డైరెక్టర్ అవతారం ఎత్తబోతున్న టాలీవుడ్ సీనియర్ హీరోయిన్..
ఈ మధ్య ఫెయిడ్ అవుట్ ఆర్టిస్ట్ లు అంతా నిర్మాతలుగానో, దర్శకులుగానో మారిపోతున్నారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు హీరోయిన్ కళ్యాణి కూడా చేరింది. త్వరలో మెగా ఫోన్ పట్టబోతోంది కేరళ భామ.

అందమైన చిరునవ్వుతో ఆకట్టుకున్న నిన్నటితరం హీరోయిన్లలో కల్యాణి ఒకరు. టాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకున్న కళ్యాణి నిజానికి కేరళలో పుట్టి పెరిగింది. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలలో చేసిన కళ్యాణి...ఆ తరువాత హీరోయిన్ గా మలయాళంతో పాటు తెలుగు,తమిళ, కన్నడ భాషల్లో నటించి మెప్పించింది.
శేషు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కళ్యాణి. ఆతరువాత వెనక్కి తిరిగి చూసుకోకుండా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. రవితేజ తో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు సినిమాతో కళ్యాణి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మంచి మంచి అవకాశాలు ఆమె గుమ్మం తొక్కాయి.
అవ్వడానికి మలయాళీ హీరోయిన్ అయినా..టాలీవుడ్ లో ఆమెకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. ఎప్పుడూ చీరకట్టులో మాత్రమే కనిపించే కళ్యాణి.. మోడ్రన్ డ్రెస్ లతో పాటు స్కిన్ షో చేయడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. దాంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎక్కువగా చేరువయ్యారు కళ్యాణి.
తెలుగులో ఎక్కువగా కళ్యాణి జగపతిబాబుతో ఎక్కువ సినిమాలు చేసింది. వీరిద్దరి కాంబోలో కబట్టి కబడ్డి లాంటి సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. ఆతరువాత తమిళ దర్శకుడు సూర్య కిరణ్ తో పెళ్లి తరువాత కొంత కాలం సినిమాలకు దూరం అయ్యారామె.
ఆమె వివాహబంధం ఎక్కువ కాలం నిలవలేదు. సూర్య కిరణ్ కు డైవర్స్ ఇచ్చిన తరువాత మళ్లీ కెరీర్ మీద దృష్టి పెట్టింది కళ్యాణి. కొంతకాలం పాటు సినిమాలకి దూరంగా ఉన్న ఆమె, ఆ తరువాత నిర్మాతగా మారింది. తన వయసుకి తగిన పాత్రలతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చింది.
ఇక తాజాగా కల్యాణి డైరెక్టర్ గా మారింది. ఇప్పటి వరకూ నిర్మాతగా ఉన్న ఆమె, ఫస్ట్ టైమ్ తన సొంత బ్యానర్ లోనే మెగా ఫోన్ పట్టబోతోంది. చేతన్ చీను హీరోగా ఆమె సినిమాను రూపొందిస్తోంది. రాజుగారి గది, మంత్ర 2 లాంటి సినిమాలతో ఫేమస్ అయిన చేతన్... సోలో హీరోగా సినిమా చేస్తుంది కళ్యాణి.
కల్యాణి దర్శక నిర్మాతగా చేస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళ,కన్నడ,మలయాళ భాషల్లో ఈమూవీని రిలీజ్ చేసే అవకాశం ఉంది. వీలైతే హిందీలో కూడా విడుదల చేయాలనకుంటున్నట్టు తెలుస్తోంది.