MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మరణానికి ముందు ఎన్టీఆర్, హరికృష్ణ భార్యతో చివరిగా ఏమన్నాడో తెలుసా... జూనియర్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన!

మరణానికి ముందు ఎన్టీఆర్, హరికృష్ణ భార్యతో చివరిగా ఏమన్నాడో తెలుసా... జూనియర్ జీవితాన్ని మలుపు తిప్పిన ఘటన!

సీనియర్ ఎన్టీఆర్ తన చివరి రోజుల్లో జూనియర్ ఎన్టీఆర్ తో బాగా గడిపారట. కాగా మరణానికి కొద్దిరోజుల ముందు ఎన్టీఆర్ తన కొడుకు హరికృష్ణ రెండో భార్యను కలిశారట. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో ఆయన ఒక మాట తీసుకున్నారట.   

2 Min read
Author : Sambi Reddy
Published : Aug 19 2024, 05:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Junior NTR

Junior NTR


లెజెండ్ ఎన్టీఆర్ నటుడిగా, రాజకీయవేత్తగా తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ స్టార్ అయ్యారు. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా రాణిస్తున్నారు. ఎన్టీఆర్ వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా ప్రత్యేకం. ఎన్టీఆర్ రూపం జూనియర్ ఎన్టీఆర్ సొంతం. తాతయ్య పేరు పెట్టుకున్నందుకు ఆయన లెగసీని ముందుకు తీసుకెళుతున్నాడు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

కాగా ఓ ఇంటర్వ్యూలో తాతయ్య ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. మొదటిసారి తాత ఎన్టీఆర్ ఇంటికి వెళ్లిన అనుభవం ఆయన షేర్ చేశారు. ఆ ఇంటి ఆవరణలో, చెట్టులో, ఆకులో, గాలిలో దైవత్వం ఉన్న భావన కలిగిందట. ఇంట్లో అడుగు పెట్టగానే ఆయన కాషాయ వస్త్రాల్లో జపం చేస్తూ కనిపించాడట. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను చూసి.. రండి అని అన్నారట. 
 

36
Junior NTR

Junior NTR

జూనియర్ ఎన్టీఆర్ ని తాతయ్య ఏం పేరు అని అడిగాడట. తారక్ రామ్ అని సమాధానం చెప్పాడట. హరికృష్ణ పెద్ద కొడుకుల పేర్లు జానకి రామ్, కళ్యాణ్ రామ్ కాగా, జూనియర్ కి తారక్ రామ్ అని పెట్టాడట. అయితే తారక్ రామ్ కాదు, నందమూరి తారక రామారావు అని పేరు మార్చమని ఎన్టీఆర్ తన కొడుకు హరికృష్ణకు సూచించాడట. అలా ఎందుకు అన్నాడో నాకు తెలియదు, అని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. 
 

46
Junior NTR

Junior NTR

అప్పటి నుండి ఒక ఏడాది పాటు ప్రతిరోజూ తాతయ్యను జూనియర్ ఎన్టీఆర్ కలిసేవాడట. తన మీద ఎన్టీఆర్ ప్రత్యేకమైన అభిమానం చూపించేవాడట. బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో ఆయనతో పాటు నటించే అవకాశం నాకు దక్కింది. తాతయ్యతో నటించిన ఏకైక మనవడిని నేను అని జూనియర్ ఎన్టీఆర్ గొప్పగా చెప్పుకున్నాడు. 
 

56

ఒకరోజు జూనియర్ ఎన్టీఆర్ తల్లి షాలిని ని ఎన్టీఆర్ ఇంటికి పిలిపించారట. షాలిని తో ఎన్టీఆర్... ఇన్నాళ్లు దూరంగా బ్రతికాము. ఆ విషయాన్ని వదిలేయండి. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతటి వాడిగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత నీ మీద ఉంది. నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తాను... అని అన్నాడట. ఇది జరిగిన కొన్ని రోజులకు ఎన్టీఆర్ మరణించారట. 


 

66

తన వంతు బాధ్యత నెరవేరుస్తాను అని చెప్పి, అది చేయకుండానే వెళ్లిపోయాడని తాత మీద జూనియర్ ఎన్టీఆర్ కి కోపం వచ్చిందట. అయితే తర్వాత తనకు అర్థమైందట. తన రూపం, తన పేరు ఇవ్వడం ద్వారా తాతయ్య తన బాధ్యత ఆల్రెడీ పూర్తి చేశాడని జూనియర్ ఎన్టీఆర్ అనుకున్నారట. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే షోలో జూనియర్ ఎన్టీఆర్ ఈ కామెంట్స్ చేశాడు... 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నందమూరి తారక రామారావు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved