షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా జీతం అన్ని కోట్లా..? ఏడాదికి ఎంత సంపాదిస్తుందో వింటే షాక్ అవుతారు..?
సినిమా స్టార్లు.. బిజినెస్ సెలబ్రిటీలు.. ఇలా కోట్లలో సంపాదన ఉన్నవారికి.. అసిస్టెంట్లు.. మేనేజర్లు కామన్. అయితే వారు కూడా ఒక్కోసారి సోషల్ మీడియాలో వైరల్ న్యూస్ అవుతుంటారు. ఈసారి బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ మేనేజన్ పూజాకూడా వార్తల్లో నిలుస్తోంది. ఏవిషయంలో అంటే..?
సాధారణంగా సినిమా సెబ్రిటీస్ కు.. బిజినెస్ స్టార్లకి కూడా మేనేజర్స్ ఉండడం సర్వసాధారణం ఇలా మేనేజర్ సెలబ్రిటీలకు సినిమా అవకాశాలు తీసుకురావడం నుంచి మొదలుకొని వారి బ్యాంకింగ్ అలాగే రెమ్యూనరేషన్ వంటి విషయాల గురించి కూడా అన్ని వ్యవహారాలను వాళ్లే చూసుకుంటుంటారు. వాళ్ళు చేసే పనిని బట్టే.. సెలబ్రిటీల ఇమేజ్ కాని.. అవకాశాలు కాని.. ఒక్కోసారి హిట్లు కూడా ఆధారపడి ఉంటాయి.
Pooja Dadlani
ప్రతి ఒక్క సెలబ్రిటీకి కూడా మేనేజర్లు ఉంటారు. వారు సినిమా వ్యవహారాల కాదు.. ఇంట్లో మనిషిలా కలిసిపోతుంటారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి సైతం పూజ దద్లాని మేనేజర్ గా ఉన్నారు. ఆమె షారుఖ్ ఇంట్లో మనిషిలా కలిసి పోతుంది. ఇక షారుఖ్ కు సబందించిన విషయాలన్నీ ఆమె చూసుకుంటుంది. ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా కలిసిపోయి ఉంటుంది.
పూజా దాదాపు 10ఏళ్లకు పైగా షారుఖ్ మేనేజర్ గా వ్యవహరిస్తోంది. 2012 లో పూజా షారుఖ్ మేనేజర్ గా జాయిన్ అయ్యింది. ఆమె ఇన్నేళ్ళుగా ఎంతో నమ్మకంగా మేనేజర్ గా వ్యవహరించడమే కాకుండా తన ఫ్యామిలీ ఫ్రెండ్ లా మారిపోయారు. ఈమె షారుఖ్ ఖాన్ కి మాత్రమే కాకుండా గౌరీ ఖాన్ కి కూడా చాలా ఆప్త మిత్రురాలు. గౌరీ ఖాన్ కు సబంధిచిన వ్వవహారాలు కూడా ఆమె చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.
షారుఖ్ ఖాన్ భార్య గౌరీఖాన్ ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేస్తుంది.. ఆమె చాలా మంది సెలబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్ డిజైనర్ గా పనిచేశారు. పూజా ఆ విషయంలో కూడా గౌరీ ఖాన్ కు అందగా ఉంటుంది. అయితే ఇప్పుడు విషయం ఏంటీ అంటే.. పూజా షారుఖ్ మేనేజర్ గా ఇన్ని పనులు చక్కబెడుతుంది కదా.. మరి ఆమె జీతం ఎంత..?
పూజ షారుఖ్ దగ్గర పనిచేస్తుననందుకు ఏడాదికి సుమారు 10 కోట్ల వరకూ తీసుకుంటుందట. ఒక మేనేజర్ ఏడాదికి తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు స్టార్ హీరోయిన్స్ కూడా ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకోలేదు. షారుఖ్ ఖాన్ మేనేజర్ మాత్రం ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అంటే ఆ కుటుంబానికి ఆమె ఎంత ప్రత్యేకమో తెలుస్తోంది.
అంతే కాదు రెమ్యూనరేషన్ తో పాటు.. షారుఖ్ బోనస్ లు.. ఇతర పేమెంట్లు కలిని ఇంకా ఎక్కువగానే ముడుతున్నాయట పూజాకు. ఈ లెక్కన ఆమె నెలకు కోటికి దగ్గరగా పేమెంట్ తీసుకుంటున్నట్టు బయట ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియదు కాని.. పూజా మాత్రం షారుక్ ఫ్యామిలీకి అన్ని రకాల వ్యవహారాలు చూసుకుంటుంది అని సమాచారం. అంతే కాదు ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన సమయంలో కూడా ఆయన బెయిల్ కి సంబంధించిన వ్యవహారాలన్నింటిని కూడా పూజ దగ్గరుండి చూసుకుంది.
ఇక పూజ (Pooja Dadlani) షారుక్ ఖాన్ తో మాత్రమే కాకుండా గౌరీ ఖాన్ అలాగే వీరి ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా చాలా క్లోజ్ గా ఉంటారు. ఈమె మేనేజర్ గా మాత్రమే కాకుండా షారుఖ్ ఖాన్ కి సంబంధించినటువంటి బిజినెస్ లను అలాగే ఆయన రెడ్ చిల్లీస్ బ్యానర్ వ్యవహారాలన్నింటిని కూడా ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇలా ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నటువంటి ఈమె కష్టానికి తగ్గ ఫలితాన్ని రెమ్యూనరేషన్ రూపంలో షారుక్ అందిస్తున్నారు.