- Home
- Entertainment
- డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
డ్రింక్ తాగు, పార్టీ చేసుకో.. ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు.! క్రేజీ హీరోయిన్‌కి తల్లి బోల్డ్ సలహా
Roshni Walia: ఎప్పుడూ స్వేఛ్చగా బతకాలని, జీవితాన్ని ఎలప్పుడూ ఆస్వాదించాలని తన తల్లి చెబుతూ ఉంటుందని బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ రోష్ని వాలియా చెప్పింది. అలాగే తన తల్లి ఇచ్చిన బోల్డ్ సలహా ఏంటో కూడా పేర్కొంది. అదేంటంటే.?

క్రెడిట్ అంతా తల్లిదే..
బాలీవుడ్ హీరోయిన్ రోష్ని వాలియా ఇటీవల ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి కీలక విషయాలను పంచుకుంది. తన తల్లి ఎన్నో త్యాగాలు చేసినందుకే.. ఇప్పుడు తాను ఈ స్థితిలో ఉన్నానని పేర్కొంది. 'నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి క్రెడిట్ అంతా నా తల్లికే చెందుతుంది' అని రోష్ని పేర్కొంది. తన తల్లి స్వస్థలాన్ని వదిలేసి తనకోసం ముంబైకి వచ్చేసిందని.. తనను, తన కలలను సాకారం చేసుకునేందుకు.. ఆమె ఎంతగానో త్యాగం చేసిందని.. దాని వల్లే తాను ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపింది.
ఎన్నో అనుభవాలు..
చిన్నతనం నుంచి అనుభవం ఉన్న ఆర్టిస్టులతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోయిన్ రోష్ని.. వారి నుంచి ఎన్నో నేర్చుకున్నానని.. పరిశ్రమ రాజకీయాలు వంటపట్టేశాయని చెప్పింది. ఇదంతా కూడా సరికొత్త అనుభవం అని రోష్ని వాలియా తెలిపింది. సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ దూసుకుపోతోంది రోష్ని.
ఫ్రీడమ్ ఇచ్చింది..
తన తల్లి తనకు చిన్నతనం నుంచి ఎంతగానో ఫ్రీడమ్ ఇచ్చిందని పేర్కొంది. 'నా తల్లి వల్లే నేను ఇలా ఎదిగాను. ఆమె నాకు కావల్సినంత స్వేచ్ఛను ఇవ్వడమే కాదు.. కావల్సినప్పుడల్లా గైడెన్స్ ఇచ్చేది'. ఆమె రూల్స్ ఎప్పుడూ తనకు ప్రెజర్ ఇవ్వవని.. ట్రెండీగా అనిపిస్తాయని నవ్వుతూ చెప్పింది రోష్ని వాలియా.
ప్రొటెక్షన్ మాత్రం మర్చిపోకు..
ఎదిగిన అమ్మాయిలకు ప్రతీ పేరెంట్స్ కొన్ని రూల్స్ పెడుతుంటారు. అయితే ఆ రూల్స్‌పై మాట్లాడుతూ.. తన తల్లి ఎప్పుడూ తనను అలా నిర్బందించలేదని చెప్పింది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన అమ్మాయికి ఇలాంటి రూల్స్ చాలా అరుదు. 'మా అమ్మ ఎలప్పుడూ నన్ను ప్రోత్సహించేది. ఎప్పుడూ ప్రొటెక్షన్ ముఖ్యమని' గుర్తు చేసేది. తనకే కాదు తన సోదరికి కూడా ఇదే విషయాన్ని చెప్పేదని పేర్కొంది
డ్రింక్ తాగు, పార్టీ చేసుకో..
తన తల్లి తనను ఎప్పుడూ జీవితాన్ని ఆస్వాదించాలని చెప్పేది. 'ఈ రాత్రి నువ్వు ఇంట్లో ఎందుకు ఉంటున్నావు? పార్టీకి వెళ్లి ఎంజాయ్ చేయి! ఈ రోజు నువ్వు తాగలేదా?' అంటూ నవ్వుతూ అడిగేది. డ్రింక్స్ తాగు, పార్టీ చేసుకో.. కానీ ప్రొటెక్షన్ మాత్రం చాలా ముఖ్యం అని ప్రతీసారి తన తల్లి గుర్తు చేస్తుందని రోష్ని వాలియా చెప్పింది.

