- Home
- Entertainment
- ఇష్టమైన ఇంటిని ఖాళీ చేసి, అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, మన్నత్ ను కింగ్ ఖాన్ ఎందుకు వదిలేశాడు.
ఇష్టమైన ఇంటిని ఖాళీ చేసి, అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, మన్నత్ ను కింగ్ ఖాన్ ఎందుకు వదిలేశాడు.
షారుఖ్ ఖాన్ ప్రాణంగా చూసుకునే ఇంటిని ఖాళీ చేశాడు, నాలుగంతస్తుల మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన ఇంటిని షారుఖ్ ఖాన్ ఎందుకు వదిలేశారు?
- FB
- TW
- Linkdin
Follow Us
)
షారుఖ్ ఖాన్, ఆయన కుటుంబం పాలి హిల్ కు మకాం మారుస్తున్నారు. నిర్మాత వాసు భగ్నాని నిర్మించిన ఒక అద్భుతమైన నివాసంలో నాలుగు అంతస్తులను నటుడు అద్దెకు తీసుకున్నారు. SRK సంవత్సరానికి రూ. 2.90 కోట్లు అద్దె చెల్లించనున్నారు. ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్స్ పూజా కాసా భవనంలో ఉన్నాయి.
Also Read: ప్రభాస్ పేరుతో ఒక ఊరు ఉందని మీకు తెలుసా? ఇంతకీ ఆ ఊరు ఎక్కడుంది?
మన్నత్ రూపురేఖలు మారుస్తుండటంతో, SRK టెర్రేస్ పై కనిపించే ప్రత్యేకమైన రూపాన్ని చూడలేకపోతున్నామని అభిమానులు బాధపడుతున్నారు. అవును, మీరు సరిగ్గానే చదివారు. ఖాన్స్ పాలి హిల్ లోని విలాసవంతమైన డ్యూప్లెక్స్ ఇంటికి షారుఖ్ ఖాన్ ఫ్యామిలీతో షిప్ట్ అవుతున్నారు. మన్నత్ ఇంటిని బాగు చేయించబోతున్నారట. మే నెలలో ఈ పనులు స్టార్ట్అవుతాయి. అయితే దాదాపు రెండేళ్ళు ఈ పనులు కొనసాగనున్నట్టు తెలుస్తోంది.
Also Read: రీ ఎంట్రీ ఇచ్చిన రోజా, మరి జబర్దస్త్ ఎంట్రీ ఎప్పుడంటే?
మన్నతో ఇంటిని రీ మోడలింగ్ చేసే పనుల్లో భాగంగా మరో రెండు అంతస్తులు కట్టబోతున్నారట. షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ ఇంటీరియర్ డిజైనర్ కావగంతో తన ఇంటికి కావల్సిన ప్లాన్ ఆమె ముందు సిద్దం చేసుకున్నారట. ఇక నవంబర్ 2024లో మహారాష్ట్ర కోస్టల్ జోన్ మేనేజ్‌మెంట్ అథారిటీ నుండి ఈ నిర్మాణం కోసం క్లియరెన్స్ కూడా అప్లే చేశారని తెలుస్తోంది.
Also Read: 7 ఏళ్ల తర్వాత 700 కోట్ల సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోన్న స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా?
మన్నత్ రూపురేఖలు మారుస్తుండటంతో, SRK టెర్రేస్ పై ఒక గతంల్ ఉన్న ఓ ప్రత్యేక గదిని తీసివేయబోతున్నారు. అయితే ఈ విషయంలో ఆయన ఫ్యాన్స బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రత్యేకమైన టెర్రస్ పైకి వచ్చి షారుఖ్ ఖాన్ అప్పుడప్పుడు తన ఫ్యాన్స్ ను కలుస్తుంటారు. ఆ నిర్మాణం కూల్చేస్తే.. అభిమానులు షారుఖ్ ను చూడటం కుదరదు కదా. అందుకే వారు ఫీల్ అవుతున్నారు.
Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
ఇక షారుఖ్ ఖాన్ తను అద్దెకు తీసుకున్న ఇంటికి నెలకు రూ. 24.15 లక్షలు చెల్లిస్తారని సమాచారం. మొత్తంగా ఏడాదికి 3 కోట్ల వరకూ రెంట్ ను ఆయన పే చేయబోతున్నారట. లీజు ఒప్పందాలు 36 నెలలు (మూడు సంవత్సరాలు) ఉంటాయి. ఫ్లాట్లలో ఒకటి నేరుగా జాకీ భగ్నాని నుండి లీజుకు తీసుకోబడింది, మరొకటి జాకీ, దీప్షికా దేశ్ ముఖ్ నుంచి తీసుకున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా షారుక్ సినిమాల సంగతి చూసుకుంటే.. SRK 2023లో వరుసగా మూడు విజయాలతో రికార్డు బ్రేక్ చేశాడు. ఇక 2024లో సైలెంట్ అయిపోయిన షారుఖ్ ఖాన్.. ప్రస్తుతం 'కింగ్' షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడు.