MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Karthika Deepam 2 Today Episode: జ్యోని చెప్పుతో కొడతానన్న దీప-శ్రీధర్ అనుమానం-కార్తీక్ కొత్త ప్లాన్

Karthika Deepam 2 Today Episode: జ్యోని చెప్పుతో కొడతానన్న దీప-శ్రీధర్ అనుమానం-కార్తీక్ కొత్త ప్లాన్

Karthika Deepam 2 Today Episode (మే 6వ తేదీ)లో జ్యోకు సపోర్ట్ చేసిన శ్రీధర్. మండిపడ్డ కాంచన. జ్యోత్స్నకు మాస్ వార్నింగ్ ఇచ్చిన దీప. వైరాతో కలిసిపోయిన విషయం తాతకు చెప్తానని బెదిరింపు. కార్తీక్ కొత్త ప్లాన్. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందంటే.. 

3 Min read
Author : Kavitha G
Published : May 06 2026, 08:53 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్
Image Credit : Jiohotstar

కార్తీక దీపం 2 సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్ బుధవారం ఎపిసోడ్ లో కార్తీక్, దీప మాట్లాడుకుంటూ ఉంటారు. పెళ్లికి, అగ్రిమెంట్ కి ముడిపెట్టి జ్యోత్స్న తప్పించుకుంది బావ అంటుంది దీప. మా అమ్మ అడిగిన ఏ ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదు. అందుకే అలా చేసింది అంటాడు కార్తీక్. నేను మాట తప్పను కాబట్టి తన పెళ్లి అయ్యేంతవరకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయనని చెప్పింది అంటాడు కార్తీక్. అయితే జ్యోత్స్న పెళ్లికి ఒప్పుకున్నట్లేనా అని అడుగుతుంది దీప. హా ఒప్పుకున్నట్లే అంటాడు కార్తీక్. జ్యో మనసు దుర్మార్గమైంది బావ. దాన్ని నమ్మడానికి లేదు అంటుంది దీప. అంతలో జ్యోత్స్న ఫోన్ చేసి మీతో మాట్లాడాలి పైకి రండి అని చెప్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
శ్రీధర్, కాంచన గొడవ
Image Credit : Jiohotstar

శ్రీధర్, కాంచన గొడవ

మరోవైపు కాంచన, శ్రీధర్ కార్తీక్ గురించి గొడవ పడుతుంటారు. జ్యోత్స్న చేసింది, చేస్తోంది వందకు వంద శాతం కరెక్ట్ అంటాడు శ్రీధర్. మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారేంటి అని మండిపడుతుంది కాంచన. జ్యోత్స్న మెడలో తాళి పడితే కానీ నా కొడుక్కి విముక్తి దక్కకపోవడం ఏంటండీ అని సీరియస్ అవుతుంది కాంచన. సరే జ్యోత్స్న అలా అన్నదే అనుకో.. కార్తీక్ ఆగిపోవాల్సిన అవసరం ఏంటి? జ్యోత్స్న స్వార్థపరురాలే. కానీ కార్తీక్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు. వీటి అన్నింటి వెనుక దీప ఉంది. కార్తీక్, దీప కోసమే ఇదంతా చేస్తున్నాడు. కానీ అది ఎందుకో నాకు తెలియదు.. తెలుసుకోవాలి అంటాడు శ్రీధర్.

Related Articles

Related image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన
Related image2
Karthika Deepam 2 Today Episode: కాశీ, స్వప్న గొడవ-షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు?
37
జ్యోను చెప్పుతో కొడతానన్న దీప
Image Credit : Jiohotstar

జ్యోను చెప్పుతో కొడతానన్న దీప

కార్తీక్, దీప కలిసి జ్యోత్స్న దగ్గరకు వెళ్తారు. నేను ఇచ్చిన ఆఫర్ కి మీరు నాకు థాంక్స్ చెప్పాలి. చెప్పించుకునేందుకే పిలిచాను. ఇంకా సీఈఓ పోస్టు అంటావా… అది కూడా నాకే వస్తుందనుకో అంటుంది జ్యోత్స్న. ఏంటి బావ ఇది బాగా రెచ్చిపోతోంది అంటుంది దీప. ఇది అంటావేంటే అంటుంది జ్యోత్స్న. అంటానే అని మాస్ వార్నింగ్ ఇస్తుంది దీప. 

నా మెడలో తాళి పడితే రెండు సమస్యలు తీరుతాయి. నువ్వు వారసురాలివని చెప్పడం, బావ సీఈఓ కావడం. అలా జరగాలంటే బావ నా మెడలో తాళి కట్టాలి అంటుంది జ్యో. చెప్పుతో కొడతానని సీరియస్ వార్నింగ్ ఇస్తుంది దీప. అయినా నువ్వెవరే.. మాకు ఆఫర్లు ఇవ్వడానికి. అగ్రిమెంట్ దాటడానికి మా బావకు క్షణం పట్టదని చిటికెలు వేస్తుంది దీప.

నాకు కోపం వచ్చిందంటే కిందకి వెళ్లి తాతతో నిజం చెప్పేస్తాను అంటుంది దీప. నేనే వారసురాలిని అని చెప్తావా.. అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు నువ్వు వైరాతో చేతులు కలిపావని చెప్తాను అని బెదిరిస్తుంది దీప. కొద్ది రోజులు ఆగు.. నేను, నా భార్యా కలిసి నీ పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతామని చెప్తాడు కార్తీక్. సీఈఓ అవుతుందట బావ ఇది. సీఈఓ కాదు కదా.. ఆఫీస్ క్లర్క్ కూడా కాలేదు అంటాడు కార్తీక్. సీఈఓ గురించి నేను తాతతో మాట్లాడాలి పదా.. అని దీపను తీసుకొని వెళ్లిపోతాడు కార్తీక్.

47
కార్తీక కొత్త ప్లాన్
Image Credit : Jiohotstar

కార్తీక కొత్త ప్లాన్

దశరథ, శివన్నారాయణలను పిలిచి సీఈఓ గురించి మాట్లాడుతాడు కార్తీక్. మనం ఒక యంగ్ అండ్ డైనమిక్ కుర్రాడిని చూసి కంపెనీ బాధ్యతలు అప్పగించాలి. ఆ కుర్రాడి లక్షణాలు చూసి జ్యోత్స్నతో పెళ్లి చేయాలి. అప్పుడు అన్నీ మన చేతిలోనే ఉంటాయి అని చెప్తాడు కార్తీక్. ఈ ఐడియా సూపర్ గా ఉంది మనవడా అనుకుంటూ వాళ్ల దగ్గరకు వస్తుంది పారు. సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని ప్రకటన ఇవ్వండని చెప్తాడు శివన్నారాయణ. జ్యోత్స్నకు ఈ విషయం కొంతవరకు తెలిసేలా చేయమని సలహా ఇస్తాడు కార్తీక్. అంతా లోపలికి వెళ్తారు.

57
మ్యాటర్ లీక్ చేసిన జ్యో
Image Credit : Jiohotstar

మ్యాటర్ లీక్ చేసిన జ్యో

మరోవైపు మీ అత్తకు ఫోన్ చేసి సారీ చెప్పు జ్యోత్స్న అంటుంది సుమిత్ర. ఎందుకు మమ్మీ అని అడుగుతుంది జ్యోత్స్న. నేను చెప్పకపోతే అర్థం చేసుకోలేనంత చిన్న పిల్లవేమి కావు నువ్వు అంటుంది సుమిత్ర. ఇంతలో శివన్నారాయణ వచ్చి జ్యోత్స్న నీతో మాట్లాడాలి అంటాడు. అప్పుడే బోర్డు మెంబర్స్ వస్తారు. జ్యోత్స్ననే వాళ్లను రప్పిస్తుంది. సీఈఓ గురించి మాట్లాడతారు బోర్డ్ మెంబర్స్. ఇది మీరే మాట్లాడుతున్నారా? మీతో ఎవరైనా మాట్లాడనిస్తున్నారా? అని అడుగుతాడు కార్తీక్. బయట వాళ్లని సీఈఓగా చేయాలి అనుకుంటే, మేం కంపెనీలో ఉండాలో లేదో నిర్ణయం తీసుకుంటామని చెప్పి వెళ్లిపోతారు బోర్డు మెంటర్స్.

67
నువ్వు ఏది ఆపలేవు..
Image Credit : Jiohotstar

నువ్వు ఏది ఆపలేవు..

మేము వెళ్తున్నామని చెప్పి కార్తీక్, దీప బయటకు వెళ్తారు. వారి వెనకాలే వచ్చిన జ్యోత్స్న. ఇప్పుడు గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది బావ. బోర్డు మీటింగ్ లో చాలా అద్భుతాలు జరుగుతాయి.. నువ్వు ఏది ఆపలేవు అంటుంది. వాళ్లను నువ్వే పిలిపించావని నాకు తెలుసు. ఏం చేయాలో కూడా నాకు తెలుసు అని చెప్పి వెళ్లిపోతాడు కార్తీక్.

77
సూరజ్ చిరాకు
Image Credit : Jiohotstar

సూరజ్ చిరాకు

మరోవైపు క్యాబ్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు సూరజ్. ఏంటీ ఈ దారిలో ఒక్క క్యాబ్ కూడా బుక్ కావట్లేదు. అన్నీ క్యాన్సిల్ అవుతున్నాయని చిరాకు పడుతుంటాడు సూరజ్. అంతలో కారులో అటువైపుగా వస్తుంది జ్యోత్స్న. ఇతడ్ని ఎక్కడో చూసినట్లుగా ఉందే.. అని బొమ్మల షాపులో జరిగిన ఇన్సిడెంట్ ని గుర్తు చేసుకొని కారు ఆపుతుంది జ్యోత్స్న. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Recommended image2
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image3
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Related Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: నిజం దాచిన కార్తీక్- చెంప పగలగొట్టిన కాంచన- పారు, జ్యో వాదన
Recommended image2
Karthika Deepam 2 Today Episode: కాశీ, స్వప్న గొడవ-షాక్ ఇచ్చిన జ్యో-సీఈఓ పోస్ట్ ఖాళీ-న్యూ బాస్ ఎవరు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved