- Home
- Entertainment
- Guppedantha Manasu: రిషి బలం ఏంటో తెలుసుకున్న శైలేంద్ర.. అసలు విషయం తెలుసుకుని నిర్గాంత పోయిన జగతి!
Guppedantha Manasu: రిషి బలం ఏంటో తెలుసుకున్న శైలేంద్ర.. అసలు విషయం తెలుసుకుని నిర్గాంత పోయిన జగతి!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో ఎంతో ఇంట్రెస్టింగ్ గా ముందుకి సాగుతుంది. తమ్ముడు మంచి పేరు తెచ్చుకోవడం తో అతని మీద అసూయతో పగ పెంచుకున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు మే 2 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో కాలేజీ లోగోని జగతి వసు ల చేత ఓపెన్ చేద్దాం అంటాడు రిషి. ఆ మాటలకి హర్ట్ అవుతాడు శైలేంద్ర. ఈ లోగో మీరే ఓపెన్ చేయండి ఈ మెడికల్ కాలేజ్ మీ కల మేము ఏం చేసినా అంతా మీ కోసమే అంటుంది వసు. అయితే ముగ్గురు కలిసి ఓపెన్ చేద్దాం అంటూ ముగ్గురు కలిసి డిబిఎస్టి మెడికల్ కాలేజ్ లోగో ఓపెన్ చేస్తారు.
అందరూ కంగ్రాట్స్ చెప్తారు. శైలేంద్ర కూడా బయటకి కంగ్రాట్స్ చెప్తాడు కానీ మనసులో మాత్రం నీ బలం వీళ్లిద్దరూ అన్నమాట, వీళ్లిద్దరిని నీ నుంచి దూరం చేస్తే నీ పతనాన్ని నేను చూడొచ్చు, ఆ రోజు ఎంతో దూరంలో లేదు అనుకుంటాడు. ఆ కార్యక్రమం తర్వాత అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. రిషి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అతన్ని ఆపి అతనికి బ్రేస్లెట్ గిఫ్ట్ గా ఇస్తుంది.
అది చూసి ఇంప్రెస్ అవుతాడు రిషి. చాలా బాగుంది కానీ బ్రేస్లెట్ ఎందుకు గిఫ్ట్ గా ఇచ్చావు అని అడుగుతాడు. మీరు సంతకం పెట్టిన ప్రతిసారి నేను గుర్తుకు రావాలి, మీరు చేసే ప్రతి పనిలోనూ ఈ వసుధార టచ్ ఉండాలి అంటుంది వసు. బ్రేస్లెట్ ఉన్నా,లేకపోయినా ప్రతిక్షణం నువ్వు గుర్తొస్తూనే ఉంటావు అంటాడు రిషి. మరోవైపు మెడికల్ కాలేజీ కట్టడానికి సైట్ చూపించి, ఎక్కడెక్కడ ఏ ఏ బ్లాక్ వస్తాయో శైలేంద్ర కి చెప్తూ ఉంటాడు రిషి.
శైలేంద్ర మాత్రం ఈ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తావో, అడ్మిషన్స్ ఎలా ఓపెన్ చేస్తావో నేను చూస్తాను అని మనసులోని కసిగా అనుకుంటాడు. బయటికి మాత్రం ఏమి తెలియనట్లుగా ఫైల్ పట్టుకోవటానికి శైలేంద్ర ఇబ్బంది పడుతుంటే ఆ ఫోన్ ని రిషి పట్టుకుంటాడు. అప్పుడే సౌజన్య రావు ఫోన్ చేయటంతో కంగారుగా అతని దగ్గర నుంచి ఫోన్ తీసుకొని దూరంగా వెళ్లి అతనితో మాట్లాడుతాడు శైలేంద్ర.
అప్పుడే అక్కడికి వచ్చిన వసు ఎవరితో మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. నా బిజినెస్ పార్ట్నర్స్ తో మాట్లాడుతున్నాను అంటాడు శైలేంద్ర. అప్పుడే అక్కడికి వచ్చిన రిషి ఇక్కడ కూడా బిజినెస్ ఏంటి అన్నయ్య అంటాడు. వసు తన చేతిలో ఉన్న గొడుగుని రిషికి ఎండ తగలకుండా పట్టుకుంటుంది. అన్నయ్య అంటూ సిగ్గుపడతాడు రిషి. పర్వాలేదు నేనేమీ అనుకోను, తను ప్రేమని చూస్తున్నాను అంటాడు శైలేంద్ర.
అతనికి కూడా గొడుగుని ఇస్తుంది వసు. మరోవైపు క్యాబిల్లోకి వచ్చిన శైలేంద్రని కాలేజీ అంతా చూసావా ఎలా ఉంది అని అడుగుతాడు ఫణీంద్ర. అంతా బానే ఉంది అందరికీ క్యాబిన్లు ఉన్నాయి కానీ మీకెందుకు క్యాబిన్ లేదు డాడీ అని అడుగుతాడు శైలేంద్ర. నేను ఇక్కడికి ఈ తరచుగా రాను కదా వీళ్ళందరూ రోజు వస్తారు కాబట్టి వాళ్ళకి క్యాబిన్లు ఉన్నాయి అంటాడు ఫణీంద్ర. అయినా మీకంటూ ఒక క్యాబిన్ ఉండాలి కదా డాడీ అంటాడు శైలేంద్ర.
ఇదంతా రిషి ని ఇబ్బంది పెట్టడానికే అని గమనించిన జగతి నా క్యాబిన్ తీసుకోండి నేను మహేంద్ర క్యాబిన్లో ఉంటాను అంటుంది. వాడు సరదాగా అంటున్నాడు నువ్వు సీరియస్ గా తీసుకోకు నాకు అంత అవసరమైతే తన కాబిన్ ఇవ్వడానికి రిషి రెడీగా ఉన్నాడు అంటాడు మహేంద్ర. అవునన్నయ్య ఈ సీటు పెదనాన్నకే కాదు నీకు కూడా అంటూ శైలేంద్రని తీసుకెళ్లి ఎండి సీట్లో కూర్చోబెడతాడు రిషి.
మీ మధ్యన నిప్పురాజేద్దామంటే రిషి తెలివైనవాడు, నిప్పుని త్వరగా చల్లార్చేసాడు అనుకుంటాడు శైలేంద్ర. మరోవైపు ధరణి దగ్గరికి వచ్చి పొద్దున్న వాళ్లతో పాటు వెళ్లొద్దన్నందుకు బాధపడుతున్నావా అంటుంది దేవయాని. అలాంటిదేమీ లేదు మీకు ఆకలి వేస్తున్నట్లుగా ఉంది భోజనం వడ్డించమంటారా అని అడుగుతుంది ధరణి. నేనేం మాట్లాడుతున్నాను నువ్వేం మాట్లాడుతున్నావు ముందు మొగుడికి వడ్డించడం నేర్చుకో అంటుంది దేవయాని.
నేనంటే ఇష్టం ఉంటే ఏం వడ్డించినా తీయగానే ఉంటుంది అంటూ తెలివిగా సమాధానం చెప్తుంది ధరణి. మాటలు బాగానే నేర్చుకున్నావు, ఈమధ్య వసుధార వాళ్ళతో ఎక్కువగా తిరుగుతున్నావు కదా కొంచెం తగ్గించుకుంటే మంచిది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు రిషి ని తీసుకెళ్లి ఎండి సీట్లో కూర్చోబెట్టి, ఈ సీటు మీకే ఇందులో మీరే కూర్చోవాలి, ఇది నా కోరిక అనుకోండి అంటుంది వసు.
ఈ సీటుకి మీరు మాత్రమే అర్హులు అంటుంది. తరువాయి భాగంలో ఆస్తమాను వంటింట్లోనే ఉంటే లైఫ్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు అంటూ ధరణిని అంటుంది వసు. నేను అదే చెప్తున్నాను, వసు దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి అంటాడు శైలేంద్ర. రిషి, వసు అక్కడ నుంచి వెళ్లిపోయిన తర్వాత మన ఇద్దరి మధ్య ఉన్న దూరం మనిద్దరి మధ్యలోనే ఉండాలి అంటూ శైలేంద్ర భార్యని బెదిరించడం జగతి విని నిర్గాంతపోతుంది .