పెళ్ళి రోజున భర్తను తలచుకుని నటి మీనా ఎమోషనల్ పోస్ట్... సోషల్ మీడియలో వైరల్
రీసెంట్ గా భర్తను కోల్పోయి బాధలో ఉంది సీనియర్ హీరోయిన్ మీనా. ఆమెను రకరకాల వివాదాలతో పాటు, కొన్ని తీపి గురుతులు కూడా ఆమెను వెంటాడుతున్నాయి. పెళ్ళి రోజున మీనా తన భర్తను గుర్తు చేసుకుంటూ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.

ఈ మధ్యే భర్తను కోల్పోయి పుట్టెడ్ దుఖంలో ఉంది నటి మీనా. ఆమె భర్త విద్యాసాగర్ కరోనా బారిన పడి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ కావడంతో ఐసీయూ చికిత్స పొందుతూ.. లంగ్స్ ట్రాన్స్‌ప్లాంట్ దాతలు ఎవ్వరూ దొరక్క మరణించారు. మీనా భర్త సాగర్ జూన్ 29న కన్నుమూశారు.
మీనా భర్త విద్యా సాగర్ మరణంతో ... సోషల్ మీడియాలో చాలా విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో కొన్ని మీనాను ఇబంధులు పెట్టేవిగా ఉన్నాయి. రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయ్యాయి. మీనా వల్లే భర్త చనిపోయాడని, లేదు పావురాల వల్ల ఆయనకుఈ పరిస్థితి వచ్చిందని.. ఇలా రకరకాల రూమర్స్ వచ్చాయి..
అయితే ఆ విషయంలో సోషల్ మీడియా పోస్ట్ ద్వారా మీనా క్లారిటీ ఇచ్చారు. తాము బాధలో ఉన్నామని.. తమ కుటుంబానికి ప్రైవసీ ఇవ్వందంటూ వేడుకున్నారు. ఆతరువాత కూడా రకరకాల రూమర్స్ ఆగలేదు.
ముఖ్యంగా మీనా కుటుంబం ఆస్తివివాదాల్లో ఉందంటూ రూమర్స్ చక్కెర్లు కొట్టాయి. మీనా భర్తకు 250 కోట్లకు పైగా ఆస్తి ఉందని.. ఆ ఆస్తి మీన పేరు మీద కాకుండా కూతురు నైనిక పేరు మీద విద్యాసాగర్ రాశారని... మీనాకు ఆస్తి చెందకుండా వీలునామా రాశారని. మీనా కుమార్తె నైనిక మేజర్ అవ్వగానే ఆ ఆస్తి ఆమెకు, ఆమె భర్తకు దక్కేటట్టు వీలునామాలో ఉందని.. మీనపై సోషల్ మీడియా కోడై కూసింది.
meena
ఇక ఈ పరిస్థితుల్లో భర్తనుతలుచుకుని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది మీనా. తమ పెళ్లి రోజు సందర్భంగా... భర్త గురించి గొప్పగా ఇన్ స్టా లో రాసింది మీనా. మీనా విద్యాసాగర్ ను 2009 జులై 12న పెళ్లాడింది. భర్త మరణం తరువాత వచ్చిన పెళ్లి రోజున మీన ఓ ఎమోషనల్ మెసేజ్ పోస్ట్ చేశారు.
నువ్వు ఒక అందమైన దేవుడిచ్చిన దీవెనవీ... . కానీ ఆ దేవుడు నిన్ను చాలా త్వరగా నానుంచి తీసుకెళ్లాడు. నువ్వు ఎప్పటికీ నా గుండెల్లో ఉంటావు. ఆ ఫ్యామిలీ, నేను ప్రపంచం నలుమూలల నుంచి ప్రేమను, ప్రార్థనలను పంపిస్తున్నా మిలియన్ హార్ట్స్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు మీనా.
అంతే కాదు ఈ విపత్కర పరిస్థితుల్లో తమపై.. స్నేహితులు, ఫ్యామిలీ ఎవరు అయితే శ్రద్థ, ప్రేమ చూపస్తూ.. సపోర్ట్ చేస్తున్నారో...మీరు మా జీవితంలో ఉన్నందుకు గొప్పగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రేమను నేను గ్రేట్ ఫుల్‌గా ఫీల్ అవుతున్నానని మీన పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.