- Home
- Entertainment
- ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో సినిమాలకు దూరం.. 35 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
ఆ ఒక్క ఇన్సిడెంట్‌తో సినిమాలకు దూరం.. 35 ఏళ్ల తర్వాత రీ-ఎంట్రీ.. ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.?
Kalyan Chakravarthy: పైన పేర్కొన్న ఫోటోలోని హీరో ఎవరో గుర్తుపట్టారా.? వందల కొద్ది సినిమాలు చేశాడు. కానీ ఒక్క సంఘటనతో సినిమాలకు దూరమయ్యాడు. మరి ఆ సంఘటన ఏంటి.? అతడు ఎవరు.? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..
ఈ నందమూరి హీరో ఇండస్ట్రీకి దూరమై దాదాపుగా 35 ఏళ్లు అవుతోంది. అయితే ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటించిన ఛాంపియన్ మూవీతో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా.? మరెవరో కాదు.. సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కొడుకు నందమూరి కళ్యాణ్ చక్రవర్తి. 1986లో కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన అత్తగారు స్వాగతం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు కళ్యాణ్ చక్రవర్తి. వందల కొద్ది సినిమాల్లో హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఇండస్ట్రీ కొత్తల్లో డ్రీమ్ బాయ్..
అప్పట్లో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణ్ చక్రవర్తి బోలెడన్ని సినిమాల్లో నటించి.. డ్రీమ్ బాయ్ గా పేరు తెచ్చుకున్నాడు. అయితే అప్పట్లో ఎంతో సాఫీగా సాగిపోతున్న కళ్యాణ్ చక్రవర్తి జీవితాన్ని, సినీ జీవితాన్ని ఓ విషాద ఘటన కుదిపేసింది. అదే రోడ్డు యాక్సిడెంట్. ఓ రోడ్డు యాక్సిడెంట్‌లో కళ్యాణ్ చక్రవర్తి తన సోదరుడిని కోల్పోయాడు. అలాగే తండ్రి మంచానపడ్డాడు. ఇదే కళ్యాణ్ చక్రవర్తి జీవితాన్ని మార్చేసింది.
రోడ్డు యాక్సిడెంట్స్ కొత్తేమి కాదు..
నందమూరి ఫ్యామిలీకి రోడ్డు యాక్సిడెంట్‌లు కొత్తేమి కాదు. రోడ్డు ప్రమాదాల్లో నందమూరి హీరోలకు శాపంగా మారాయి. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. అలాగే సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు ఫ్యామిలీ కూడా రోడ్డు ప్రమాదం బారిన పడింది. త్రివిక్రమ రావు కొడుకు హరిన్ చక్రవర్తి మరణించగా.. త్రివిక్రమరావు తీవ్రంగా గాయపడ్డాడు.
ఆ ఘటనతో కెరీర్ క్లోజ్..
ఈ విషాద ఘటనతో కళ్యాణ్ చక్రవర్తి పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇంటికే పరిమితమయ్యాడు. ఇంటి దగ్గరే ఉంటూ తండ్రి ఆలనా పాలన చూసుకున్నాడు. అలా కళ్యాణ్ చక్రవర్తి పూర్తిగా సినిమాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడు మళ్లీ దాదాపు 35 సంవత్సరాలకు రోషన్ మేక నటిస్తున్న ఛాంపియన్ మూవీతో కళ్యాణ్ చక్రవర్తి టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
పవర్‌ఫుల్ రోల్..
ఛాంపియన్ మూవీలో కళ్యాణ్ చక్రవర్తి పూర్తిగా ఫుల్ లెంగ్త్ రోల్‌లో కనిపించనున్నాడు. ఈ విషయాన్ని ఛాంపియన్ మేకర్స్ అఫీషియల్ గా కళ్యాణ్ చక్రవర్తి పోస్టర్ తో కన్ఫామ్ చేసిన సంగతి తెలిసిందే. అలా 35 ఏళ్ల తర్వాత కళ్యాణ్ చక్రవర్తి తిరిగి రీ-ఎంట్రీ ఇస్తున్నాడు. 2003లో వచ్చిన కబీర్ దాస్ సినిమాలో కళ్యాణ్ చక్రవర్తి కనిపించినప్పటికీ అది జస్ట్ క్యామియో అని చెప్పొచ్చు.

