MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రోజూ టార్చర్ నేను భరించలేను, వాడు మోసం చేశాడు... సిల్క్ స్మిత చనిపోయే ముందు లెటర్ లో ఏం రాసింది!

రోజూ టార్చర్ నేను భరించలేను, వాడు మోసం చేశాడు... సిల్క్ స్మిత చనిపోయే ముందు లెటర్ లో ఏం రాసింది!

సిల్క్ స్మిత అకాల మరణం పొందారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నప్పటికీ ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే మరణానికి ముందు ఆమె ఒక లెటర్ రాశారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Apr 30 2023, 06:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Silk Smitha

Silk Smitha

సిల్క్ స్మిత అకాల మరణం పొందారు. ఆమె మృతిపై అనుమానాలు ఉన్నప్పటికీ ఆత్మహత్యగా పోలీసులు తేల్చారు. అయితే మరణానికి ముందు ఆమె ఒక లెటర్ రాశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Silk Smitha

Silk Smitha

సిల్క్ స్మిత 1996 సెప్టెంబర్ 23న తన నివాసంలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించారు. పోలీసులు ఆమె రాసిన ఉత్తరం స్వాధీనం చేసుకున్నారు. సిల్క్ స్మిత ఆ లెటర్ లో సుదీర్ఘంగా తన వేదన వెళ్లగక్కారు. నా ఏడవ ఏట నుండే పొట్టకూటి కోసం కష్టపడుతున్నాను. నాకంటూ ఎవరూ లేరు. ప్రేమించేవారు లేరు. బాబు ఒక్కడే నన్ను అర్థం చేసుకున్నాడు. ఆదరించాడు. మిగతా వాళ్ళందరూ నా సొమ్ము తిన్నారు. నమ్మించి మోసం చేశారు. రాము, రాధాకృష్ణ నాకు చాలా అన్యాయం చేశారు. దేవుడనే వాడు ఉంటే వాళ్ళను చూసుకుంటారు. 
 

37
Silk Smitha

Silk Smitha

ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తాను అన్నాడు. ఇప్పుడు నాకు దూరమయ్యాడు. ప్రతి ఒక్కడూ నా రెక్కలు కష్టం తిన్నవాడే. బాబు తప్ప అందరూ నా సొమ్ము తిన్నారు. రోజూ టార్చర్ అనుభవించాను. ఈ బాధ భరించలేకపోతున్నాను... అంటూ సిల్క్ స్మిత రాసుకొచ్చారు. ఈ లెటర్ లో రాము, రాధాకృష్ణ అనే వ్యక్తుల గురించి ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు. తనకు అన్యాయం చేసినట్లు వెల్లడించారు. 
 

47

అయితే ఆ లెటర్లో ఎక్కడా సిల్క్ స్మిత చనిపోతున్నట్లు రాయలేదు. ఇక రాధాకృష్ణ అనే వ్యక్తి సిల్క్ స్మిత సెక్రటరీ. మరణం అనంతరం పోలీసులు అతన్ని విచారించారు. అయితే ఎవరినీ దోషులుగా తేల్చలేదు. ఆమె లేఖ ఆధారంగా సూసైడ్ అని నిర్ధారించారు. 

57
Superstar Rajinikanth seduced Silk Smitha

Superstar Rajinikanth seduced Silk Smitha

దశాబ్దానికి పైగా సాగిన కెరీర్లో సిల్క్ స్మిత వందల చిత్రాల్లో నటించారు. చిరంజీవి, రజినీకాంత్, మోహన్ లాల్, బాలకృష్ణ... ఇలా టాప్ స్టార్స్ అందరితో జతకట్టారు. కానీ ఆమె అంత్యక్రియలు దారుణంగా జరిగాయి. ఒక అనాధ శవంలా అయిన వారు, పరిశ్రమ ప్రముఖులు ఎవరూ పక్కన లేకుండా సాగనంపారు. ఆమెతో నటించిన హీరోలు కన్నెత్తి చూడలేదు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం జరిగాక సిబ్బంది అంత్యక్రియలు పూర్తి చేశారు. అయితే హీరో అర్జున్ మాత్రం ఆ రోజు సిల్క్ స్మిత భౌతికకాయాన్ని చూసేందుకు వెళ్ళాడట. 
 

67

అర్జున్ తో సిల్క్ స్మిత పలు చిత్రాల్లో నటించారు. మంచి స్నేహితులట. తన ఒంటరితనం, చుట్టూ ఉన్న పరిస్థితుల కారణంగా... నేను చనిపోయితే కనీసం నువ్వైనా చూడటానికి వస్తావా? అని సిల్క్ స్మిత తరచుగా అర్జున్ ని అడుగుతూ ఉండేవారట. ఖచ్చితంగా అని అర్జున్ హామీ ఇచ్చారట. ఇచ్చిన మాట ప్రకారం ఎవరేమనుకున్నా పర్లేదని అర్జున్ సిల్క్ స్మిత భౌతికకాయాన్ని సందర్శించారట.

77


ఈ విషయాన్ని తాజాగా ఓ జర్నలిస్ట్ బయటపెట్టారు.  సిల్క్ స్మిత జీవితం ఆధారంగా డర్టీ పిక్చర్ పేరుతో బయోపిక్ తెరకెక్కించారు. విద్యాబాలన్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది.   
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?
Recommended image2
Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు
Recommended image3
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved