- Home
- Entertainment
- ఖుష్బు బెడ్ రూమ్‌లో సీనియర్ హీరోని పెట్టుకుని.. చిరు, బాలయ్యలతో ఆ కోరిక మిగిలిపోయిందంటూ వ్యాఖ్యలు..
ఖుష్బు బెడ్ రూమ్‌లో సీనియర్ హీరోని పెట్టుకుని.. చిరు, బాలయ్యలతో ఆ కోరిక మిగిలిపోయిందంటూ వ్యాఖ్యలు..
ఖుష్బూ సుందర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తుంది. కానీ ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా, అందాల నటిగా ఓ ఊపు ఊపింది. అందరు స్టార్లతోనూ కలిసి నటించింది. కానీ ఆ ముగ్గురు స్టార్లతో మాత్రం రొమాన్స్ చేయలేదట. తాజాగా ఆ కోరికని బయటపెట్టింది ఖుష్బూ.

ఖుష్బూ.. ఒకప్పుడు హిందీతోపాటు సౌత్ మొత్తాన్ని ఉర్రూతలూగించింది. అందమైన నటిగా అలరించింది. విశేష అభిమానగణాన్ని ఏర్పర్చుకుంది.ఈ అమ్మడి కోసం అభిమానులు పూజలు చేసిన రోజులున్నాయి. అంతటి క్రేజ్, ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. హీరోయిన్‌గా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలో దాదాపు అందరు ప్రముఖ హీరోలతో నటించింది. రొమాన్స్ చేస్తూ రక్తికట్టించింది. కానీ ప్రముఖంగా చెప్పుకునే ముగ్గురితో మాత్రం ఈ బ్యూటీ రొమాన్స్ చేయలేదు. ఆ లోటు ఇప్పటికీ వెంటాడుతుందట.
బాలీవుడ్‌లో బిగ్ బీ అమితాబ్, తెలుగులో చిరంజీవి, బాలకృష్ణల సరసన హీరోయిన్‌గా చేసే అవకాశం రాలేదట. అయితే చిరంజీవితో `స్టాలిన్` చిత్రంలో నటించింది ఖుష్బూ. కానీ ఇందులో ఆమె చిరుకి అక్కగా చేసింది. `అజ్ఞాతవాసి`లో పవన్‌కి తల్లిగానూ నటించిన విషయం తెలిసిందే. కానీ చిరు, బాలయ్య, అమితాబ్ బచ్చన్‌లతో రొమాన్స్ చేయలేదనే లోటు ఉండిపోయిందట. తాజాగా ఈ విషయాన్ని ఆమె `రామబాణం` చిత్ర ప్రమోషనల్ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
ఇప్పటి వరకు బాలకృష్ణ, చిరంజీవిలతో కలిసి రొమాన్స్ చేయలేదని, వారితో కలిసి నటించలేదనే కోరిక ఇంకా అలానే ఉండిపోయిందన్నారు. వారితో కలిసి నటించేందుకు తాను ఇష్టంగా ఫీలవుతానని, అలాంటి ఛాన్స్ కోసం ఇప్పటికీ వెయిట్ చేస్తున్నానని తెలిపింది. మరోవైపు బాలీవుడ్‌లో బిగ్ బీ అంటే ఎంతో అభిమానం అంట. ఎంత అభిమానం అంటే, ఇప్పటికీ ఆయన ఫోటోని తన బెడ్ రూమ్‌లో పెట్టుకుందట. ఆయనతో కలిసి చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశానని, కానీ ఆయన సరసన హీరోయిన్‌గా చేయలేకపోయానని తెలిపింది.
అయితే `చీనీ కమ్` అనే చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి టబు నటించిందట. దీంతో ఆ విషయంలో తెలిసి టబు కి ఫోన్ చేసి తిట్టిందట. ఆయనతో ఎలా నటిస్తావంటూ చెడామడా తిట్టేశానని (నవ్వుతూ) చెప్పింది ఖుష్బూ. ప్రస్తుతం ఖుష్బూ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక గోపీచంద్ హీరోగా రూపొందిన `రామబాణం` చిత్రంలో ఖుష్బూ కీలక పాత్ర పోషించింది. శ్రీవాస్ దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. ఈ సినిమా మే 5న విడుదల కానుంది.
ఖుష్బూ తెలుగులో నాగార్జున, వెంకటేష్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోలతో ఎక్కువ సినిమాలు చేసింది. హీరోయిన్‌గా ఎంతో క్యూట్‌గా, అందంగా ఉంది అలరించి, ఆకట్టుకున్న ఖుష్బు ఆ మధ్య బాగా లావెక్కింది. బొద్దుగానూ మెరిసింది. మళ్లీ ఇటీవల స్లిమ్‌గా మారి కుర్రహీరోయిన్లకి పోటీనిస్తుంది. ఈ బ్యూటీ సినిమాలే కాదు, సీరియల్స్, టీవీ షోస్ కూడా చేస్తుంది. ప్రస్తుతం తెలుగులో `ఎక్స్ ట్రా జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.