MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఇంద్రజ కూతురు..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ తార..

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఇంద్రజ కూతురు..? క్లారిటీ ఇచ్చిన సీనియర్ తార..

మాజీ హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. కామెడీ షోలతో  బిజీగా గడిపేస్తుంది. ఇక త్వరలో ఆమె కూతురు కూడా టాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇంద్రజ ఏమంటున్నారంటే..?  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Aug 26 2023, 09:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

90స్ లో స్టార్స్ గా వెలుగు వెలిగిన హీరోయిన్లు అంతా.. ఏదో ఒక రూపంలో రీ ఎంట్రీలు ఇస్తున్నారు.. కొంత మంది వెడితెరపూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు గా ఉంటే..మరికొందరేమో.. బుల్లితెరను ఏలుతున్నారు.. ఇంకొందరేమో.. రెండింటిపై గట్టిగా గ్రిప్ సాధించి అంతటా వాళ్లే కనిపిస్తున్నారు. అలాంటి హీరోయిన్లలో ఇంద్రజ కూడా ఒకరు.  హీరోయిన్ గా వెయిడ్ అవుటు అయిన ఈ తార.. ప్రస్తుతం వెండితెరపైనే కాకుండా..బుల్లితెరపై కూడా ఒక ఊపు ఊపేస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీలు ఇవ్వడంతో పాటు.. వారి వారసురాళ్లను కూడా కొంత మంది హీరోయిన్లు గా చూసుకోవాలని ముచ్చట పడుతున్నారు. ఇప్పటికే కొంతమంది సీనియర్ తారలు తమ కూతుర్లను హీరోయిన్లుగా చూసుకున్నారు కూడా. ఇక తాజాగా సీనియర్ తార ఇంద్రజ కూడా తన వారసురాలిని హీరోయిన్ గా పరిచయం చేయాలని చూస్తోందట. 
 

37

 ఇంద్రజ  గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించి.. మెప్పించిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఫ్యామిలీ,  పిల్లలు బాధ్యతలతో బిజీ అయిపోయింది. ఇక ఈ మధ్యనే సినిమాలలోకి అడుగు పెట్టకపోయినా బుల్లితెరపై పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. సత్తా చాటుతోంది. 
 

47

జబర్థస్త్ లో రోజా ప్లేస్ ను మస్త్ జబర్థస్త్ గా హీరోయిన్  ఇంద్రజ భర్తీ చేస్తోంది. ఇప్పటికే జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ  అంటూ షోలన్నీ ఆక్యూపై చేసేసింది ఇంద్రజ. అటు ఎంటర్టైన్మెంట్ తో పాటు.. రెండు చేతుల భారీగానే సంపాదిస్తోంది. షోలో కమెడియన్లతో పాటు ప్రేమక్షకుల అభిమానాన్ని కూడా సొంతం చేసుకుంది సీనియర్ బ్యూటీ. 

57

 ఇదిలా ఉండగా ప్రస్తుతం వరుస షోలతో బిజీగా ఉన్న ఇంద్రజ తన  వారసురాలుగా కూతురు  టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంద్రజ కూతురు  సారా.. ప్రస్తుతం చదువుకుంటూ.. సంగీతం కూడా  నేర్చుకుంది. త్వరలోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతోంది అంటూ వస్తున్న వార్తపై ఇంద్రజ కూడా స్పందించింది. 

67

తన  కూతురు టాలీవుడ్  ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నా కూతురు హీరోయిన్ అవుతుంది అని నేను అనుకోను.. ఎందుకంటే.. ఆమెకు నటన కంటే సంగీతం అంటే చాలా ఇష్టం. చాలా పెద్ద  మ్యూజిక్ లవర్ తను. అందుకే ఆమె భవిష్యత్తులో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందని నాకు అనిపిస్తోంది అంటూ చెప్పుకొచ్చింది. మరి తన అభిప్రాయం ఎలా ఉందో తెలియదంటోంది ఇంద్రజ. 
 

77

ఇక దీంతో అభిమానులు మీలాగే మీ కూతురు కూడా చాలా అందంగా ఉంది. హీరోయిన్ గా ట్రై చేయిచండి అంటూ.. ప్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అటు మరికొంత మంది మాత్రం తనకు నచ్చిన రంగంలో కొనసాగితేనే ఆమె కెరియర్ కు ప్లస్ అవుతుందని చెప్పుకొస్తున్నారు. మరి సారా మ్యూజిక్ డైరెక్టర్ అవుతుందా? లేక తల్లిలాగే హీరోయిన్ అవుతుందా?  చూడాలి మరి. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Silk Smitha: సిల్క్ స్మిత, జయలక్ష్మి లాగా ఇంకెవరూ చనిపోకూడదంటే అదే మార్గం..హీరోయిన్లంతా ఆ మూవీ చూడాలి
Recommended image2
Kalyan Padala: మళ్లీ ప్రేమలో కళ్యాణ్‌ పడాల, తనూజ స్ట్రాంగ్‌ వార్నింగ్‌.. బిగ్‌ బాస్‌ షోపై సంచలన కామెంట్‌
Recommended image3
Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved