- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి ప్రవర్తనకి విసిగిపోతున్న ఏంజెల్.. వసుని చూసి షాకైన శైలేంద్ర!
Guppedantha Manasu: రిషి ప్రవర్తనకి విసిగిపోతున్న ఏంజెల్.. వసుని చూసి షాకైన శైలేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. కొడుకుని చాలా సంవత్సరాల తర్వాత చూడబోతున్నందుకు భావోద్వేగానికి లోనవుతున్న తల్లిదండ్రుల కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజీకి వస్తాను అంటుంది వసు. వద్దు కాలు బాలేదు అంటాడు రిషి. రాకపోతే నా మనసు భారంగా అయిపోతుంది వస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంది వసు. విశ్వనాథం కూడా వసుకి సపోర్ట్ చేస్తాడు. అయితే ఏంజెల్ ని కూడా కాలేజీకి తీసుకువెళ్తాము ఒకవేళ అక్కడ మేడంకి ఏమైనా ప్రాబ్లం అయితే ఏం వెనక్కి తిరిగి తీసుకువచ్చేస్తుంది అంటాడు రిషి. సరే అంటూ ఏంజెల్ పిలిచి విషయం చెప్తాడు విశ్వనాథం.
తను కాలేజీకి రావటానికి ముందు ఇంట్రెస్ట్ చూపించదు కానీ రిషి చెప్పడంతో తప్పనిసరి పరిస్థితిలో కాలేజీకి బయలుదేరుతుంది. కార్ లో ప్రయానిస్తూ ఉండగా కాలు నొప్పి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఏంజెల్ కి చెప్తూ ఉంటాడు రిషి. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు పక్కనే ఉంది కదా తనకి చెప్పు అంటుంది ఏంజెల్. అలా అని కాదు నేను జనరల్ గా చెప్తున్నాను అంటాడు రిషి. ఇద్దరూ ఒకే కాలేజీలో వర్క్ చేస్తారు కదా అయినా ఎందుకు ఒకరితో ఒకరు మాట్లాడుకోవటానికి అంత ఇబ్బంది పడతారు ఏంటి ప్రాబ్లం అని అడుగుతుంది ఏంజెల్.
తర్వాత విశ్వనాధాన్ని వెనక్కి రమ్మని చెప్పి వసుని ముందు సీట్లో కూర్చోబెడుతుంది. వాళ్ళిద్దర్నీ కమ్యూనికేట్ చేయడం కోసం చాలా ప్రయత్నిస్తుంది. మరోవైపు సెమినార్ కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కేడి బ్యాచ్. ఒకప్పుడు సెమినార్ అంటే చెడగొట్టడంలో ముందు ఉండే వాళ్ళని కానీ ఇప్పుడు మనమే దగ్గర ఉండి అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అని నవ్వుకుంటారు. ఇది రిషి సర్ అరేంజ్ చేసిన సెమినారు ఖచ్చితంగా సక్సెస్ చేసి తీరాలి అంటాడు పాండ్యన్.
అంతలోనే రిషి వాళ్ళు రావడంతో వాళ్లకి విష్ చేసి తాము చేసిన అరేంజ్మెంట్స్ అన్నింటి గురించి చెప్తాడు పాండ్యన్. సరే అని పాండ్యన్ ని పంపించేసి నువ్వు వసుధార మేడం పక్కనే కూర్చో అని ఏంజెల్ కి ఆర్డర్ వేస్తాడు రిషి. సరే అంటుంది వసు. మీరు నా పక్కన ఉండగా నాకు ఎలాంటి ప్రాబ్లం రాదు అని మనసులో అనుకుంటుంది వసుధార. అందరూ కలిపి లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ తో సహా అందరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంతకీ గెస్ట్ లు ఎవరు అని అడుగుతాడు రిషి.
అది చెప్పకూడదు అంటాడు ప్రిన్సిపల్. అదేంటి ఇదేమి కాన్ఫిడెన్షియల్ మీటింగ్ కాదు కదా సెమినార్ కదా అంటాడు రిషి. ఏమో సార్ వాళ్లకి పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టం లేదేమో అంటాడు ప్రిన్సిపల్. ఆ తర్వాత ఎవరి ప్లేస్ లోకి వాళ్ళు వెళ్లి పోయిన తర్వాత వసు కి జాగ్రత్తలు చెప్తాడు రిషి. ఒక పక్కగా కూర్చోండి అటు ఇటు తిరగకండి అని ఓవర్ కేరింగ్ తీసుకుంటాడు. మీరిద్దరూ మాట్లాడుకోరు గాని మీ ఇద్దరి మధ్యన ఏదో బాండింగ్ కనిపిస్తుంది ఏంటది అని నిలదీస్తుంది ఏంజెల్.
అలాంటిదేమీ లేదు కానీ నువ్వు మేడం పక్కనే కూర్చో తనకి ఎలాంటి ఇబ్బంది రానివ్వకు అని చెప్పి అరేంజ్మెంట్స్ చూసుకోవటానికి వెళ్ళిపోతాడు రిషి. మరోవైపు శైలేంద్ర కాలేజీకి వచ్చి ఎందుకు పిన్ని బాబాయ్ వాళ్ళు ఇక్కడికి పిన్ని బాబాయ్ కి అన్నీ చెప్పేసిందా అసలు ఏం జరుగుతుంది అనుకుంటూ మాస్క్ పెట్టుకొని సెమినార్ రూమ్ వరకు వస్తాడు. లోపలికి రాకుండా ఏం జరుగుతుందో అంటూ బయటి నుంచే చూస్తూ ఉంటాడు. అదే సమయంలో ఏంజెల్ కి ఏదో ఫోన్ రావటంతో పక్కకి వెళ్లి ఫోన్ మాట్లాడుతుంది.
అది గమనించిన రిషి ఏంజెల్ దగ్గరికి వెళ్లి తన పక్కనే కూర్చొని ఉన్నాను కదా మళ్ళీ తనకు ఇబ్బంది అవుతుంది అంటాడు. తనకి కాల్ బాగో లేకపోతే ఇంటికి తీసుకువచ్చింది నేనే ఆ విషయం మర్చిపోయినట్లుగా ఉన్నావు అయినా నన్ను కాస్త కూడా రిలాక్స్ అవ్వనివ్వవా అంటూ కాస్త చిరాకు పడుతుంది. అయినా మళ్లీ వచ్చి వసు పక్కనే కూర్చుంటుంది ఏంజెల్. అదే సమయంలో వసు ని చూసేస్తాడు శైలేంద్ర.
ఒక్కసారిగా షాక్ అయ్యి పిన్ని బాబాయ్ వాళ్ళు అందుకే ఇక్కడికి వస్తున్నారా వీళ్ళందరూ కలిపి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటాడు. మరోవైపు సెమినార్కి వస్తున్న మహేంద్ర రిషి ని చూసి ఎగ్జైట్ అవ్వద్దు అని జగతికి చెప్తాడు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.