MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చాలా కాలం తరువాత కెమెరా ముందుకు వచ్చిన రంభ, ఇంత మాట అనేసిందేమిటి..?

చాలా కాలం తరువాత కెమెరా ముందుకు వచ్చిన రంభ, ఇంత మాట అనేసిందేమిటి..?

చాలా కాలం తరువాత కనిపించింది సీనియర్ హీరోయిన్ రంభ. పెళ్ళి చేసుకుని ఫారెన్ లో సెటిల్ అయిన హీరోయిన్ చాలా ఏళ్ళ తరువాత ఇండియాకు వచ్చింది. ఉన్న కాస్త టైమ్ లో చెక చెక పనులు చక్కబెట్టుకుంటుంది బ్యూటీ. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 23 2022, 12:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లో 90 వ దశకాన్ని ఏలిని హీరోయిన్లలో  రంభ కూడా ఒకరు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒకప్పుడు రంభ ఒక వెలుగు వెలిగింది. కుర్ర కారును ఉర్రూతలూగించింది బ్యూటీ. అప్పట్లో రంభ యాక్టింగ్, గ్లామర్ షో ఇప్పటి హీరోయిన్లకు కూడా సాధ్యం కాదేమో అంతాలా ఆమె ఆడియన్స్ హృదయాల్లో పాతుకుపోయింది. 

26

 తెలుగుతో పాటు తమిళంలో సైతం ఆమె స్టార్ హీరోయిన్ గా  చెలరేగిపోయింది అప్పుడు.ఇప్పటికీ ఆమెకు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉంది. ఇక కెరీర్ లో కాస్త డౌన్ అవుతున్నాము అనుకున్న టైమ్ లోనే.. హీరోయిన్ గా తన చేతుల్లో సినిమాలు  ఉండగానే ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కెనడాలో ఉంటోంది. బిజినెస్ మెన్ ను ప్రేమించి పెళ్ళి చేసుకున్న రంభ.. ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తోంది. 

36

ఇక చాలా కాలం తరువాత రంభ రీసెంట్ గా ఇండియాకు వచ్చింది.  ఒక పెళ్లి కోసం  ఆమె ఇక్కడికి వచ్చినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకుంది రభం. ఈ సందర్భంగా మీడియా ముందు కాసేపు కారు ఆపి మాట్లాడింది. చాలా కాలం తరువాత కెమెరా ముందుకు వచ్చింది బ్యూటీ. కాని అందరిని నిరాశపరిచింది. 

46

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. స్వామివారి దర్శనానంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ... దర్శనం చాలా బాగా అయిందని చెప్పారు. తన అక్క కూతురి వివాహం కోసం ఫ్యామిలీతో కలిసి ఇండియాకు వచ్చానని తెలిపారు రంభ. ప్రస్తుతం ఇంతకు మించి ఏం మాట్లాడలేనని చెపుతూ ఆమె చకచకా వెళ్లిపోయారు. మీడియా నుంచి ప్రశ్నలు వస్తున్నా.. వినిపించుకోలేదు ఆమె. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. 

56

రంభ ఇండియాకు వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆమె చెన్నైలోని తన నివాసానికి వచ్చింది. మళ్ళీ ఫారెన్ వెళ్లేవరకూ తన షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకుని ఉంది రంభ. మీనా ఇంటికి వెళ్ళి తన జనరేషన్ హీరోయిన్లతో కలిసి సందడి చేసింది. అటు మరో హీరోయిన్ కుష్బును తన ఇంటింకి ఆహ్వానించి సోషల్ మీడియాలో పిక్స్ శేర్ చేసింది. 
 

66

రాక రాక ఇండియాకు వచ్చిన రంభ.. ఇక్కడ పనులన్నీ చక్కబెట్టుకుని వెళ్ళాలని చూస్తోంది. ఇక రంభ రాకతో సోషల్ మీడియాలో పుకార్లు ఊపందుకున్నాయి. ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిందని. త్వరలో సినిమల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోందంటై రకరకాలా వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ విషయంలో రంభ మాత్రం ఇంత వరకూ స్పందించలేదు. 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
మీనా (నటి)

Latest Videos
Recommended Stories
Recommended image1
Doctor Chakravarthy Review : ఏఎన్నార్ చెల్లెలుగా సావిత్రి నటించిన ఏకైక చిత్రం, ఫస్ట్ నంది అవార్డ్ మూవీ..
Recommended image2
Dhurandhar: ధురంధర్ కోసం డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా.. స్టార్లు ఎవరూ ఒప్పుకోలేదు, కానీ
Recommended image3
Sharwanand: 23 ఏళ్ల కుర్రాడి టాలెంట్‌కి శర్వానంద్‌ ఫిదా.. టాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved