- Home
- Entertainment
- Scene 6 Days Collections: వీక్ డేస్‌లోనూ సూర్య `సీన్` మూవీకి మతిపోయే వసూళ్లు.. టోటల్‌గా ఎంతంటే?
Scene 6 Days Collections: వీక్ డేస్‌లోనూ సూర్య `సీన్` మూవీకి మతిపోయే వసూళ్లు.. టోటల్‌గా ఎంతంటే?
Scene 6 Days Collections: సూర్య హీరోగా నటించిన `సీన్` మూవీ బాక్సాఫీసు వద్ద దుమ్ములేపుతోంది. ఈ సినిమా వీకెండ్లోనే కాదు, వీక్ డేస్‌లోనూ అదిరిపోయే వసూళ్లని రాబడుతోంది. ఆరవ రోజు ఈ మూవీ ఎంత చేసింది, టోటల్‌గా ఎంత వచ్చాయనేది చూస్తే.

వీక్ డేస్‌లోనూ దుమ్ములేపుతున్న సూర్య సీన్ మూవీ
సూర్య బ్యాక్ టూ బ్యాక్ హిట్లతో దూసుకుపోతున్నాడు. గతంలో హిట్ కోసం ఎంత స్ట్రగుల్ పడ్డాడో, ఇప్పుడు విజయాలు కూడా అంతే ఈజీగా వస్తున్నాయి. తాజాగా ఆయన `సీన్` మూవీతో థియేటర్లో సందడి చేస్తున్నారు. జీతు మాధవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం గత శుక్రవారం నుంచి థియేటర్లో సందడి చేస్తోంది. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటించిన ఈ మూవీలో నస్లెన్ విలన్‌గా చేశాడు. సూర్య నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద అదిరిపోయే వసూళ్లతో రన్ అవుతుంది. వీకెండ్లోనే కాదు, వీక్ డేస్‌లోనూ దుమ్ములేపుతోంది.
సీన్ మూవీ 6 రోజుల కలెక్షన్లు, తెలుగులో ఎంతంటే?
`సీన్` మూవీ 6వ రోజు రూ.9.35కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ.8కోట్ల నెట్ కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్లో నాలుగు కోట్లు వచ్చాయి. ఓవరాల్‌గా 6వ రోజు రూ.13.40కోట్లు రాబట్టడం విశేషం. టోటల్‌గా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ఆరు రోజుల్లో రూ.188.50కోట్లు వసూలు చేసింది. ఇందులో ఓవర్సీస్లోనే రూ.66కోట్లు రావడం విశేషం. ఇక ఇండియా గ్రాస్ రూ.122.50కోట్లు, రూ.105.45కోట్ల నెట్ వచ్చింది. స్టేట్ వైడ్ కలెక్షన్లు చూస్తే, తెలుగు లో 6వ రోజు రూ.1.90కోట్లు వసూలు చేయగా, మొత్తంగా తెలుగులో రూ. 21.85కోట్లు కలెక్ట్ చేసింది. తమిళంలో రూ.62.80కోట్లు, కర్నాటకలో రూ.12.95కోట్లు, కేరళాలో రూ.22.45కోట్లు, హిందీలో రూ.2.455కోట్లు రాబట్టినట్టు సాక్నిల్క్ సైట్ వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఐదు రోజుల్లోనే రూ.205కోట్లు వసూలు చేసినట్టు టీమ్ అధికారికంగా ప్రకటించడం విశేషం. ఏదేమైనా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతుందని చెప్పొచ్చు.
లాభాల్లోకి సీన్ మూవీ
ఈ సినిమాకి దాదాపు రూ.60కోట్ల బడ్జెట్ అయ్యిందట. నాన్ థియేట్రికల్‌గా ఓటీటీ, శాటిలైట్, ఆడియో రైట్స్ కలుపుకొని దాదాపు రూ.115కోట్ల వరకు వచ్చిందని సమాచారం. రిలీజ్‌కి ముందే నిర్మాతలు లాభాల్లో ఉన్నారు. థియేట్రికల్‌గా ఈ మూవీకి రూ.85కోట్ల వ్యాపారం జరిగిందని సమాచారం. తమిళనాడులో రూ.42కోట్లు, తెలుగు రాష్టాల్లో రూ.14కోట్లు, కర్నాటకలో ఆరు కోట్లు, కేరళాలో ఏడు కోట్లు, ఓవర్సీస్లో రూ.15కోట్లకు అమ్మారట. ఓవర్సీస్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమా అన్నిచోట్ల దాదాపు బ్రేక్ ఈవెన్ అయినట్టు తెలుస్తోంది. ఇంకా ఏదైనా మిగిలితే ఈ వారాంతంలో అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అవుతుందని టాక్.













