- Home
- Entertainment
- Sneha Latest Photos : వయసు పెరిగినా తరగని అందం.. నటి స్నేహ గ్లామర్ కు కుర్రాళ్లు తడబడాల్సిందే..
Sneha Latest Photos : వయసు పెరిగినా తరగని అందం.. నటి స్నేహ గ్లామర్ కు కుర్రాళ్లు తడబడాల్సిందే..
టాలీవుడ్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది సీనియర్ నటి స్నేహ (Sneha). వయసు పెరిగినా తరగని అందంతో ఇప్పటికీ మెస్మరైజ్ చేస్తోంది. తన అభిమానులతో తాజాగా లేటెస్ట్ ఫొటోలను పంచుకుంది.

తమిళ హీరోయిన్ స్నేహ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగానే దగ్గరైంది. తన కేరీర్ లో తెలుగు సినిమాలకంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాల్లో నటించింది. అయినా ఈ హీరోయిన్ అంటే తెలుగు వారికీ ప్రత్యేక అభిమానం.
అచ్చు తెలుగమ్మాయిలాగానే కనిపించే స్నేహ ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. యంగ్ హీరోల సరసన నటించి తనకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. స్నేహ ఏ చిత్రంలో నటించిన పాత్రకు న్యాయం చేయడంలో సమర్థురాలని అనిపించుకుంది.
20 ఏండ్ల కింద గోపీచంద్ నటించిన ‘తొలి వలపు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యిందీ సుందరి. ఆ తర్వాత ‘హనుమాన్ జంక్షన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించింది మెప్పించింది. కానీ ఈ చిత్రాలతో తనకేం ఫలితం లేకపోయింది.
మాస్ మహారాజ రవితేజ (RaviTeja), డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషనల్ వచ్చిన ‘వెంకీ’ చిత్రంతో స్నేహ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అప్పటి నుంచి వరుస తెలుగు చిత్రాల్లో వరుసగా నటిస్తూ ఆడియెన్స్ గుండెల్లో చోటు సంపాదించుకుంది.
ఇప్పటికీ ప్రేక్షకుల నోళ్లలోనానే సినిమాల్లో స్నేహ హీరోయిన్ గా నటించడంతో తెలుగు ప్రేక్షకులతో విడదీయలేని బంధం ఏర్పడింది. ‘వెంకీ, సంక్రాంతి, రాధా గోపాలం, శ్రీ రామదాసు, పాండు రంగడు, రాజన్న, సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రాలు స్నేహకు మంచి గుర్తింపును తెచ్చి పెట్టాయి.
చివరిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘వినయ విధేయ రామ’ చిత్రంలో కొనిదెల గాయత్రి దేవి పాత్రలో నటించారు స్నేహ. ఆ తర్వాత మళ్లీ తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇటు సోషల్ మీడియాలోనూ స్నేహ తన అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా శ్రీ రామ నవమి సందర్భంగా తన లేటెస్ట్ పిక్స్ ను షేర్ చేసింది.
ఫొటోల్లో ఎల్లో చుడీదార్ లో మైమరిపిస్తోంది స్నేహ. మతిపోయే ఫోజులతో కుర్రభామలా రెచ్చిపోయింది. ‘ఒక్కోసారి ఒక క్షణం జ్ఞాపకంగా మారే వరకు దాని నిజమైన విలువ మీకు ఎప్పటికీ తెలియదు’ అంటూ అదిరిపోయేలా క్యాప్షన్ కూడా ఇచ్చింది. స్నేహ గ్లామర్ కు నెటిజన్లు లైక్ చేయకుండా ఉండలేకపోతున్నారు.