Jawan Review: జవాన్ ట్విట్టర్ టాక్: షారుక్ వన్ మ్యాన్ షో యాక్షన్ మూవీ లవర్స్ కి ట్రీట్!
పఠాన్ విజయంతో ఊపుమీదున్న షారుక్ ఖాన్ నెలల వ్యవధిలో జవాన్ అంటూ వచ్చేశారు. సౌత్ ఇండియా డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి షారుక్ మూవీ గురించి ఆడియన్స్ సోషల్ మీడియాలో ఏమంటున్నారో చూద్దాం...
వరుస పరాజయాలతో బ్రేక్ తీసుకున్న షారుక్ ఖాన్(Jawan Review) స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఆయన గత చిత్రం పఠాన్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇండియాలో రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. షారుక్ ఖాన్ ఫుల్ ఫార్మ్ లోకి వచ్చాడు. ఒక్కసారిగా ఆయన సినిమాలపై క్రేజ్ పెరిగిపోయింది. పఠాన్ సక్సెస్ నేపథ్యంలో జవాన్ పై అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక జవాన్ ట్రైలర్(Jawan) ఆ అంచనాలు మరో స్థాయికి తీసుకెళ్లింది. యాక్షన్, సస్పెన్సు అంశాలతో పర్ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా అట్లీ జవాన్ మూవీ తెరకెక్కించాడని అర్థం అవుతుంది. జవాన్ మూవీపై ఉన్న క్రేజ్ అడ్వాన్స్ బుకింగ్స్ లో కనిపించింది. ఈ చిత్రం పఠాన్ రికార్డు బద్దలు కొట్టింది. 5.7 లక్షల టికెట్స్ తో సత్తా చాటింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే స్థాయిలో బిజినెస్ జరిగింది. జవాన్ చిత్రాన్ని మహేష్ బాబు(Mahesh Babu)తో పాటు పలువురు టాలీవుడ్ హీరోలు ప్రమోట్ చేయడం విశేషం. జవాన్ మూవీని ఫ్యామిలీతో చూడబోతున్నాని మహేష్ బాబు ట్వీట్ చేయగా... షారుక్ నేను కూడా జాయిన్ అవుతానని రిప్లై ఇచ్చాడు. తెలుగులో కూడా జవాన్ విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన గత చిత్రాలకు మించిన రెస్పాన్స్ దక్కింది.
మరి ఈ హైప్ ని జవాన్ కొనసాగించిందా? సినిమాలో విషయం ఉందా? ప్రేక్షకులు ఏమంటున్నారు?. ట్విట్టర్ లో ఈ సినిమా పట్ల ఆడియన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. దర్శకుడు అట్లీ మేకింగ్, షారుక్ ఖాన్ ప్రెజెన్స్ ఆకట్టుకుందన్న మాట వినిపిస్తోంది. బలమైన కథను సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించడంలో అట్లీ సక్సెస్ అయ్యాడని అంటున్నారు.
చెప్పాలంటే జవాన్ వన్ మ్యాన్ షో. షారుక్ (Shahrukh Khan)డిఫరెంట్ రోల్స్, గెటప్స్ లో మెస్మరైజ్ చేశాడు. ఆయన క్యారెక్టర్స్ లో వేరియేషన్స్ ఫ్యాన్స్ కి ట్రీట్. యాక్షన్ సన్నివేశాల్లో అదరగొట్టారని అంటున్నారు. షారుక్ ని అట్లీ పూర్తి స్థాయిలో ఎలివేట్ చేశారని అంటున్నారు.
నయనతార పాత్రకు కూడా మార్క్స్ పడుతున్నాయి. ఆమెను కేవలం గ్లామర్ కి పరిమితం చేయకుండా కథలో కీలకం చేశారు. ఆమె పాత్ర సినిమాకు మరో హైలెట్. ఇక దీపికా పదుకొనె గెస్ట్ రోల్, ప్రియమణి అదనపు ఆకర్షణ అని చెప్పాలి. విజయ్ సేతుపతి విలన్ గా షారుక్ తో పోటీపడ్డాడని అంటున్నారు.
ఉన్నతమైన నిర్మాణ విలువలు, గ్రేట్ విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచుతాయి. ఇక అనిరుధ్ మ్యూజిక్ పట్ల మిక్స్డ్ టాక్ వినిపిస్తుంది. బహుశా ఆయన సౌత్ ఫ్లేవర్ నార్త్ ఆడియన్స్ కి అంతా నచ్చలేదేమో. కొందరు బీజీఎమ్, సాంగ్స్ మైనస్ అంటున్నారు.
మొత్తంగా షారుక్ ఫ్యాన్స్, యాక్షన్ మూవీ లవర్స్ ఆశించే అన్ని అంశాలు జవాన్ మూవీలో ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ట్విట్టర్ టాక్ చూస్తే జవాన్ హిట్ అంటున్నారు. మరి పూర్తి రివ్యూ వస్తే కానీ సినిమా ఫలితం అంచనా వేయలేం..