MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?

Varanasi Movie: రాజమౌళి కల చెల్లాచెదురు, వారణాసిలో ఆ సీన్లు లేనట్లే.. జక్కన్న ఎందుకిలా చేశారు ?

రాజమౌళి తెరకెక్కిస్తున్న వారణాసి చిత్రానికి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్. ఈ మూవీలో అత్యంత కీలకమైన షెడ్యూల్ ని రాజమౌళి రద్దు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 27 2026, 08:55 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Varanasi Movie
Image Credit : Asianet News

Varanasi Movie

దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న వారణాసి పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. నిర్మాత కెఎల్ నారాయణ ఈ చిత్రాన్ని 1300 కోట్ల అత్యంత భారీ బడ్జెట్ లో నిర్మిస్తున్నారు. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
యుద్ధ సన్నివేశాలు
Image Credit : Instagram

యుద్ధ సన్నివేశాలు

ఈ మూవీలో చిత్రీకరించడానికి అత్యంత కష్టమైన సన్నివేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రామాయణంలో కుంభకర్ణుడితో జరిగే యుద్ధ సన్నివేశాలు ఉన్నాయి. ఈ సీన్లు సినిమాలో 25 నిమిషాల నిడివితో ఉంటాయని, మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపిస్తాడని రాజమౌళి ఆల్రెడీ ప్రకటించారు. వీటిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా ఉంటాయి కాబట్టి గ్రీన్ మ్యాట్ లో షూట్ చేసి షూటింగ్ పూర్తి చేయవచ్చు.

35
కీలకమైన అంటార్కిటికా షెడ్యూల్ రద్దు
Image Credit : SS Rajamouli/ Instagram, T-Series/ Youtube

కీలకమైన అంటార్కిటికా షెడ్యూల్ రద్దు

అదే విధంగా ఈ చిత్రంలో అంటార్కిటికా సన్నివేశాలు కూడా అత్యంత కీలకం. వారణాసి గ్లింప్స్ లో కూడా అంటార్కిటికా సన్నివేశాలు చూపించారు. ఆ సన్నివేశాలని రాజమౌళి అక్కడే అంటార్కిటికాలో రియలిస్టిక్ గా అద్భుతమైన విజువల్స్ తో చిత్రీకరించాలి అని కలగన్నారు. ఇప్పుడు ఆ కల చిన్నాభిన్నం అయినట్లు తెలుస్తోంది.

45
అందువల్లే వెనక్కి తగ్గిన రాజమౌళి
Image Credit : youtube/varanasi movie

అందువల్లే వెనక్కి తగ్గిన రాజమౌళి

అంటార్కిటికాలో షూటింగ్ చేయడం అంటే ఆషామాషీ విషయం కాదు. అక్కడి కఠిన పరిస్థితులని తట్టుకోవాలి. చిత్ర యూనిట్ సేఫ్టీ చాలా ముఖ్యం. రాజమౌళి తలుచుకుంటే ఎంతటి కష్టమైన వదిలిపెట్టరు. కానీ అంటార్కిటికా లో షూటింగ్ కి పరిస్థితులు అనుకూలించడం లేదు అని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికీ ఈ షెడ్యూల్ ని పలుమార్లు వాయిదా వేశారు. ఇక అక్కడ షూటింగ్ చేయడం కుదరదు అని నిర్మించుకున్న తర్వాత అంటార్కిటికా షెడ్యూల్ ని జక్కన్న రద్దు చేసినట్లు తెలుస్తోంది. అంటార్కిటికాలో షెడ్యూల్ కోసం మహేష్ బాబు ప్రత్యేక ట్రైనింగ్ కూడా తీసుకుని సిద్ధమయ్యారు. మహేష్ తీసుకున్న ట్రైనింగ్ కూడా ఇప్పుడు వృధానే.

55
రాజమౌళి ప్లాన్ బి
Image Credit : Asianet News

రాజమౌళి ప్లాన్ బి

దీనితో రాజమౌళి ప్లాన్ బి అప్లై చేసినట్లు తెలుస్తోంది. అంటార్కిటికా సన్నివేశాలు మొత్తం గ్రీన్ మ్యాట్ లో చిత్రీకరించాలని రాజమౌళి డిసైడ్ అయ్యారు. గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ సహాయంతో అంటార్కిటికా సన్నివేశాలని అద్భుతంగా చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. కానీ అంటార్కిటికా రియల్ లొకేషన్స్ సన్నివేశాల్ని మాత్రం చూడడం సాధ్యం కాదు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
మహేష్ బాబు ఘట్టమనేని
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Recommended image2
Allu Arjun: ఎన్టీఆర్, కృష్ణ, కృష్ణంరాజు ముగ్గురి వల్లా కాలేదు..భార్య సాయం తీసుకుని చించిపడేసిన అల్లు అర్జున్
Recommended image3
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Related Stories
Recommended image1
Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి
Recommended image2
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved