రోజా రీ ఎంట్రీ ప్రోమో వచ్చేసింది, జబర్దస్త్ లోకి మాత్రం నో ఎంట్రీ, నిజమెంత?
ముందు నుంచి అనుకున్నదే జరిగింది. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన రోజా.. ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇస్తుందని చాలా కాలంగా వస్తున్న వార్తలు నిజం అయ్యాయి. తాజాగా రోజా బుల్లితెరపైకి మళ్లీ వచ్చింది. ఇంతకీ రోజా చేస్తున్న ప్రోగ్రామ్ ఏంటి, జబర్థస్త్ లోకి ఎప్పుడు రీ ఎంట్రీ?

వైసీపీ దారుణంగా ఓడిపోవడంతో... నటి, పొలిటీషియన్ రోజా పరిస్థితి దారుణంగా తయారయ్యింది. ప్రస్తుతం మాజీ మంత్రిగా ఉన్న రోజా.. గతంలో మంత్రి పదవి వచ్చిన తరువాత తాను చేస్తున్న టీవిషోష్ కు రూల్స్ ప్రకారం గుడ్ బై చెప్పాల్సి వచ్చింది.
ఇక ఇప్పుడు మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కూడా కావడంతో రోజా పొలిటికల్ గా జాబ్ లెస్ అయ్యారు. కేవలం పార్టీ పదవులు మాత్రమే ఉండటంతో ఇప్పుడు మళ్లీ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. గత ఆరేడు నెలలుగా ఆమె అదే ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ప్రభాస్ తమ్ముడు హీరోగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా? ఇండస్ట్రీలో ఎందుకు సక్సెస్ అవ్వలేదు?
కాని మంత్రిగా ఉన్న టైమ్ లో ఇటు మెగా ఫ్యామిలీని, అటు తమిళంలో రజినీకాంత్ ను ఘాటుగా విమర్శించడంతో రోజాకు అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రాలేదట. ఇక అలా ప్రయత్నం చేయగా చేయగా.. ఎట్టకేలకు తెలుగులో రోజా బుల్లితెరపై రీ ఎంట్రీకి సిద్దం అయ్యింది. రీసెంట్ గా రోజా జడ్జిగా ఒక షో స్టార్ట్ కాబోతోంది. దానికి సబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జీ తెలుగులో త్వరలో స్టార్ట్ కాబోతోన్న ఓ షోలో ఆమె మెరిసింది. ఆ షో మరేదో కాదు జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్4.
తాజగా రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ షోకి సంబంధించి ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో రోజా సందడి చేసింది. రోజాతో పాటు శ్రీకాంత్, రాశి ఈ షోలో జడ్జీలుగా కనిపించారు. ఈ షో మార్చ్ 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. షోకి రవి, అషురెడ్డి యాంకర్స్ గా చేయనున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకూ రోజా ఇలా బుల్లితెరపై సందడి చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అంటే దాదాపు మరో నాలుగేళ్లు బిజీగా ఉండటానికి రోజా టీవీ షోలలోకి ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే జబర్థస్త్ లోకి కూడా ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది చూడాలి. ఒక వేళ జబర్థస్త్ లో కూడా ఆమె ఎంట్రీ ఉండి ఉంటే.. ఇప్పటి ముందే వెళ్ళి ఉండాల్సింది కదా.? మరి జీ తెలుగులో ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటి అనేది నెటిజన్లు అనుమానం. అంతే కాదు ఎలక్షన్స్ టైమ్ లో కొంత మంది జబర్థస్త్ కమెడియన్లు రోజాపై చేసిన కామెంట్స్ తెలిసినవే.
Roja
కొంత మంది జనసేన, మరికొంత మంది తెలుగుదేశం తరపున ప్రచారం చేస్తూ.. రోజాను నోటికి వచ్చినట్టు మాట్లాడారు. ఈక్రమంలో జబర్థస్త్ లోకి రోజామళ్ళీ వెళ్లే అవకాశాలు లేవనే చెప్పాలి. ఒక వేళ వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇక ఎప్పుడు మైక్ కనిపించినా.. పూనకం వచ్చినట్టు ఊగిపోయే రోజా ఇప్పుడు పెద్దగా కనిపించడంలేదు.
Roja
ఈ ప్రభుత్వాన్ని తిట్టాలి అనుకున్నప్పుడు చెన్నైలో ఉండి ఓ వీడియో ను రికార్డ్ చేసి మీడియాకు పంపించడం తప్ప.. ప్రత్యక్ష్యంగా వచ్చి ఏపీలో కనిపించడంలేదని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో బిజీ అయితే రోజా ఇక హైదరాబాద్ లోనే ఉండే అవకాశం ఉంది. జగన్ నిర్వహించే సమావేశాలు ధర్నాలు లాంటి కార్యక్రమాలకు కూడా ఆమె పెద్దగా రావడంలేదని తెలుస్తోంది.