- Home
- Entertainment
- Dunki Collections : సలారోడి దెబ్బ.. ఐదు రోజుల్లో ‘డంకీ’కి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసా?
Dunki Collections : సలారోడి దెబ్బ.. ఐదు రోజుల్లో ‘డంకీ’కి ఎంత కలెక్షన్ వచ్చిందో తెలుసా?
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ Dunki కలెక్షన్లపై అధికారిక లెక్కలు అందాయి. ఐదురోజుల్లో వసూళ్ల వివరాలు చూస్తే ‘సలార్’ ప్రభావం గట్టిగానే పడిందని అర్థమవుతోంది. లేటెస్ట్ లెక్కలు ఎలా ఉన్నాయంటే..

బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ - స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) కాంబోలో వచ్చిన చిత్రం ‘డంకీ’ (Dunki). ఈ సినిమా డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైంది.
అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటించిన సలార్ Salaar Cease Fire కూడా ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఏ సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయనే ఆసక్తి అందరిలో నెలకొంది.
ఓవైపు సలార్ టీమ్ ఎప్పటికప్పుడు వసూళ్ల లెక్కలను ప్రకటిస్తున్నారు. ఇటు షారుఖ్ ఖాన్ Shah Rukh Khan డంకీ కలెక్షన్స్ డిటేయిల్స్ కూడా వస్తున్నాయి. తాజాగా ఐదు రోజులకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా ఎంత కలెక్ట్ చేసిందో ప్రకటించారు.
Dunki Collections ఐదు రోజుల్లో రూ.256.40 కోట్లు సాధించినట్టు తెలిపారు. అయితే తొలిరోజే ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడం.. సినిమా బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో లేదనే రివ్యూలు వచ్చాయి.
అదే సమయంలో ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో వచ్చిన Salaar బ్లాక్ బాస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. డైనోసార్ రచ్చకు థియేటర్ల వద్ద సందడి మొదలైంది. దీంతో ఆడియెన్స్ ఫస్ట్ ప్రియారిటీ సలార్ కే కనిపిస్తోంది. ఈక్రమంలో సలార్ ఎఫెక్ట్ డంకీపై పండిందని పలువురు నిపుణులు చర్చించుకుంటున్నారు.
ఇక మూడు రోజుల్లోనే Salaar Collections రూ.402 కోట్లు కావడం విశేషం. ప్రస్తుతం రెండు చిత్రాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నాయి. సలార్ మాత్రం దుమ్ములేపుతోంది. మున్ముందు ‘డంకీ’ కలెక్షన్స్ ఇంకెలా ఉంటాయో చూడాలంటున్నారు.