- Home
- Entertainment
- Jailer 2 Movie 28 Days Collections: ఓటీటీలోకి జైలర్ 2.. బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన రజనీకాంత్
Jailer 2 Movie 28 Days Collections: ఓటీటీలోకి జైలర్ 2.. బాక్సాఫీసు వద్ద తీవ్రంగా నిరాశ పరిచిన రజనీకాంత్
రజనీకాంత్ హీరోగా రూపొందిన `జైలర్ 2` మూవీ బాక్సాఫీసుని షేక్ చేసింది. కానీ ఓవరాల్‌గా డిజప్పాయింట్ చేసింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానులను తీవ్ర స్థాయిలో నిరాశకు గురి చేసింది. మరి ఏం జరిగిందంటే?

కోలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూవీగా `జైలర్ 2`
`జైలర్` వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రజనీకాంత్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో `జైలర్ 2` వచ్చింది. దానికి సీక్వెల్‌గా దీన్ని తెరకెక్కించారు. రమ్యకృష్ణ, యోగిబాబుతోపాటు ఎస్ జే సూర్య, విద్యాబాలన్ కీలక పాత్రలు పోషించారు. ఎప్పటిలాగే మోహన్‌లాల్, శివరాజ్ కుమార్, జాకీ షరాఫ్ మెరిశారు. వీరితోపాటు హృతిక్ రోషన్ క్యామియో రోల్ లో మెరిసి వాహ్ అనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సునామీ సృష్టించింది. ఇది కోలీవుడ్‌లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
జైలర్ 2 టోటల్ కలెక్షన్లు
`జైలర్ 2` ఇప్పటి వరకు 28 రోజులు పూర్తి చేసుకుంది. ఈ బుధవారం ఇండియా నెట్ రూ.52లక్షలు వసూలు చేసింది. రూ.60లక్షల గ్రాస్‌ని సాధించింది. ఓవర్సీస్లో ఐదు లక్షలు రాబట్టింది. ఓవరాల్ గా 28వ రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.65లక్షలు వసూలు చేసింది. ఇక 28 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.830.30కోట్లు రాబట్టింది. ఇందులో ఇండియా గ్రాస్ రూ.553.25కోట్లు, ఇండియా నెట్ రూ.473.05కోట్లు కాగా, ఓవర్సీస్లో రూ.277.05కోట్లు వచ్చాయి.
జైలర్ 2 తెలుగు కలెక్షన్లు, టోటల్ లాభాల అంచనా
భాషల వారిగా చూస్తే, తెలుగులో రూ.97.21కోట్లు, తమిళంలో రూ.219.20కోట్లు, కర్నాటకలో రూ.95.62కోట్లు, కేరళాలో రూ.79.62కోట్లు, హిందీలో రూ.61.60కోట్లు వసూలు చేసింది. అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ దాటి లాభాల్లో నడించింది. సినిమా హిట్ కావాలంటే సుమారు రూ.300కోట్ల షేర్ రావాలి. సినిమాకి బ్రేక్ ఈవెన్ దాటి సుమారు రూ.100-150కోట్ల షేర్ అధికంగా లాభాలు వచ్చాయి. ఇక దీనికితోడు ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ ఇలా అన్నీ లాభాలే. దీంతో నిర్మాతలకు లాభాలే లాభాలు అని చెప్పొచ్చు. ఈ ప్రాజెక్ట్ మీద నిర్మాత కళానిధి మారన్ సుమారు రూ. 500-600కోట్ల లాభాలను చవిచూశారని టాక్. ఈ స్థాయి లాభాలు పొందిన చిత్రం ఇండియన్ సినిమాలో ఇదే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
వెయ్యి కోట్ల విషయంలో నిరాశ పరిచిన జైలర్ 2
ఇదిలా ఉంటే `జైలర్ 2` మాత్రం తమిళ ఆడియెన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది. ఇప్పటి వరకు అక్కడ వెయ్యి కోట్లు రాబట్టిన సినిమా లేదు. తెలుగులో చాలా సినిమాలున్నాయి. కన్నడలో ఉన్నాయి. హిందీలో చాలా ఉన్నాయి. కానీ తమిళంలో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా వెయ్యి కోట్లు వసూలు చేయలేదు. ఆ లోటుని `జైలర్ 2` భర్తీ చేస్తుందని, వెయ్యి కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందని అంతా భావించారు. ముందు ఆశ చూపించిన ఈ మూవీ చివర్లో డీలా పడింది. మొత్తంగా రూ.830 కోట్ల వద్దే ఆగిపోయింది. ఇప్పటికీ సినిమా థియేటర్లో రన్ అవుతుంది. క్లోజింగ్ కలెక్షన్లు మహా అయితే మరో ఐదారు కోట్లు రావచ్చు. ఎంత చేసినా ఇది రూ.840కోట్ల లోపే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. `జైలర్ 2` ఆ మార్క్ ని టచ్ చేస్తుందని అక్కడి వారు చాలా ఆశలు పెట్టుకున్న నేపథ్యంలో ఇది తీవ్రంగా నిరాశ పరిచిందని చెప్పొచ్చు. దీంతో వెయ్యి కోట్లు అనేది తమిళ ఆడియెన్స్ ఇంకా డ్రీమ్గానే మిగిలిపోయింది.
నేటి నుంచే ఓటీటీలోకి జైలర్ 2
ఇదిలా ఉంటే `జైలర్ 2` ఇప్పుడు థియేట్రికల్‌గా క్లోజింగ్‌కి చేరుకుంది. ఎందుకంటే ఈ చిత్రం నేటి నుంచి ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో నేడు(నవంబర్ 12) నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి థియేట్రికల్‌గా దుమ్ములేపిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి. ఓటీటీలోకి వచ్చిందంటే థియేట్రికల్‌గా సినిమా మరింత డల్ అవుతుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో థియేటర్ నుంచి కలెక్షన్లని పెద్దగా ఆశించలేం. ఓవరాల్‌గా ఈ మూవీ వెయ్యి కోట్లకు చేరడమనేది అసాధ్యం.













