- Home
- Entertainment
- Guppedantha Manasu: పేపర్లో న్యూస్ చూసి షాకైన రిషి.. జగతి దంపతులను నిలదీస్తున్న శైలేంద్ర!
Guppedantha Manasu: పేపర్లో న్యూస్ చూసి షాకైన రిషి.. జగతి దంపతులను నిలదీస్తున్న శైలేంద్ర!
Guppedantha Manasu: స్టార్ మా లో ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ మంచి కథ కథనాలతో మంచి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. అధికారం కోసం అయిన వాళ్ళని ఇబ్బందులు పడుతున్న ఒక అన్న కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఆగస్టు 14 ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దాం.

ఎపిసోడ్ ప్రారంభంలో తను కోసం బాధపడుతున్న ఏంజెల్ కి ధైర్యం చెప్తాడు విశ్వనాథం. అక్కడే ఉన్న రిషి, వసుధారలతో నాకు ఏంజెల్ గురించే భయంగా ఉంది నేను ఈరోజు కాకపోతే రేపైనా శరీరం వదిలి వెళ్ళిపోవాల్సిందే అని బాధపడతాడు. అప్పుడే వచ్చిన ఏంజెల్ నన్ను వదిలి వెళ్ళిపోతావా అని ఎమోషనల్ అవుతుంది. నాకు కూడా నీ గురించి కంగారుగా ఉంటుంది కదా..
నేను ఇప్పటివరకు నిన్ను ఏమీ అడగలేదు ఇప్పుడు నిన్ను ఒకటి అడుగుతాను అంటూ పెళ్లి చేసుకోమని అడుగుతాడు విశ్వనాథం. దాంతో సీరియస్ అయిపోతుంది ఏంజెల్ ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను ఒంటరి వాడిని అయిపోతానని తను పెళ్లి చేసుకోవడం మానేస్తుంది ఎలాగైనా తన జీవితాన్ని మీరే చక్కదిద్దాలి అని రిషి, వసుధారల దగ్గర మాట తీసుకుంటాడు విశ్వనాథం.
ఆ తర్వాత వసుధార ఇంటికి వెళ్ళేసరికి విశ్వనాథం గారి ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాడు చక్రపాణి. అంతా బానే ఉంది నాన్న కానీ నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. ఏమైంది అంటాడు చక్రపాణి. కాపాడిన వాళ్ళు కష్టంలో ఉంటే చూడలేకపోతున్నారు కానీ నీళ్లు పెట్టుకుంటున్నారు అలాంటిది కన్న తల్లిదండ్రులు బాధపడుతుంటే ఆయన ఎలా చూస్తూ ఊరుకున్నారు అంటుంది. ఆయనకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది కానీ మీరు చేసిన గాయం అతని మనసుని ఇంకా గాయపరుస్తుంది.
అందుకే ఆయన తన ప్రేమని బయటికి చూపించలేకపోతున్నారు కానీ నాకు నమ్మకం ఉంది ఏదో ఒక రోజు ఆయన నిజం తెలుసుకుంటారు మీ అందరినీ దగ్గరికి తీసుకుంటారు అని చెప్తాడు చక్రపాణి. సీన్ కట్ చేస్తే మిషన్ ఎడ్యుకేషన్ గురించి జగతి ఫోన్ చేసిన సంగతి ప్రిన్సిపల్ రిషి కి చెప్తాడు. ఆరోగ్యం బాగోలేదు అందుకే ఇప్పుడే వద్దన్నాను అని కూడా చెప్తాడు. ఆయనకు బాగాకపోతే ఏం సార్ మనం బాగానే ఉన్నాం కదా అంటాడు రిషి.
ఇంతలో ఒక లెక్చరర్ ఒక పేపర్ తీసుకొని సర్ ఈ న్యూస్ చూడండి అని తీసుకొని వస్తాడు. అందులో డిబిఎస్టీ కాలేజ్ పేరు చూసి గబుక్కున పేపర్ తీసుకొని చదువుతాడు రిషి. డి బి ఎస్ టి కాలేజ్ పతనమైపోతుందని, అడ్మిషన్లు రోజురోజుకీ పడిపోతున్నాయని, త్వరలో కాలేజీ మూసేస్తారని అందులో రాసి ఉండటం చూసి షాక్ అవుతాడు రిషి. కాలేజీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందా అని బాధపడతాడు. అప్పుడు ప్రిన్సిపల్ పేపర్ తీసుకొని ఇదేంటి సార్ ఇలా రాశారు అని ప్రిన్సిపల్ కూడా షాక్ అవుతాడు.
ఆ తర్వాత ఒంటరిగా కూర్చొని కాలేజీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు రిషి.కాలేజీ వైభవం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కాలేజీ పతనమైపోతుంటే జగతి మేడం వాళ్ళు ఏం చేస్తున్నారు.. కాలేజీ ఉన్నతిని చూసి పొంగిపోవడం కాదు ఉన్నతిని కాపాడుకోవాలి కదా అంటూ మనసులోనే బాధపడతాడు. ఇంతలో పాండ్యన్ వాళ్ళు వచ్చి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ఏదో మాట్లాడుతారు కానీ పరధ్యానంగా ఉన్న రిషిని చూసి ఏం జరిగింది అని అడుగుతారు.
ఏదో చెప్పబోతున్న రిషి అక్కడ వసుధారని చూసి ఆగిపోతాడు. ఏం సార్ ఏదో చెప్పబోయి ఆగిపోయారు అని అడుగుతాడు పాండ్యన్. ఏం లేదు ఒక్కొక్కసారి చెప్పాలనుకున్న చెప్పలేము అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రిషి. ఎందుకు సార్ అంత కోపంగా ఉన్నారు అని అడుగుతుంది వసుధార. ఈ పేపర్ చూసిన దగ్గరనుంచి సార్ మూడిగా అయిపోయారు. అని చెప్పి డిబిఎస్డి కాలేజీ న్యూస్ చూపిస్తాడు పాండ్యన్. అది చదివిన వసుధార కూడా షాక్ అవుతుంది.
మరోవైపు ఈ న్యూస్ చూసిన జగతి కళ్ళు తిరిగి పడిపోతుంది ఆమెకి ధైర్యం చెప్పి ఈ పని కాలేజీ స్టాఫ్ అయినా చేసి ఉండాలి లేదంటే శైలేంద్ర అయినా చేసి ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు జగతి దంపతులు. ఇంతలో శైలేంద్ర సీరియస్గా అక్కడికి వచ్చి ఏంటిది అంటూ పేపర్ విసిరి కొడతాడు. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదు అంటుంది జగతి.
నన్ను అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు సిగ్గుతో తలదించుకోవలసి వస్తుంది అంటాడు శైలేంద్ర. నిన్నెవరు అడుగుతారు నువ్వు ఈ కాలేజీ బోర్డు మెంబర్ అని ఇక్కడ ఎవరికీ తెలియదు అంటాడు మహేంద్ర. అదంతా మీకు అనవసరం ఈ న్యూస్ కి సమాధానం చెప్పండి అంటూ జగతి దంపతులను నిలదీస్తాడు శైలేంద్ర. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.