నాగార్జున హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించిన షారుఖ్ ఖాన్..? చివరికి ఏమయ్యిందంటే..?
టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోయిన్ తో.. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఎఫైర్ నడిపించాడా.. ఈ విషయం తెలిసి షారుఖ్ భార్య గౌరీ ఖాన్ ఏం చేసింది. చివరికి జరిగిందేమిటి..?
టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున టాలీవుడ్ హీరోయిన్లతో పాటు.. బాలీవుడ్ బ్యూటీస్ తో కూడా సినిమాలు చేశారు రోమాన్స్ చేశారు. జూహీచావ్లా, టబు, ఊర్మిళ, మనీషా కోయిరాలా, శ్రీదేవి తో పాటు.. సోనాలి బింద్రే, వరకూ.. చాలా మంది హీరోయిన్లు నాగ్ అందానికి ఫిదా అయిన వాళ్ళే. టాలీవుడ్ లో బిజీగా ఉండటం వల్ల బాలీవుడ్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు కింగ్.
అయితే నాగార్జున నటంచిన హిందీ హీరోయిన్లలో ఒక హీరోయిన్ తో ప్రేమాయణం నడిపించాడట బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఇక నాగార్జున జోడీగా జూహీచావ్లా కొన్ని సినిమాల్లో నటించింది. నాగ్ బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న టైమ్ లో ఎంట్రీ ఇచ్చిన టైంలో అక్కడ కింగ్ షారుక్‌ఖాన్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు.
అయితే షారుక్ ఖాన్ అదే టైమ్ లో జూహీచావ్లాను వెంట పడ్డాడట. ఆమెను లైన్ లో పెట్టాడట. మెరుపుతీగలాగా ఉన్న జూహీతో ప్రేమాయణం నడింపించాడట బాద్ షా. నార్త్ నుంచి సౌత్ వరకు జూహీకి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందేట. అంతే కాదు జుహీ తో కలిసి షారుఖ్ వరుసగా సినిమాలు కూడా చేశారట.
సినిమా సినిమాకు వీరి బంధం బలపడి.. ఆ టైంలోనే వీరిద్దరి మధ్య ఘాటుగా ఎఫైర్ కొనసాగిందని అంటారు. అయితే అప్పటికే షారుఖ్ పెళ్ళి కూడా అయిపోవడం.. ఆయన భార్య గౌరీ వీరిని ఎప్పటికప్పుడు వీరిద్దరిపై ఓ కన్ను వేసి ఉంచేదట. పీక్ స్టేజ్ లో షారుక్‌ను గట్టిగా కంట్రోల్ చేసిందట.
దాంతో ఈ ప్రేమ జంట తమ బంధాన్ని బ్రేక్ చేయక తప్పలేదట. గౌరీ ఖాన్ కు భయపడి జూహీ తప్పనిసరి పరిస్థితుల్లో షారుక్‌కు దూరమైందట. అయితే ఇప్పటకీ వీరి మధ్య స్నేహం కొనసాగుతూనే ఉంది. అయితే మరో రూమర్ కూడా ఉంది. వీరిద్దరు సీక్రేట్ గా తమ ప్రేమను కొనసాగించారని పుకార్లు కూడా ఉన్నాయి.
ఇప్పటికీ షారుక్ కుసపోర్ట్ గా ఉంటుంది జూహ్లీ. ఆ మధ్య షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నప్పుడు జూహీయే షారుక్ ఫ్యామిలీకి ధైర్యం చెప్పడంతో పాటు ఆర్యన్‌కు బెయిల్ వచ్చేలా ప్రయత్నాలు కూడా చేసిందని వినికిడి. ఇక ఆర్యన్ 24వ పుట్టిన రోజు కూడా తాను 24 మొక్కలు నాటుతానని సర్ ప్రైజ్ ఇచ్చింది జూహ్లీ చావ్లా.