చీరకట్టులో ఫ్యామిలీ బ్యూటీ స్నేహ అందాలు.. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తున్న సీనియర్ నటి
ఫ్యామిలీ హీరోయిన్ స్నేహా చెక్కు చెదరని అందాలతో మంత్రముగ్ధులను చేస్తోంది. తాజాగా చీరకట్టులో దర్శనమిచ్చిన ఈ ముద్దుగుమ్మ క్యూట్ ఫోజులిస్తూ ఆకట్టుకుంది. సంప్రదాయ దుస్తుల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది.
హోమ్లీ బ్యూటీ స్నేహా (Sneha) తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేసిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లోనూ గుర్తుండిపోయే సినిమాలు చేసింది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
తన నటన, అందంతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అలాగే ఈ బ్యూటీ పోషించిన విభిన్న పాత్రలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఆడియెన్స్ కూడా స్నేహ పెర్ఫామెన్స్ కు ఫ్యాన్స్ గా మారాయి.
తెలుగులో ‘హనుమాన్ జంక్షన్’, ‘వెంకీ’, ‘రాధా గోపాలం’, ‘శ్రీ రామదాసు’, ‘రాజన్న’ వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మరిన్ని చిత్రాల్లోనూ నటించి ఇక్కడి ఆడియెన్స్ కు బాగా దగ్గరైంది. హోమ్లీ బ్యూటీగా గుర్తింపు దక్కించుకుంది.
ప్రస్తుతం స్నేహ కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా లీడ్ పాత్రలకు గుడ్ బై చెప్పి.. కీలక పాత్రల్లో నటిస్తూ వస్తోంది. బలమైన రోల్స్ లో నటిస్తూ సీనియర్ నటిగా ప్రశంసలు అందుకుంటోంది. ఆడియెన్స్ ను ఫిదా చేస్తోంది.
ఇప్పటికే తెలుగులో ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘రాజా ది రాజా’ ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించింది. అటు తమిళం, మలయాళంలోనూ వరుసగా సినిమాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళంలో సందడి చేస్తోంది.
ఇలా సెకండ్ ఇన్సింగ్స్ లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ సీనియర్ నటి సోషల్ మీడియాలోనూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. వరుసగా ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లనూ తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా మరిన్ని బ్యూటీఫుల్ ఫొటోలను పంచుకుంది.
లేటెస్ట్ ఫొటోస్ లో స్నేహ చీరకట్టులో దర్శనమిచ్చింది. నాలుగు పదుల వయస్సులోనూ చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తోంది. చక్కని రూపసౌందర్యంతో, బ్యూటీఫుల్ శారీ లుక్ లో అదిరిపోయేలా ఫోజులిచ్చింది. క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తోంది.
ప్రస్తుతం స్నేహా పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఫ్యాన్స్ లైక్, కామెంట్లతో మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం విజయ దళపతి 68వ చిత్రంలో స్నేహ కీలక పాత్ర పోషిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ ప్రారంభ వేడుకలోనూ మెరిసింది.