MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • పెళ్ళై ముగ్గురు పిల్లలున్న నటుడితో ప్రేమ వివాహం..చిత్ర హింసలు అనుభవించిన సీనియర్ నటి, రెండు సార్లు మోసపోయి

పెళ్ళై ముగ్గురు పిల్లలున్న నటుడితో ప్రేమ వివాహం..చిత్ర హింసలు అనుభవించిన సీనియర్ నటి, రెండు సార్లు మోసపోయి

పెళ్ళై ఆల్రెడీ పిల్లలున్న వ్యక్తులని పెళ్లి చేసుకున్న హీరోయిన్లలో ముందుగా మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి గుర్తుకు వస్తారు. అదే పని చేసిన మరో సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు శారద.

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 04 2024, 12:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

పెళ్ళై ఆల్రెడీ పిల్లలున్న వ్యక్తులని పెళ్లి చేసుకున్న హీరోయిన్లలో ముందుగా మహానటి సావిత్రి, అతిలోక సుందరి శ్రీదేవి గుర్తుకు వస్తారు. అదే పని చేసిన మరో సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు శారద. 90 వ దశకం నుంచి శారద తల్లి పాత్రలతో పాపులర్ అయ్యారు కానీ అంతకు ముందు ఆమె వాణిశ్రీ తరహాలో స్టార్ హీరోయిన్. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు లాంటి లెజెండ్స్ తో ఎన్నో చిత్రాల్లో నటించారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

అంతటి గుర్తింపు పొందిన శారద తన వ్యక్తిగత జీవితంలో మాత్రం తప్పటడుగులు వేశారు. తాను నటిగా రాణిస్తున్న సమయంలో సీనియర్ నటుడు చలంతో ఆమె ప్రేమలో పడ్డారు. అప్పటికి చలంకి పెళ్ళై ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య అగ్ని ప్రమాదంలో మరణించింది. దీనితో శారద చలంని ప్రేమించింది. తన పెళ్లిళ్ల గురించి శారద ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు. ప్రేమించుకునే సమయంలో చలం నన్ను బాగా చూసుకునేవాడు. ప్రేమ గుడ్డిది కాబట్టి నాకు అప్పుడు ఏమీ అర్థం కాలేదు. నా వయసు కూడా 22 రెండు ఏళ్ళు. 

Also Read: తండ్రి ఎంజీఆర్ అంతటి స్టార్, అయినా కటిక దరిద్రంలో బతికిన నటి.. చివరికి తెలుగు హీరోని పెళ్లి చేసుకుని..

35

1972లో శారద, చలంని వివాహం చేసుకుంది. పెళ్ళైన మూడో రోజు నుంచే చలం అసలు రంగు బయటపడిందట. డబ్బు కోసమే అతడు నన్ను పెళ్లి చేసుకున్నాడు అని అర్థం అయింది. షూటింగ్ సెట్స్ కి వచ్చి కూడా వేధించేవాడు. కొన్నిసార్లు కొట్టడానికి ప్రయత్నించాడు అంటూ శారద వాపోయింది. అతడి వేధింపులు భరించలేక విడిపోయినట్లు శారద పేర్కొంది. 

Also Read : నిఖిల్ ని చూస్తే కిర్రాక్ సీతకి ఫీలింగ్స్ వస్తాయా.. హస్బెండ్ అయితే బావుంటుంది అని ఓపెన్ గా..

45

పెళ్లి విషయంలో మరోసారి కూడా మీ మోసపోయింది. శారద చలంతో విడిపోయాక మలయాళీ బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుంది. అతడు కూడా కొద్దిరోజులు బాగానే ఉన్నాడు. నా డబ్బు పట్లే అతడి ఆసక్తి అని తర్వాత తెలిసింది. అతడి నుంచి కూడా విడిపోయినట్లు శారద తెలిపారు. 

55

శారదకు పిల్లలు లేరు. తన సోదరుల పిల్లలని ఆమె పెంచుతున్నారు. వారితోనే చెన్నైలో నివాసం ఉంటున్నారు. శారద ఎన్నో వందలాది చిత్రాల్లో నటించారు. ఆమె చివరగా తెలుగులో నటించిన చిత్రాల విషయానికి వస్తే చిరంజీవికి తల్లిగా స్టాలిన్ చిత్రంలో.. ప్రభాస్ కి తల్లిగా యోగి చిత్రంలో.. వెంకటేష్ కి తల్లిగా సంక్రాంతి చిత్రంలో నటించారు. అదే విధంగా సుకుమారుడు అనే చిత్రంలో కూడా నటించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: భోజనం ప్లేట్‌లో ఆ కూర లేకపోతే బాలయ్యకు ముద్ద దిగదు, బాలకృష్ణ ఫిట్ సీక్రెట్ ఏంటో తెలుసా?
Recommended image2
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Pawan Kalyan: బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ను ఎలా కాకా పడతాడో తెలుసా? అసలు సీక్రెట్ రివిల్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved