MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • 10 కోట్లు లోన్ తీసుకుని 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎలా సాధ్యం అయ్యింది?

10 కోట్లు లోన్ తీసుకుని 100 కోట్లు సంపాదించిన టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా? ఎలా సాధ్యం అయ్యింది?

హీరోలే కాదు.. హీరోయిన్లు కూడా చాలా తెలివిగా డబ్బు సంపాదిస్తున్నారు. ముందు చూపుతో ఆస్తులు కొనుకుంటున్నారు. సొంతంగా వ్యాపారాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఓ హీరోయిన్ 10 కోట్లు లోన్ తీసుకుని మరీ.. 100కోట్లు సంపాదించింది. ఎవరా బ్యూటీ, ఎలా సాధ్యం అయ్యింది? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 06 2026, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలివిగా ఆలోచిస్తున్న హీరోయిన్లు..
Image Credit : Asianet News

తెలివిగా ఆలోచిస్తున్న హీరోయిన్లు..

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నారు పెద్దలు. ఈ విషయాన్ని కొంత మంది హీరోయిన్లు బాగా ఫాలో అవుతున్నారు. హీరోలకంటే రెమ్యునరేషన్ చాలా తక్కువా అందుకోవడంతో.. వచ్చిన రెమ్యునరేషన్ ను రకరకాలుగా ఇన్వెస్ట్ చేసి.. లాభాలు సాధిస్తున్నారు నేటి తరం తారలు.

 దాదాపు అందరు హీరోయిన్లు ఏదో ఒక బిజినెస్ లు చేస్తూ.. జీవితంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. సినిమాల టైమ్ అయిపోయాక.. ఫుట్ టైమ్ వ్యాపారాలు చూసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ ఓ హీరోయిన్ 20 ఏళ్ళ కిందటే అందరికంటే తెలివిగా ఆలోచించి చేసిన సాహసం.. ఆమెకు ఇప్పుడు 100 కోట్లు తెచ్చిపెట్టింది. ఇంతకీ ఎవరామె ఏం చేసిందంటే?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
10 కోట్లు లోన్ తీసుకుని ఇల్లు కట్టిన మీనా..
Image Credit : Instagram

10 కోట్లు లోన్ తీసుకుని ఇల్లు కట్టిన మీనా..

ఆ హీరోయిన్ ఎవరో కాదు మీన. అవును మీనా చాలా తెలివిగా ఆలోచించింది. మీన 2000 సంవత్సరంలో ఓ బ్యాంక్ లో 10 కోట్లు లోన్ తీసుకుంది. ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేస్తుందేమో అనుకున్నారు అంతా. కానీ ఆమె ఆ డబ్బుతో చెన్నైలో స్థలం కొని, అందులో విలాసవంతమైన ఇల్లు కట్టుకున్నారు. చాలామంది ఇదేం పిచ్చిపని అని ఆమెను విమర్శించారు. దగ్గరివాళ్లేమో రిస్క్ లో పడతావ్ అని తిట్టారు. కానీ మీనా ఎవరి మాట లెక్క చేయలేదు. తనపని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది.

Related Articles

Related image1
Meena : మీనా నిర్ణయం వల్ల సౌందర్య కు దక్కిన అదృష్టం.. సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదంటే?
Related image2
Meena : రెండో పెళ్లిపై మీనా సంచలన కామెంట్స్, ధనుష్ తో వచ్చిన వార్తలపై క్లారిటీ..
36
10 రెట్లు లాభానికి అమ్ముడుపోయిన ఇల్లు..
Image Credit : Youtube/zee cinemalu

10 రెట్లు లాభానికి అమ్ముడుపోయిన ఇల్లు..

దాదాపు 25 ఏళ్ల క్రిందట మీనా చేసిన ఆ సాహసం.. ఇప్పుడు ఆమెకు 10 రెట్లు లాభాలు తీసుకొచ్చింది. అప్పట్లో ఆమె 10 కోట్లతో ఇల్లు కట్టుకుంటే.. అది ఇప్పుడు 100 కోట్లకు అమ్ముడుపోయింది. అప్పట్లోనే 10 కోట్లు లోన్ తీసుకుందంటే.. మరో పది కోట్లు వడ్డీ వేసుకున్నా.. 20 కోట్లకన్న ఎక్కువ అవ్వదు. కానీ మీనా ఆలోచన మాత్రం ఆమె జీవితానికి బాగా ఉపయోగపడింది. చెన్నైలో ముందు ముందు డెవలప్ అయ్యే ఏరియా ఏది అని చూసుకుని మరీ మీనా ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఆ ఇల్లే ఆమెకు భారీగా లాభాలు తెచ్చిపెట్టింది. భర్త లేకపోయినా.. ఆమెకు ఆర్ధికంగా అండగా నిలిచింది.

46
మీనా టాలెంట్ కు ఫిదా అవుతున్నారు..
Image Credit : Asianet News

మీనా టాలెంట్ కు ఫిదా అవుతున్నారు..

ఆ ఇల్లును సంప్రదాయ వాస్తుశైలిలో నిర్మించారు. చేతితో చెక్కిన చెక్క స్తంభాలు, విశాలమైన ప్రాంగణం, ప్యాలెస్ తరహా డిజైన్‌తో దాన్ని తీర్చిదిద్దారు. ఆధునిక భవనాల మధ్య ఇలాంటి పాతకాలపు కళాత్మక ఇళ్లు అరుదుగా ఉండటంతో, ఈ బంగ్లా ఎక్కువ రేటు పలికింది. 

ఈ ఇంటి అందానికి ఫిదా అయిపోయిన అమెరికాకు చెందిన ఓ జంట, 100 కోట్లకు కొనడానికి ముందుకొచ్చారు. ఒకప్పుడు అప్పుగా అనిపించిన పెట్టుబడి, ఇప్పుడు పదింతల లాభాన్ని తెచ్చిపెట్టింది. దీంతో ఒకప్పుడు విమర్శించిన వారే.. ఇప్పుడు మీనాను మంచి ఇన్వెస్టర్ అని ప్రశంసిస్తున్నారు. మీనా టాలెంట్ కు ఫిదా అవుతున్నారు.

56
తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా
Image Credit : our own

తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్ గా

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి వచ్చిన మీనా, హీరోయిన్ గా మారి ఓ ఇరవై ఏళ్లు వెండితెరను ఏలింది. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది సీనియర్ బ్యూటీ. తెలుగులో వెంకటేష్, చిరంజీవి, బాలయ్య, నాగార్జున, శ్రీకాంత్ సుమన్ లాంటి స్టార్లతో ఆడిపాడింది బ్యూటీ.. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్, కమల్ హాసన్, విజయ్ కాంత్, అజిత్, లాంటి స్టార్స్ తో జోడీగా నటించి మెప్పించింది. మీనా ఏజ్ బ్యాచ్ లో హీరోయిన్లు అంతా అమ్మ పాత్రలకు టర్న్ అయ్యారు. కానీ మీనా మాత్రం ఇప్పటికీ సీనియర్ హీరోలకు జోడీగా నటిస్తూనే ఉంది.

66
మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు..
Image Credit : social media

మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు..

ఇక మీనా పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మీనాకు నైనిక అనే కూతురు ఉంది. మీనా భర్త విద్యాసాగర్ కరోనా టైమ్ లో అనారోగ్యంతో మరణించారు. ఆ బాధ నుంచి నెమ్మదిగా కోలుకుంటూ, తన కూతురిని పెంచుకుంటున్నారు. మీనా కూతురు నైనిక, 'తెరి' (తెలుగులో 'పోలీసోడు') సినిమాలో విజయ్ కూతురిగా నటించింది. ఇక మీనా రెండో పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిలో నిజం లేదని.. అవన్నీ కట్టుకథలంటూ ఇంటర్వ్యలలో మీనా కొట్టిపారేసింది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)
వినోదం
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా
తమిళ సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Recommended image2
Short Films for Kids: పిల్లలకు తప్పక చూపించాల్సిన 5 షార్ట్స్ ఫిల్మ్స్.. ఇవి చూస్తే ఇక రీల్స్ జోలికెళ్లరు
Recommended image3
Bigg Boss Telugu 10 Final List: బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌లోకి అడుగుపెడుతున్న 16 మంది కంటెస్టెంట్లు వీళ్లే
Related Stories
Recommended image1
Meena : మీనా నిర్ణయం వల్ల సౌందర్య కు దక్కిన అదృష్టం.. సినిమా చేసి ఉంటే ఎలా ఉండేదంటే?
Recommended image2
Meena : రెండో పెళ్లిపై మీనా సంచలన కామెంట్స్, ధనుష్ తో వచ్చిన వార్తలపై క్లారిటీ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved