MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పెళ్లి తర్వాత ఆమె ప్లానింగ్ వేరే, అక్కడే తేడా కొట్టింది.. మొదటి భార్యతో నాగార్జున విడాకులు అందుకే

పెళ్లి తర్వాత ఆమె ప్లానింగ్ వేరే, అక్కడే తేడా కొట్టింది.. మొదటి భార్యతో నాగార్జున విడాకులు అందుకే

కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా రాణిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ కి నాగార్జున ఒక బ్రాండ్ గా మారిపోయారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 01 2024, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

కింగ్ నాగార్జున ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ తెలుగు హోస్ట్ గా రాణిస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ కి నాగార్జున ఒక బ్రాండ్ గా మారిపోయారు. ప్రస్తుతం నాగార్జున ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

నాగార్జున సినిమాల గురించి మాత్రమే కాకుండా ఆయన ఫ్యామిలీ గురించి, వ్యక్తిగత జీవితం గురించి తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంటుంది. నాగార్జున తన మొదటి భార్య లక్ష్మి దగ్గుబాటి నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత అమలని ప్రేమ వివాహం చేసుకున్నారు. 

36

లక్ష్మి దగ్గుబాటి మూవీ మొఘల్ రామానాయుడు కుమార్తె. మొదట నాగార్జునకి ఈ సంబంధం వచ్చింది. అయితే నాగేశ్వర రావు గారికి ఈ సంబంధం అంతగా ఇష్టం లేదట. కానీ కుటుంబ సభ్యులు చాలా మంది ఒకే చెప్పారట. అందరూ ఒకే అంటున్నప్పుడు నేనెందుకు కాదు అనాలి అని నాగేశ్వర రావు కూడా ఒప్పుకున్నట్లు ప్రముఖ రచయిత కానగల జయకుమార్ అన్నారు. 

46

అనేక చిత్రాలకు ఆయన రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. పెళ్ళైన రెండేళ్లు బాగానే ఉన్నారు. లక్ష్మి దగ్గుబాటి అమెరికాలో ఉండడం అంటే ఇష్టం. నాగార్జున షూటింగ్స్ లో బిజీగా ఉంటే ఆమె యుఎస్ వెళ్లేవారు. చిత్ర పరిశ్రమతో సంబంధం మీతోనే అంతం అయిపోవాలని దగ్గుబాటి లక్ష్మి వాళ్ళ తండ్రి రామానాయుడుకి కూడా ఒక సందర్భంలో తెలిపింది. 

56

కానీ సినిమా హీరోనే ఆమె పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. నాగార్జునకి ఇండస్ట్రీలో అప్పుడప్పుడే హిట్లు పడుతున్నాయి. ఆ టైంలో మనకి సినిమాలు వద్దు.. యుఎస్ వెళ్లి ఏదైనా బిజినెస్ చేసుకుందాం అని నాగార్జునకి చెప్పినట్లు జయకుమార్ తెలిపారు. చిరంజీవితో పాటు నాగార్జున కూడా ఇండస్ట్రీలో ఎదుగుతున్నారు. అలాంటి చిత్ర పరిశ్రమని వదిలిపెట్టడానికి నాగార్జున ఇష్టపడలేదు. 

66

దీని కారణంగా నాగార్జున, దగ్గుబాటి లక్ష్మి మధ్య విభేదాలు వచ్చాయి. దీనితో ఆమె యుఎస్ వెళ్లిపోయిందట. ఆ కారణంగా నాగార్జున, లక్ష్మి ఇద్దరూ విడాకులు తీసుకున్నట్లు జయకుమార్ పేర్కొన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ లో ఆయన చెప్పిన ఈ విషయాలు వైరల్ గా మారాయి. ఆ తర్వాత నాగ్.. శివ చిత్రంలో తనతో కలసి నటించిన అమలని వివాహం చేసుకున్నాడు. 
 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Netflix Thrillers: నెట్‌ఫ్లిక్స్‌లో తప్పక చూడాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఇవే
Recommended image2
Actress Hema: రాజకీయాల్లోకి నటి హేమ, దాసరి సమాధి వద్ద హింట్.. సినిమా అవకాశాల కోసం ఆశీస్సులు
Recommended image3
Sayaji Shinde: తల్లి చివరి కోరిక తీర్చిన టాలీవుడ్‌ యాక్టర్‌.. గ్రీనరీతో అమ్మకి జీవం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved