MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని

Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని

సునీల్ ఆ పని చేయడం వల్లే అతడి కెరీర్ గందరగోళంగా మారింది అంటూ ఓ అభిమాని సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమాని చేసిన వ్యాఖ్యలకు సునీల్ స్పందించారు. ఆ వివరాలు ఈ కథనంలో ఉన్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 27 2026, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కమెడియన్ గా సునీల్ క్రేజ్
Image Credit : Asianet News

కమెడియన్ గా సునీల్ క్రేజ్

బ్రహ్మానందం, అలీ లాంటి స్టార్ కమెడియన్ల హవా సాగుతున్న రోజుల్లో సునీల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. తక్కువ టైంలోనే తన వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్, అదిరిపోయే కామెడీ పంచ్ లతో క్రేజీ కమెడియన్ గా ఎదిగారు. ఇక బ్రహ్మానందం, అలీ లాంటి టాప్ కమెడియన్స్ పని అయిపొయింది.. సునీల్ ఢి హవా అనుకుంటున్న రోజుల్లో అతడు హీరోగా సినిమాలు మొదలుపెట్టాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హీరోగా మారిన సునీల్
Image Credit : Facebook/@sunil

హీరోగా మారిన సునీల్

ఒక దశలో సునీల్ కామెడీ రోల్స్ పూర్తిగా పక్కన పెట్టేసి హీరో పాత్రలకు పరిమితం అయ్యాడు. సునీల్ కెరీర్ లో జరిగిన పెద్ద మిస్టేక్ ఇదే. సునీల్ కమెడియన్ గా గ్యాప్ ఇవ్వడంతో వెన్నెల కిషోర్ లాంటి వారికి సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత హీరోగా ఫ్లాపులు ఎదురు కావడంతో సునీల్ తిరిగి కామెడీ రోల్స్ కి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం సునీల్ కామెడీ పాత్రలకు, క్యారెక్టర్ రోల్స్ కి మధ్య ఊగిసలాడుతున్నాడు. కమెడియన్ గా గతంలో ఉన్న క్రేజ్ సునీల్ కి లేదు అనే చెప్పాలి.

35
డైరెక్ట్ గా తిట్టేసిన అభిమాని
Image Credit : Facebook/@sunil

డైరెక్ట్ గా తిట్టేసిన అభిమాని

సునీల్ కామెడీని వదిలేయడంపై అతడి అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు. ఓ కార్యక్రమంలో సునీల్ మాట్లాడుతూ నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల అభిమానులు డైరెక్ట్ గా తిట్టారు అని గుర్తు చేసుకున్నారు. ఓ అభిమాని ఫేస్ బుక్ లో మెసేజ్ పెడుతూ.. సునీల్ అన్నా ఎవ్వరికీ లేని కామెడీ టైమింగ్ మీ దగ్గర ఉంది. దాని కోసం మేము థియేటర్ కి వస్తున్నాం. కానీ మీరు కూడా అందరిలాగా స్టైల్ గా జాకెట్స్ వేసుకుని, గాగుల్స్ పెట్టుకుని, సిక్స్ ప్యాక్ తో కనిపిస్తే ఇక కామెడీ కోసం మేము ఎక్కడికి వెళ్ళాలి అని తిట్టేశాడు.

45
సునీల్ స్థానాన్ని ఆక్రమించిన కమెడియన్లు
Image Credit : Facebook/@sunil

సునీల్ స్థానాన్ని ఆక్రమించిన కమెడియన్లు

అతడు నన్ను తిట్టినప్పటికీ చెప్పింది నిజమే కదా అని నాకు అనిపించింది అంటూ సునీల్ తెలిపారు. సప్తగిరి లాంటి వాళ్ళు కామెడీ చేస్తుంటే ఎలా ఇంప్రవైజ్ చేయాలో వెళ్లి నేను సలహాలు ఇచ్చేవాడిని. ఎందుకంటే కామెడీలో నాకు గ్రిప్ ఉంది. మనకి ఎందులో నైపుణ్యం ఉందో ఆ పని చేస్తే ఇక తిరుగు ఉండదు అని సునీల్ అన్నారు. సునీల్ రియలైజ్ అయినప్పటికీ చాలా లేట్ అయిపొయింది అని అభిమానులు అంటున్నారు. సునీల్ ప్లేస్ ని వెన్నెల, కమెడియన్ సత్య లాంటి వాళ్ళు కబ్జా చేసేశారు అని అభిమానులు అంటున్నారు.

55
కోట అప్పుడే చెప్పారు
Image Credit : Facebook/@sunil

కోట అప్పుడే చెప్పారు

సునీల్ కి ఈ అడ్వైజ్ కోట శ్రీనివాస రావు ఎప్పుడూ ఇచ్చారు అని కూడా అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ లు చేయడానికి, యాక్షన్ సీన్స్ చేయడానికి టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ఉన్నారు. కానీ సునీల్ లాగా కామెడీ చేసే వాళ్ళు లేరు. కాబట్టి సునీల్ హాస్యం ప్రధానంగా ఉండే సినిమాల్లో హీరోగా చేయాలి, హాస్యాన్ని వదిలిపెట్టకూడదు అని కోట సలహా ఇచ్చారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ram Charan Movie: నోటి దురుసు ఎక్కువ, రాంచరణ్ మూవీ షూటింగ్ లో తాగేసి పడిపోయాడు.. వార్నింగ్ ఇచ్చినా వినలేదు
Recommended image2
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ నెస్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image3
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Anushka Shetty: కేవలం గ్లామర్, పాటల కోసమే నిన్ను తీసుకుంటున్నాం..అనుష్క శెట్టికి మైండ్ బ్లాక్ చేసిన రాజమౌళి
Recommended image2
Trisha: గోవాలో సతీమణులతో సందడి చేసిన టాలీవుడ్ స్టార్స్, ఒంటరిగా త్రిష..వైరల్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved