నిఖిల్ ని చూస్తే కిర్రాక్ సీతకి ఫీలింగ్స్ వస్తాయా.. హస్బెండ్ అయితే బావుంటుంది అని ఓపెన్ గా..
కిరాక్ సీత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈమె రచ్చ రచ్చ చేస్తుంది అని అంతా భావించారు. ఎందుకంటే కిరాక్ సీత బయట చాలా బోల్డ్ గా ఉంటుంది. అదే బోల్డ్ నెస్ ని హౌస్ లో కూడా కంటిన్యూ చేస్తుంది అని అనుకున్నారు.
కిరాక్ సీత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈమె రచ్చ రచ్చ చేస్తుంది అని అంతా భావించారు. ఎందుకంటే కిరాక్ సీత బయట చాలా బోల్డ్ గా ఉంటుంది. అదే బోల్డ్ నెస్ ని హౌస్ లో కూడా కంటిన్యూ చేస్తుంది అని అనుకున్నారు. అయితే అంతా అనుకున్నట్లు రెచ్చిపోలేదు కానీ 42 రోజుల పాటు హౌస్ లో పర్వాలేదనిపించింది. ఆ తర్వాత ఎలిమినేట్ అయి బయటకి వచ్చేసింది.
అయితే కిరాక్ సీత హౌస్ లో ఉన్నప్పుడు సెటిల్డ్ గా వ్యవహరించింది. పూర్తిగా సహనం కోల్పోయినట్లు ఎక్కడా ప్రవర్తించలేదు. కొన్ని సార్లు వాదించాల్సి వచ్చినప్పుడు మాత్రం తన ఒరిజినల్ యాటిట్యూడ్ తో రెచ్చిపోయింది. అయితే హద్దులు దాటలేదు. ఈ క్రమంలో కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి. స్మోకింగ్ విషయంలో కూడా ఆమె పేరు వినిపించింది.
బిగినింగ్ లో నిఖిల్ ని చాలా మంది హైలైట్ చేశారు. వారిలో సీత కూడా ఒకరు. ఒక దశలో కిరాక్ సీత నిఖిల్ హస్బెండ్ మెటీరియల్ అంటూ కామెంట్స్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. సీత.. నిఖిల్ కి అంతలా అట్రాక్ట్ అయిందా అంటూ అంతా చర్చించుకున్నారు.
దీని గురించి తాజాగా ఇంటర్వ్యూలో సీత ఆ కామెంట్ గురించి వివరణ ఇచ్చింది. యాంకర్ ప్రశ్నిస్తూ.. నిఖిల్ మీకు బాగా నచ్చాడా, అతడిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయా అంటూ బోల్డ్ గా ప్రశ్నించాడు. కిరాక్ సీత బదులిస్తూ హౌస్ లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరి గురించి పాజిటివ్ గా మాట్లాడాలి, అదే విధంగా వాళ్లలో ఉండే నెగిటివ్స్ కూడా చూపించాలి.
ఆ విధంగా నిఖిల్ గురించి చర్చ వచ్చినప్పుడు అతడి పాజిటివ్స్ చెబుతూ హస్బెండ్ మెటీరియల్ అనే కామెంట్ చేశాను. అందులో వేరే ఉద్దేశం లేదు అని సీత సమాధానం ఇచ్చింది. అదే విధంగా విష్ణుప్రియ, పృథ్వీ లవ్ ట్రాక్ గురించి కూడా ఓపెన్ అయింది. విష్ణుప్రియకి.. పృథ్వీ అంటే చాలా ఇష్టం. అందులో డౌట్ లేదు. నేను విష్ణుని చాలా సార్లు అడిగాను. ఏంటి లవ్ చేస్తున్నావా అని తనని పర్సనల్ గా అడిగాను. ప్రస్తుతానికి ఫ్రెండ్ షిప్ మాత్రమే.. అది ప్రేమగా మారాలి అంటే చాలా టైం పడుతుంది అని చెప్పినట్లు కిరాక్ సీత కామెంట్స్ చేసింది.