పవిత్ర జయరాం మా లైఫ్‌లోకి రావడంతోనే గొడవలు.. సీరియల్ నటుడు చందు భార్య కన్నీరు మున్నీరు.. ఎఫైర్ ఎప్పట్నుంచంటే?
`త్రినయని` సీరియల్ నటుడు చందు ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. చందు భార్య ఆయన మరణం పట్ల కన్నీరు మున్నీరైంది. పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది.
`త్రినయని` నటుడు చందు(చంద్రకాంత్) శుక్రవారం తన ఫ్లాట్‌లో ఆత్మహత్యకి పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో బుల్లితెరలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చందు ఆత్మహత్యకి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తుంది. పవిత్రా జయరాంతో ఆయన చాలా రోజులుగా రిలేషన్‌షిప్‌లో ఉంటున్నాడని, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆమె ఇటీవల రోడ్డు ప్రమాదంలో కన్నుమూయడంతో అది తట్టుకోలేక చందు ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో తాజాగా చందు భార్య శిల్ప దీనిపై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చందుమరణాన్ని తట్టుకోలేకపోతుంది. కన్నీరుమున్నీరవుతుంది. ఈ సందర్భంగా ఆమె భర్త మరణంపై స్పందిస్తూ పవిత్ర జయరాం తమ జీవితంలోకి ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడే తమ మధ్య గ్యాప్ వచ్చిందని, గొడవలు ప్రారంభమయ్యాయని, అతను తనకు దూరంగా ఉంటున్నాడని తెలిపింది. తమది ప్రేమ వివాహం అని, దాదాపు 11ఏళ్లు ప్రేమించి పెళ్లిచేసుకున్నామని తెలిపింది. పదకొండేళ్లు కలిసి ఉన్నామని, ఆ తర్వాత తమ పేరెంట్స్ ని, అన్నయ్యని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నట్టు తెలిపింది.
వీరికి 2015లో మ్యారేజ్ అయ్యింది. ఎనిమిదేళ్ల కూతురు, నాలుగేళ్ల కొడుకున్నాడు. ప్రేమించినప్పట్నుంచి చందు తనకే అంకితమై ఉన్నాడని, ఎప్పుడు నాన్న, కన్నా అని పిలిచేవాడని తెలిపింది. తనే లోకంగా ఉండేవాడట. షూటింగ్‌లకు వెళ్లి వచ్చేసమయంలోనూ మినిట్ టూ మినిట్ అప్‌డేట్ ఇచ్చేవాడని తెలిపింది. తనని తప్ప మరెవ్వరిని పట్టించుకునేవాడు కాదని తెలిపింది. అలాంటిది లాక్ డౌన్ సమయంలో ఆయనలో చాలా మార్పు వచ్చింది. బెంగుళూరు జరిగే విషయాలను తనకు ఎప్పటికప్పుడు చెబుతుండేవాడు. అక్కడ వాతావరణం ఇలా ఉందట, ఆర్టిస్ట్ లు లేట్ అవుతున్నారట, ఇలా ప్రతి విషయాన్ని చెబుతుండేవాడు. ఆయన ఫ్రెండ్స్ ద్వారా ఈ సమాచారం వస్తుందేమో అనుకున్నట్టు చెప్పింది శిల్ప.
Pavithra Jayaram
అయితే కొన్ని రోజులకు సడెన్‌గాతనలో మార్పు వచ్చిందట. తనవైపే చూడటం లేదు, తనని చీదరించుకుంటున్నాడని తెలిపింది. ఈ క్రమంలోనే పవిత్ర జయరాంతో రిలేషన్‌లో ఉన్నట్టు తెలిసిందని వెల్లడించింది. ఈ విషయం ఆయన చెప్పినప్పుడు ఇక్కడ సంతోషం లేదు కదా, అక్కడైనా సంతోషంగా, ఆరోగ్యంగా ఉండమని చెప్పిందట. ఇలా ఇద్దరు దూరంగా ఉంటున్నారట. దాదాపు నాలుగేళ్లుగా మాట్లాడుకోవడం లేదు. ఏదైనా చెప్పాలనుకుంటే పిల్లలతో చెప్పేవారు, నేను పిల్లలకే చెప్పేదాన్ని అని వెల్లడించింది.
పవిత్ర చనిపోయిన తర్వాత తన వద్దకు చందు వచ్చాడని, ఈ విషయాన్ని పిల్లలతో చెప్పాడని తెలిపింది చందు భార్య శిల్ప. పవిత్ర చనిపోయాక నువ్వు ధైర్యంగా ఉండు, జరిగిందేదో జరిగింది, పిల్లల కోసం ఉండు అని చెప్పిందట. దానికి ఆయన నేను చనిపోను, ధైర్యంగా ఉంటాను. పిరికి వాడిని కాదు, పిల్లలను చూసుకోవాలి కదా అని చెప్పాడట. కానీ ఆ మాట చెప్పిన 24 గంటల్లోనే ఈ ఆయన మరణం వార్త వినాల్సి వచ్చిందనీ కన్నీరు మున్నీరైంది చందు భార్య.
పవిత్ర జయరాం మరణం తర్వాత ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడట. బాగా తాగి రోడ్డుమీద పడిపోతే ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లారట. ఫ్రెండ్ వాళ్ల ఇంటికి వెళ్లి చూసి వచ్చాను, పోనిలే బతికే ఉన్నాడుగా అనుకుందట. నెక్ట్స్ డే మార్నింగ్ తనకు కాల్ వచ్చిందట. అక్క అన్న బయటకు వెళ్లిపోయాడు అని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నాడని ఆరా తీస్తే పవిత్ర జయరాం పిల్లలకు సంబంధించిన ఇన్స్ రెన్స్ చేయించడం కోసం వెళ్లాడని చెప్పాడట.
ఆ తర్వాత మళ్లీ అప్‌డేట్ కోసం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, బందువులు చేసినా తీయలేదు, ఇండస్ట్రీ వాళ్లతో చేసినా తీయలేదు. దీంతో చాలా భయమేసింది. ఏడుగంటల సమయంలోనే ఇది జరిగి ఉంటుందని చెబుతూ కన్నీరుమున్నీరయ్యింది చందు భార్య. ఎన్టీవీతో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించింది.