మాతలు సీక్వెల్స్ ని వరుస ప్రాంఛైజీలు గా మార్చేస్తున్నారు. బాలీవుడ్ లో యాష్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్, క్రిష్ సిరీస్ బాగా వర్కౌట్ అవుతున్నాయి. సౌత్ లో కూడా కొంతమంది దర్శకులు సీక్వెల్ చిత్రాలు చేస్తున్నారు. సౌత్ లో సీక్వెల్స్ విషయంలో మిక్స్డ్ రిజల్ట్స్ వస్తున్నాయి. రీసెంట్ గా భారతీయుడు 2 డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ అంటేనే వణుకు మొదలయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మన్మథుడు 2, కిక్ 2 లాంటి సీక్వెల్స్ డిజాస్టర్ అయ్యాయి. బాహుబలి చిత్రం పార్ట్ 1 పార్ట్ 2 గా వచ్చి ఇండియాలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అదే విధంగా కెజిఎఫ్ చరిత్ర సృష్టించింది. డీజే టిల్లు, హిట్ 1, హిట్ 2.. కార్తికేయ, కార్తికేయ 2 చిత్రాలు సక్సెస్ ఫుల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో భవిష్యత్తులో రాబోతున్న సీక్వెల్ చిత్రాలు ఏవి.. వాటిలో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్నవి ఏవో ఇప్పుడు చూద్దాం. 
 

38

పుష్ప 2 : టాలీవుడ్ త్వరలో రాబోతున్న భారీ సీక్వెల్ పాన్ ఇండియా మూవీ అంటే పుష్ప 2 ది రూల్ అనే చెప్పాలి. ఎర్రచందనం సిండికేట్ డాన్ గా అల్లు అర్జున్.. పోలీస్ అధికారికంగా ఫహద్ ఫాజిల్ మధ్య యుద్ధం పుష్ప 2లో తారా స్థాయిలో ఉండబోతోంది. భారతీయుడు 2 డిజాస్టర్ అయింది. పుష్ప 2 గురించి కూడా అనేక రూమర్స్ వస్తున్నాయి. దీనితో ఫ్యాన్స్ లో కంగారు మొదలైంది. పుష్ప 2 కనుక ఫెయిల్ అయితే బిజినెస్ లాస్ దారుణంగా ఉంటుంది. కాబట్టి సుకుమార్ అవుట్ పుట్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

48
Salaar,

Salaar,

సలార్ 2 :  సలార్ చిత్రం పర్వాలేదనిపించింది కానీ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో పడాల్సినంత బ్లాక్ బస్టర్ దక్కలేదు. సలార్ 2 కి మాత్రం ప్రశాంత్ నీల్ పార్ట్ 1 లో భారీ సెటప్ సిద్ధం చేసి ఉంచారు. పార్ట్ 2లో చెలరేగడమే అన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. సలార్ 2 శౌర్యంగపర్వం పేరుతో రానుంది. సలార్ 2 ఆలస్యం కావచ్చు కానీ రావడం మాత్రం పక్కా అంటున్నారు. ఎప్పుడు వచ్చినా ప్రభాస్ రేంజ్ కి తగ్గకుండా ఉండాలని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాప్ కాకుండదు. ఎందుకంటే ఇది ప్రశాంత్ నీల్ సినిమా అని ఆడియన్స్ అంటున్నారు. 

58

గూఢచారి 2 : ఐదేళ్ల క్రితం అడివి శేష్ నటించిన గూఢచారి చిత్రం తెలుగు ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేసింది. అడివిశేష్ పెర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్, అద్భుతమైన టేకింగ్ అన్ని అంశాలలతో గూఢచారి చిత్రం తెలుగు ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్. త్వరలో గూఢచారి 2 రానుంది. ఈసారి అడివి శేష్ ఎలాంటి సర్ప్రైజ్ లో ఇస్తారో చూడాలి. 

68

జై హనుమాన్ : హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ షేక్ చేశారు. తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరిచే బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా జై హనుమాన్ ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 

78

హిట్ 3 : హిట్ సిరీస్ ఒక ప్రాంచైజీ గా కొనసాగుతోంది. మొదటి భాగంలో విశ్వక్ సేన్, రెండవ భాగంలో అడివి శేష్ నటించారు. రెండు మంచి హిట్స్ గా నిలిచాయి. మూడవ భాగంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్నారు. 

 

88

బింబిసార ప్రీక్వెల్ : బింబిసార ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలుసు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మైండ్ బ్లోయింగ్ బ్లాక్ బస్టర్ గా ఈ చిత్రం నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ కాదు కానీ ప్రీక్వెల్ ప్రకటించారు. కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. కళ్యాణ్ రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం విఫలం కాకూడదని ఫ్యాన్స్ కోరుతున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అల్లు అర్జున్
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: బాస్ ఈజ్ బ్యాక్.. ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై మెగాస్టార్.. చిరంజీవికి కూటమి సర్కార్ బిగ్ ఆఫర్ !
Recommended image2
Villain Ajay: తన భార్యపై నటుడు అజయ్ సంచలన వ్యాఖ్యలు..ఖుషి అప్పుడే మొదలు, విక్రమార్కుడు ఆమె వల్లే వచ్చింది
Recommended image3
Jana Nayagan Day 3 Collection: మూడో రోజు మోత మోగించిన విజయ్ మూవీ, రూ.200 కోట్ల వైపు దూసుకెళ్తున్న 'జన నాయగన్'
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved