- Home
- Entertainment
- Guppedantha Manasu: నిజాన్ని తట్టుకోలేక పిచ్చివాడైపోతున్న శైలేంద్ర.. రిషి మాటలకు షాకైన ఏంజెల్?
Guppedantha Manasu: నిజాన్ని తట్టుకోలేక పిచ్చివాడైపోతున్న శైలేంద్ర.. రిషి మాటలకు షాకైన ఏంజెల్?
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి రేటింగ్ ని సంపాదించుకుంటూ టాప్ సీరియల్స్ సరసన స్థానం సంపాదించుకుంటుంది. చనిపోయాడనుకున్న తమ్ముడు బ్రతికి ఉండడం చూసి భరించలేక పిచ్చివాడైపోతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూలై 15 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో నీ ఫస్ట్ సెమినారే ఎంత సక్సెస్ అయింది అంటే ఇదే నీ ఫస్ట్ సెమినార్ ఆఫ్ లేక ఇంతకుముందు ఏ కాలేజీలోనైనా వర్క్ చేసావా అని అడుగుతాడు విశ్వనాథం. చేసి ఉండడులే విశ్వం మనం ఎంతో బతిమాలితేనే ఇక్కడ సెమినార్ ఇచ్చాడు అలాంటిది తను ఇంకెక్కడ పని చేస్తాడు అంటుంది ఏంజెల్. రిషి కూడా అలాగే చెప్తాడు. నేను చేసిన పని వల్ల రిషి సార్ అబద్ధం చెప్పవలసింది వస్తుంది అని గిల్టీ గా ఫీల్ అవుతుంది వసుధార.
తన ఎదురుగా ఉన్న జగతి ఇచ్చిన బొకేని పక్కన పడేయమని ఏంజెల్ కి చెప్తాడు రిషి. ఇంత అందమైన బొకేని పక్కన పడేయటం ఏమిటి దీంతో సెల్ఫీ తీసుకుందాం అంటుంది. ఇష్టం లేకపోయినా ఏంజెల్ వాళ్లతో సెల్ఫీ దిగుతారు వసుధార, రిషి. మరోవైపు రిషి బ్రతికున్నాడన్న నిజాన్ని శైలేంద్ర చెప్పడంతో షాక్ అవుతుంది దేవయాని. చనిపోయాడు అన్నావు మళ్లీ ఎలా బ్రతికి వచ్చాడు అంటుంది. ఆ రౌడీ వెధవలు చెప్పింది విని చనిపోయాడు అనుకున్నాను.
కానీ వాళ్ళు కూడా కన్ఫామ్ చేసుకొని చెప్పారు వాడు బ్రతికే ఉన్నాడు. డి బి ఎస్ టి సామ్రాజ్యం నాదే అనుకున్నాను. ఎలాగైనా వాడిని చంపేస్తాను అంటూ పిచ్చివాడి లాగా ఫ్రెష్టేట్ అవుతాడు శైలేంద్ర. గట్టిగా అరవకు ధరణి గోడ చాటు నుంచి వింటుంది అయినా నువ్వు నా దగ్గరికి ఎందుకు వచ్చేసావు అక్కడే ఉండి ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు.
ఏ విషయమైనా నాతో షేర్ చేసుకో అని చెప్పి పంపిస్తుంది దేవయాని. మరోవైపు బెడ్ క్లీన్ చేస్తూ ఉంటారు ఏంజెల్, వసుధార. గెస్ట్ లు ఎవరు వస్తున్నారు అని అడుగుతుంది వసు. సర్ప్రైజ్ అంటుంది ఏంజెల్. అదే సమయంలో హాల్లో కూర్చున్న రిషి తో మన ఇంటికి గెస్ట్ లు వస్తున్నారు అని చెప్తాడు విశ్వనాథం. ఎవరు అంటాడు రిషి. అందులోనే మహేంద్రవాళ్లు వస్తారు. మాటల్లోనే వచ్చారు పదా వెళ్లి రిసీవ్ చేసుకుందాం అని విశ్వనాథం అనటంతో అతనితో పాటే బయటికి వస్తాడు రిషి.
అక్కడ ఉన్న మహేంద్ర వాళ్ళని చూసి షాక్ అవుతాడు. ఎక్కడ వాళ్లకి పనులు వస్తున్నాయంట ఎలాగూ మీకు ఆత్మీయ అన్నావు కదా అందుకే బయట ఉండటం ఎందుకు ఇక్కడికి రమ్మన్నాను అంటాడు విశ్వనాథం. రిషి ఏమి మాట్లాడడు. వాళ్ళని లోపలికి తీసుకు వచ్చిన తర్వాత మూడీగా ఉన్న రిషి ని చూసి నీకు ఇబ్బందిగా ఉందా నీకు చెప్పకుండానే వాళ్ళని ఇన్వైట్ చేసినందుకు అంటాడు విశ్వనాథం. అలా ఏమి లేదు అని చెప్పి పక్కనే కూర్చుంటాడు రిషి.
లేదండి నాకు తెలిసిన దగ్గర నుంచి తను కొంచెం రిజర్వ్డ్ గానే ఉంటాడు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాడు కానీ ఎవరికి హెల్ప్ అవసరమైన చేస్తాడు అంటాడు మహేంద్ర. అవును ఎప్పుడు తన చుట్టూ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉండాలి అనుకుంటాడు అంటాడు విశ్వనాథం. ఏంజెల్ ని పిలిచి జస్ట్ లో వచ్చారు అని చెప్పటంతో ఏంజెల్, వసు హాల్లోకి వస్తారు. వసు అక్కడ ఉండటం చూసి షాక్ అవుతారు మహేంద్ర దంపతులు.
వాళ్ళని చూసి వసు కూడా అలాగే షాక్ అవుతుంది. వసునే చూస్తున్న జగతితో తనని ఎందుకు అలా చూస్తున్నారు తను ఎక్కడ ఎందుకు ఉందా అని అనుకుంటున్నారా ఏమీ లేదండి తనకి ఇచ్చిన యాక్సిడెంట్ అయింది అనడంతో కంగారు పడతారు జగతి దంపతులు కానీ బయటపడరు. ఈ లోపు విశ్వనాథానికి ఫోన్ రావడంతో మహేంద్ర వాళ్ళకి రూమ్ చూపించమని ఏంజెల్ కి చెప్పి వెళ్ళిపోతాడు.
రిషి నీ రూమ్ ఎక్కడ అని అడుగుతాడు మహేంద్ర. రండి డాడ్ చూపిస్తాను. అని నోరు జారతాడు రిషి. ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంజెల్ ఆయనని డాడ్ అంటున్నావ్ ఏంటి అని అడుగుతుంది. నేను అలా పిలవలేదు అని అబద్ధం చెప్తాడు రిషి. తను డాడ్అని అన్నాడు కదా అని జగతి వాళ్ళని వసుని కూడా అడుగుతుంది ఏంజెల్. మాకు ఏమీ వినపడలేదు అంటారు వాళ్లు. నాకు ఏమైనా హియరింగ్ ప్రాబ్లం వచ్చిందా.. అంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది అంటుంది ఏంజెల్. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.