MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు

Sobhita Dhulipala: నాగచైతన్యకు సమంతనే సరైన జోడి..? శోభిత ధూళిపాళ కు షాక్, మండిపడుతున్న నెటిజన్లు

నాగచైతన్య - సమంత విడాకులు తీసుకుని నాలుగేళ్లు పైనే అవుతోంది. ఇద్దరు మళ్లీ విడివిడిగా పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కానీ ఇప్పటికీ వీరి బంధంపై సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. తాజాగా శోభితను విమర్శిస్తూ నెటిజన్లు ఏమంటున్నారంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 27 2026, 08:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విడాకుల తరువాత కూడా ఆగని వార్తలు..
Image Credit : Asianet News

విడాకుల తరువాత కూడా ఆగని వార్తలు..

విడాకుల తరువాత కూడా ఏదో ఒక రకంగా వైరల్ అవుతున్నారు నాగచైతన్య, సమంత. ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లాడిన ఈ జంట.. నాలుగేళ్లు కూడా కలిసి కాపురం చేయలేదు. రకరకాల కారణాల వల్ల గొడవలు జరిగి ఇద్దరు విడిపోయి విడాకులు తీసుకున్నారు. వీరి విడాకుల తరువాత ఇద్దరు స్టార్స్ కు సబంధించిన అభిమానులు సోషల్ మీడియాలో ఎంత రచ్చ చేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తర్వాత కొన్నేళ్లకు నాగచైతన్య మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లాడగా.. ఆమరుసటి ఏడాదే సమంత డైరెక్టర్ రాజ్ నిడిమారుని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
శోభిత ధూళిపాళ పై భారీగా ట్రోల్స్
Image Credit : Sobhitad/Instagram

శోభిత ధూళిపాళ పై భారీగా ట్రోల్స్

నాగచైతన్యను పెళ్లాడిన తరువాత శోభితపై భారీగా ట్రోల్స్ చేశారు నెటిజన్లు. సమంత అభిమానులైతే నానా మాటలు అన్నారు. మరో వైపు నాగచైతన్య అభిమానులు కూడా సమంతను రకరకాలుగా విమర్శించారు. చైతూ మంచివాడు.. అతన్ని పోగోట్టుకుని సామ్ తప్పుచేసిందని అన్నారు. సమంత మొండితనంతోనే విడాకుల వరకూ వచ్చిందని విమర్శించారు. ఇక శోభిత నాగచైతన్యకు జోడీ కాదంటూ.. సమంత అభిమానులు కూడా నానా మాటలు అన్నారు. గత నాలుగేళ్లుగా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ శోభిత మాత్రం కామ్ గా తన పనితాను చేసుకుంటుంది. ఒకటి రెండు సార్లు మాత్రం ట్రోలర్స్ కు గట్టిగా కౌంటర్లు ఇచ్చింది.

Related Articles

Related image1
Raj Nidimoru: సమంత భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? రాజ్ నిడిమోరు నిక్ నేమ్ ఏంటంటే?
Related image2
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
35
శోభిత డ్రెస్ పై మండిపడుతున్న నెటిజన్లు..
Image Credit : instagram.com/artistrybuzz

శోభిత డ్రెస్ పై మండిపడుతున్న నెటిజన్లు..

ఇక తాజాగా శోభిత ధూళిపాళ పై మరోసారి ట్రోలింగ్ గట్టిగా స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా నాగచైతన్య, శోభిత కలిసి ఏయిర్ పోర్ట్ లో కనిపించారు. చైతూ హ్యాండ్సమ్ లుక్ లో మెరిసిపోగా.. శోభిత మాత్రం ముందు కవర్ చేస్తూ.. వెనకాల ఓపెన్ గా ఉండే ఫ్యాషన్ డ్రెస్ లో కనిపించింది. ఈవీడియో చూసిన నెటిజన్లు ఆమెపై మండిపడుతున్నారు. ''నీ కన్నా సమంత 100 శాతం నయం'' అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. గతంలో సమంత హాట్ ఫోటో షూట్స్, ఇంటిమేట్ సీన్స్ చేయడం వల్లే.. చైతుతో, అక్కినేని ఫ్యామిలీతో విభేదాలు వచ్చాయని టాక్ నడిచింది. పెళ్లికి మందు శోభిత కూడా అంతకంటే ఎక్కువ హాట్ గా ఫోటో షూట్స్ చేసేది. కానీ పెళ్లి తరువాత ఆమె తను చాలా మార్చుకుంది. కానీ రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్ చూసి... నెటిజన్లు మండిపడుతున్నారు.

45
నెటిజన్లు ఏమని కామెంట్ చేస్తున్నారంటే..
Image Credit : Asianet News

నెటిజన్లు ఏమని కామెంట్ చేస్తున్నారంటే..

ఎయిర్ పోర్ట్ లో శోభితను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. "నాగచైతన్యకు శోభిత కరెక్ట్ కాదు'' అని కొందరు. "మాకు సమంత అంటేనే ఇష్టం " అని మరికొందరు. "సమంత గారు బెటర్ శోబితా కన్నా " అని ఇంకొకరు, "చైతూకి సరైన భార్య దొరకలేదు అని ఇంకొకరు ", "ఇదేం డ్రెస్.. అడుక్కునేవాళ్ల మాదిరిగా " అని మరోకరు.. ఇలా దారుణంగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

55
శోభితపై నాగచైతన్య కామెంట్స్..
Image Credit : Sobitad/Instagram

శోభితపై నాగచైతన్య కామెంట్స్..

పెళ్లి తరువాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సంతోషంగా జీవిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎటు వెళ్లినా.. చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్నారు. అంతే కాదు శోభిత లేకుండా తాను ఒక్క రోజు కూడా ఒంటరిగా ఉండలేకపోతున్నానంటూ.. నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు కూడా. చైతుకి సబంధించిన చాలా విషయాలను శోభిత దగ్గరుండి చూసుకుంటున్నట్టు సమాచారం

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నాగ చైతన్య
సమంత రూత్ ప్రభు
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kota Srinivasarao: కోట అప్పుడే చెప్పారు, వినలేదు.. సునీల్ ని డైరెక్ట్ గా ఏకిపారేసిన అభిమాని
Recommended image2
Baahubali 3: బాహుబలి 3పై అదిరిపోయే అప్‌ డేట్‌.. అనుష్క, రానాతో కలిసి హింట్‌ ఇచ్చిన ప్రభాస్‌
Recommended image3
Heroes Lady Getup: లేడీ గెటప్స్‌లో దుమ్ములేపిన స్టార్ హీరోలు వీళ్లే
Related Stories
Recommended image1
Raj Nidimoru: సమంత భర్తను ముద్దుగా ఏమని పిలుస్తుందో తెలుసా? రాజ్ నిడిమోరు నిక్ నేమ్ ఏంటంటే?
Recommended image2
Samantha : సమంత భర్త రాజ్ మొదటి భార్య ఏం చేస్తుందో తెలుసా? విసిగిపోయి చివరికి ఏం చేసిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved